24 : 32
وَأَنكِحُواْ ٱلۡأَيَٰمَىٰ مِنكُمۡ وَٱلصَّٰلِحِينَ مِنۡ عِبَادِكُمۡ وَإِمَآئِكُمۡۚ إِن يَكُونُواْ فُقَرَآءَ يُغۡنِهِمُ ٱللَّهُ مِن فَضۡلِهِۦۗ وَٱللَّهُ وَٰسِعٌ عَلِيمٞ
మీలోని పెండ్లికాని వారికి మరియు శీలవతులైన మీ బానిస పురుషులు మరియు బానిస స్త్రీలకు వివాహాలు చేయించండి. ఒకవేళ వారు పేదవారయితే, అల్లాహ్ తన అనుగ్రహంతో వారిని సంపన్నులగా చేయవచ్చు! మరియు అల్లాహ్ సర్వవ్యాప్తి, సర్వజ్ఞుడు.
Explanation & meanings · 1
- అ'యామా, అయ్యిమున్ (ఏ.వ.): అంటే, కన్య, విధవ, విడాకురాలు - మూడు రకాల స్త్రీలు మరియు భార్య లేని పురుషుడు కూడా, దైవప్రవక్త ('స'అస) ప్రవచనం:"ఎవడైతే నా సున్నత్ ను తిరస్కరిస్తాడో వాడు నావాడు కాడు!" ('స'హీ'బ్ బు'ఖారీ - 5063, ముస్లిం - 1023)