29 : 38
وَعَادٗا وَثَمُودَاْ وَقَد تَّبَيَّنَ لَكُم مِّن مَّسَٰكِنِهِمۡۖ وَزَيَّنَ لَهُمُ ٱلشَّيۡطَٰنُ أَعۡمَٰلَهُمۡ فَصَدَّهُمۡ عَنِ ٱلسَّبِيلِ وَكَانُواْ مُسۡتَبۡصِرِينَ
మరియు వాస్తవంగా, ఆద్ మరియు సమూద్ జాతల వారి (వినాశ) విషయం (మిగిలి పోయిన) వారి నివాస స్థలాల నుండి, మీకు స్పష్టంగా తెలుస్తుంది. వాస్తవానికి, వారు (సత్యాన్ని) గ్రహించే వారు అయినప్పటికీ, షైతాన్ వారి కర్మలను వారికి మంచివిగా కనబడేటట్లు చేశాడు. ఆ తరువాత వారిని (ఋజు) మార్గం నుండి తొలగించాడు.
Explanation & meanings · 1
- 'ఆద్ జాతి వారి నివాసం - అ'హ్ ఖాఫ్ - యమన్, లోని హ'దరమౌత్ దగ్గర ఉంది. స'మూద్ జాతి వారి నివాసం మదాయన్ 'సాలి'హ్, అనే ప్రాంతంలో మదీనా మునవ్వరా - తబూక్ ల మధ్య స'ఊది 'అరేబియాలో ఉంది. ఇది 'హిజా'జ్ ఉత్తర ప్రాంతంలో ఉంది. చూడండి, 9:7.