Skip to content
అల్-బఖరహ్ /

ఆయత్ 190

2 : 190

ఆయత్ 190 of అల్-బఖరహ్ (2 : 190). This page carries the verse in the Uthmani script with a translation of its meaning, at a stable URL that can be cited on its own.

అల్-బఖరహ్ ఆయతులు 286
సూరా · అల్-బఖరహ్
తెలుగు · Muhammad
2 : 190

وَقَٰتِلُواْ فِي سَبِيلِ ٱللَّهِ ٱلَّذِينَ يُقَٰتِلُونَكُمۡ وَلَا تَعۡتَدُوٓاْۚ إِنَّ ٱللَّهَ لَا يُحِبُّ ٱلۡمُعۡتَدِينَ

మరియు మీతో, పోరాడే వారితో, మీరు అల్లాహ్ మార్గంలో పోరాడండి. కాని హద్దులను అతిక్రమించకండి. నిశ్చయంగా, అల్లాహ్ హద్దులను అతిక్రమించేవారిని ప్రేమించడు.

Explanation & meanings · 1
  1. ఈ ఆయత్ లో జిహాద్: ధర్మపోరాటం, అంటే ఎవరైతే మీతో పోరాడుతారో, అలాంటి వారితో మీరు పోరాడండని అనుమతి ఇవ్వబడింది. చూడండి 22:39. ఆ ఆయత్ జిహాద్ ను గురించి మొదటి సారిగా అవతరింపబడిందని చాలా మంది 'హదీస్' వేత్తలు వ్రాశారు, ('తబరీ, ఇబ్నె-కసీ'ర్). హద్దులను అతిక్రమించకూడదు అంటే, స్త్రీల, పిల్లల, వృద్ధుల హత్య చేయకూడదు. ఎవరైతే మీతో పోరాడుతారో, వారినే వధించాలి. ఇదే విధంగాపంట పొలాలను, చెట్లుచేమలను, పశువులను, అనవసరంగా పాడు చేయరాదు. జిహాద్ గురించి 4:91, 60:8 మరియు 'స. బు'ఖారీ, పుస్తకం - 4, 'హదీస్' నం. 4 చూడండి.