Skip to content
البَقَرَة /

ఆయత్ 200

2 : 200

ఆయత్ 200 of البَقَرَة (2 : 200). This page carries the verse in the Uthmani script with a translation of its meaning, at a stable URL that can be cited on its own.

البَقَرَة ఆయతులు 286
సూరా · البَقَرَة
తెలుగు · Muhammad
2 : 200

فَإِذَا قَضَيۡتُم مَّنَٰسِكَكُمۡ فَٱذۡكُرُواْ ٱللَّهَ كَذِكۡرِكُمۡ ءَابَآءَكُمۡ أَوۡ أَشَدَّ ذِكۡرٗاۗ فَمِنَ ٱلنَّاسِ مَن يَقُولُ رَبَّنَآ ءَاتِنَا فِي ٱلدُّنۡيَا وَمَا لَهُۥ فِي ٱلۡأٓخِرَةِ مِنۡ خَلَٰقٖ

ఇక మీ (హజ్జ్) విధులను పూర్తి చేసిన తరువాత, మీరు మీ తండ్రితాతలను (పూర్వం) స్మరించే విధంగా, ఇంకా దాని కంటే అధికంగా అల్లాహ్ ను స్మరించండి. కాని వారిలో కొందరు: "ఓ మా ప్రభూ! మాకు ఈ లోకంలో (అన్నీ) ప్రసాదించు!" అని ప్రార్థిస్తారు. అలాంటి వారికి పరలోకంలో ఎలాంటి భాగం ఉండదు.

Explanation & meanings · 1
  1. మిగిలిన 'హజ్ విధులు 10,11,12 మరియు 13 జిల్ 'హజ్ లో తేదీలలో పూర్తి చేయాలి. ఈ రోజులలో ఇ'హ్రామ్ లేకుండానే మక్కాకు పోయి తవాఫె 'జియారహ్ మరియు స'యీ అల్ - 'హజ్ పూర్తి చేసుకోవాలి. ఈ మూడు రోజులు మీనాలోనే ఉండి, అల్లాహ్ (సు.తా.) ను ప్రార్థించాలి. 10వ తేదీన సూర్యోదయం తరువాత కేవలం చివరి (జమరతుల్ - 'అఖబహ్)పై - ఏదైతే మక్కా వైపుకు ఉందో 7 చిన్న చిన్న కంకర రాళ్ళు రువ్వాలి. 11 మరియు 12 తేదీలలో "జుహ్ర్ నమా'జ్ తరువాత మూడు జమరాత్ ల పైననూ ఒక్కొక్క దానిపై 7 చొప్పున కంకర రాళ్ళు రువ్వాలి. జమరాత్ : అంటే ఇస్మా'ఈల్ ('అ.స.)ను అతని తండ్రి ఇబ్రాహీమ్ ('అ.స.), అల్లాహుతా'ఆలా ఆజ్ఞతో జి'బ్హ్ చేయటానికి తీసుకొని పోయేటప్పుడు, షై'తాన్ వారిని, అల్లాహుతా'ఆలా ఆజ్ఞను ఉల్లంఘించటానికి, ప్రేరేపించిన మూడు చోట్లలో నియమించిన గుర్తులు.