5 : 111
وَإِذۡ أَوۡحَيۡتُ إِلَى ٱلۡحَوَارِيِّـۧنَ أَنۡ ءَامِنُواْ بِي وَبِرَسُولِي قَالُوٓاْ ءَامَنَّا وَٱشۡهَدۡ بِأَنَّنَا مُسۡلِمُونَ
మరియు నేను, (ఈసా) శిష్యుల (హవారియ్యూన్ ల) మనస్సులలో ఇలా మాట వేసినప్పుడు: "నన్ను మరియు నా ప్రవక్తను విశ్వసించండి." వారన్నారు: " మేము విశ్వసించాము మరియు మేము ముస్లింలను అయ్యాము అనే మాటకు సాక్షిగా ఉండు!"
Explanation & meanings · 1
- ఇక్కడ అవ్'హయ్ త అంటే వ'హీ. కాని ఈ పదానికి ఇక్కడ శిష్యుల మనస్సులో ఆలోచన వేయబడిందని అర్థం. ఇదే విధంగా 'ఈసా ('అ.స.) తల్లి మర్యమ్ ('అ.స.) మనస్సులో మరియు మూసా ('అ.స.) తల్లి మనస్సులో మాట వేయబడి వుండెను. వ'హీ కేవలం ప్రవక్తల పైననే అవతరింపజేయబడుతుంది.