Skip to content
البَقَرَة /

ఆయత్ 215

2 : 215

ఆయత్ 215 of البَقَرَة (2 : 215). This page carries the verse in the Uthmani script with a translation of its meaning, at a stable URL that can be cited on its own.

البَقَرَة ఆయతులు 286
సూరా · البَقَرَة
తెలుగు · Muhammad
2 : 215

يَسۡـَٔلُونَكَ مَاذَا يُنفِقُونَۖ قُلۡ مَآ أَنفَقۡتُم مِّنۡ خَيۡرٖ فَلِلۡوَٰلِدَيۡنِ وَٱلۡأَقۡرَبِينَ وَٱلۡيَتَٰمَىٰ وَٱلۡمَسَٰكِينِ وَٱبۡنِ ٱلسَّبِيلِۗ وَمَا تَفۡعَلُواْ مِنۡ خَيۡرٖ فَإِنَّ ٱللَّهَ بِهِۦ عَلِيمٞ

(ఓ ముహమ్మద్!) వారు (ప్రజలు) నిన్ను అడుగుతున్నారు: "మేము ఏమి ఖర్చు చేయాలి?" అని. వారితో అను: "మీరు మంచిది ఏది ఖర్చు చేసినా సరే, అది మీ తల్లిదండ్రుల, బంధువుల, అనాథుల, యాచించని పేదల (మసాకీన్) మరియు బాటసారుల కొరకు ఖర్చు చేయాలి. మరియు మీరు ఏ మంచిపని చేసినా అది అల్లాహ్ కు తప్పక తెలుస్తుంది."

Explanation & meanings · 1
  1. ఈ ఖర్చు, నఫిల్ 'సదఖాత్ గురించి ఉంది. విధిగా ఇవ్వవలసిన 'జకాత్ కాదు. ఎందుకంటే, తల్లిదండ్రులకు 'జకాత్ చెల్లదు. వారిని పోషించటం కుమారుల బాధ్యత. మైమూన్ బిన్ మహ్రాన్ అన్నారు: 'గమనించవలసిన విషయం ఏమిటంటే ఈ ఖర్చు చేయటంలో, ఇంట్లో పెట్టే డ్రాయింగ్స్ గానీ, లేక సంగీత సాధనాలు గానీ, లేక ఇంటి అలంకరణకు వేసే పర్దాలు గానీ లేవు.' అంటే ఇలాంటి వస్తువుల మీద ఖర్చు చేయటం అవాంఛనీయమైన వ్యర్థపు ఖర్చే.