Skip to content
البَقَرَة /

ఆయత్ 284

2 : 284

ఆయత్ 284 of البَقَرَة (2 : 284). This page carries the verse in the Uthmani script with a translation of its meaning, at a stable URL that can be cited on its own.

البَقَرَة ఆయతులు 286
సూరా · البَقَرَة
తెలుగు · Muhammad
2 : 284

لِّلَّهِ مَا فِي ٱلسَّمَٰوَٰتِ وَمَا فِي ٱلۡأَرۡضِۗ وَإِن تُبۡدُواْ مَا فِيٓ أَنفُسِكُمۡ أَوۡ تُخۡفُوهُ يُحَاسِبۡكُم بِهِ ٱللَّهُۖ فَيَغۡفِرُ لِمَن يَشَآءُ وَيُعَذِّبُ مَن يَشَآءُۗ وَٱللَّهُ عَلَىٰ كُلِّ شَيۡءٖ قَدِيرٌ

ఆకాశాలలో మరియు భూమిలో ఉన్నదంతా అల్లాహ్ దే! మీరు మీ మనస్సులలో ఉన్నది, వెలుబుచ్చినా లేక దాచినా అల్లాహ్ మీ నుంచి దాని లెక్క తీసుకుంటాడు. మరియు ఆయన తాను కోరిన వానిని క్షమిస్తాడు మరియు తాను కోరిన వానిని శిక్షిస్తాడు. మరియు అల్లాహ్ ప్రతిదీ చేయగల సమర్ధుడు.

Explanation & meanings · 1
  1. ఆ ఆయత్ అవతరింపజేయబడినపుడు స'హాబీలు దైవప్రవక్త ('స'అస) దగ్గర హాజరై ఇలా విన్నవించుకున్నారు: "ఓ ప్రవక్తా('స'అస)! నమా'జ్, ఉపవాసం, 'జకాత్ మరియు జిహాద్ మా శక్కికి మించినవి కావు. కాని మనస్సులో పుట్టే ఆలోచనలపై మాకు అదుపు లేదు కదా! అయినా అల్లాహుతా'ఆలా వాటి లెక్క తీసుకుంటానని అంటున్నాడు కదా!" అప్పుడు దైవప్రవక్త ('స'అస) ఇలా సెలవిచ్చారు: "మీరిప్పుడు కేవలం విన్నాము మరియు విధేయుల మయ్యాము" అని మాత్రమే అనండి. అప్పుడు అల్లాహ్ (సు.తా.) ఈ ఆయత్ అవతరిపజేశాడు: "అల్లాహ్ ఏ ప్రాణిపైననూ దాని శక్తికి మించిన భారం వేయడు." (ఇబ్నె - కసీ'ర్, ఫ'త్తహ అల్ ఖదీర్). దీనిని గురించి ఇంకా ఈ 'హదీస్' కూడా ఉంది: "అల్లాహుతా'ఆలా నా ఉమ్మత్ వారి మనస్సులలో వచ్చిన విషయాలను క్షమిస్తాడు. కాని నాలుకతో పలికిన దానిని మరియు అమలు పరచిన దానిని లెక్కలోకి తీసుకుంటాడు." (బు'ఖారీ, ముస్లిం).