24 : 39
وَٱلَّذِينَ كَفَرُوٓاْ أَعۡمَٰلُهُمۡ كَسَرَابِۭ بِقِيعَةٖ يَحۡسَبُهُ ٱلظَّمۡـَٔانُ مَآءً حَتَّىٰٓ إِذَا جَآءَهُۥ لَمۡ يَجِدۡهُ شَيۡـٔٗا وَوَجَدَ ٱللَّهَ عِندَهُۥ فَوَفَّىٰهُ حِسَابَهُۥۗ وَٱللَّهُ سَرِيعُ ٱلۡحِسَابِ
ఇక సత్యాన్ని తిరస్కరించిన వారి కర్మలను ఎడారిలోని ఎండమావితో పోల్చ వచ్చు. దప్పిక గొన్నవాడు - దానిని నీరుగా భావించి దాని వద్దకు చేరి, చివరికి ఏమీ పొందలేక - అక్కడ అల్లాహ్ ను పొందుతాడు. అప్పుడు ఆయన అతని లెక్కను పూర్తిగా తీర్చుతాడు. మరియు అల్లాహ్ లెక్క తీర్చటంలో అతి శీఘ్రుడు.
Explanation & meanings · 1
- అంటే సత్యతిరస్కారుడు ఎన్ని మంచిపనులు, సత్కార్యాలు చేసినా అవి పరలోకంలో ఎండమావులుగా అదృశ్యమైపోతాయి. అంటే అతనికి వాటి నుండి ఎట్టి పుణ్యఫలితం లభించదు. అతడు నరకంతో చేరిపోతాడు.