22 : 15
مَن كَانَ يَظُنُّ أَن لَّن يَنصُرَهُ ٱللَّهُ فِي ٱلدُّنۡيَا وَٱلۡأٓخِرَةِ فَلۡيَمۡدُدۡ بِسَبَبٍ إِلَى ٱلسَّمَآءِ ثُمَّ لۡيَقۡطَعۡ فَلۡيَنظُرۡ هَلۡ يُذۡهِبَنَّ كَيۡدُهُۥ مَا يَغِيظُ
ఎవడైతే - ఇహలోకంలో మరియు పరలోకంలో కూడా - అల్లాహ్, అతనికి (ప్రవక్తకు) సహాయపడడని భావిస్తాడో! (వాడికి సాధ్యమైతే) వాడిని ఒక త్రాడు సహాయంతో ఆకాశంపైకి పోయి, తరువాత వాటిని (అంటే ప్రవక్తపై అవతరింప జేయబడే వహీ మరియు ఇతర సహాయాలను) త్రెంపి చూడమను, అతడి ఈ యుక్తి అతడి క్రోధావేశాన్ని దూరం చేయగలదేమో!
Explanation & meanings · 1
- పైది ఇమామ్ అష్-షౌకాని (ర'హ్మ) గారి తాత్పర్యం. ఇమామ్ ఇబ్నె-కసీ'ర్ (ర'హ్మ) గారి తాత్పర్యం ఇలా ఉంది: 'ఎవడైతే ఇహలోకంలో మరియు పరలోకంలో కూడా అల్లాహ్, దైవప్రవక్తకు సహాయపడడని భావిస్తాడో! వాడిని (తన ఇంటి) కప్పుకు ఒక త్రాడు వేసి దానితో ఉరి వేసుకొని చూడమను. అతడి ఈ యుక్తి అతడి క్రోధావేశాన్ని దూరం చేయగలదేమో!'