Skip to content
النور /

ఆయత్ 33

24 : 33

ఆయత్ 33 of النور (24 : 33). This page carries the verse in the Uthmani script with a translation of its meaning, at a stable URL that can be cited on its own.

النور ఆయతులు 64
సూరా · النور
తెలుగు · Muhammad
24 : 33

وَلۡيَسۡتَعۡفِفِ ٱلَّذِينَ لَا يَجِدُونَ نِكَاحًا حَتَّىٰ يُغۡنِيَهُمُ ٱللَّهُ مِن فَضۡلِهِۦۗ وَٱلَّذِينَ يَبۡتَغُونَ ٱلۡكِتَٰبَ مِمَّا مَلَكَتۡ أَيۡمَٰنُكُمۡ فَكَاتِبُوهُمۡ إِنۡ عَلِمۡتُمۡ فِيهِمۡ خَيۡرٗاۖ وَءَاتُوهُم مِّن مَّالِ ٱللَّهِ ٱلَّذِيٓ ءَاتَىٰكُمۡۚ وَلَا تُكۡرِهُواْ فَتَيَٰتِكُمۡ عَلَى ٱلۡبِغَآءِ إِنۡ أَرَدۡنَ تَحَصُّنٗا لِّتَبۡتَغُواْ عَرَضَ ٱلۡحَيَوٰةِ ٱلدُّنۡيَاۚ وَمَن يُكۡرِههُّنَّ فَإِنَّ ٱللَّهَ مِنۢ بَعۡدِ إِكۡرَٰهِهِنَّ غَفُورٞ رَّحِيمٞ

ఎవరికైతే, పెండ్లి చేసుకునే శక్తి లేదో వారు, అల్లాహ్ తన అనుగ్రహంతో వారిని ధనవంతులుగా చేసే వరకు శీలశుద్ధతను పాటించాలి. మరియు మీ బానిసలలో ఎవరైనా స్వేచ్ఛాపత్రం వ్రాయించుకోగోరితే వారి యందు మీకు మంచితనం కనబడితే, వారికి స్వేచ్ఛాపత్రం వ్రాసి ఇవ్విండి. అల్లాహ్ మీకు ఇచ్చిన ధనం నుండి వారికి కూడా కొంత ఇవ్వండి. మీరు ఇహలోక ప్రయోజనాల నిమిత్తం, మీ బానిస స్త్రీలు శీలవతులుగా ఉండగోరితే వారిని వ్యభిచారానికి బలవంతపెట్టకండి, ఎవరైనా వారిని బలవంతపెడితే! నిశ్చయంగా, అల్లాహ్ వారిని (ఆ బానిస స్త్రీలకు) బలాత్కారం తరువాత క్షమించేవాడు, అపార కరుణా ప్రదాత.

Explanation & meanings · 3
  1. ఇలాంటి వారు నఫిల్ ఉపవాసాలు ఉండాలి. దాని వల్ల వారు తమ మనస్సును అదుపులో ఉంచుకోగలరు, ('స'హీ'హ్ బు'ఖారీ).
  2. మీ బానిసలు స్వేచ్ఛగోరి - మీరు వారితో వారి స్వేచ్ఛకొరకు కుదుర్చుకున్న - మీ సొమ్మును కొంతకాలంలో ఇవ్వటానికి ఒప్పుకుంటే! దానిని ఒక పత్రం మీద వ్రాయించుకొని వారికి స్వేచ్ఛనివ్వండి. అంటే ఇస్లాం బానిసత్వాన్ని నిర్మూలించటానికి మొదట నుండియే పాటుపడుతున్నది. చూడండి, 9:60. 'జకాత్ డబ్బును, బానిసల స్వేచ్ఛ కొరకు ఉపయోగించండని ఆజ్ఞ ఉంది.
  3. ఇస్లాంకు పూర్వం, ప్రజలు తమ బానిస స్త్రీలతో వ్యభిచారం చేయించి ఆ సొమ్ము తినేవారు. ఇది ఇస్లాంలో నిషేధించబడింది.