Skip to content
البَقَرَة /

ఆయత్ 178

2 : 178

ఆయత్ 178 of البَقَرَة (2 : 178). This page carries the verse in the Uthmani script with a translation of its meaning, at a stable URL that can be cited on its own.

البَقَرَة ఆయతులు 286
సూరా · البَقَرَة
తెలుగు · Muhammad
2 : 178

يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ كُتِبَ عَلَيۡكُمُ ٱلۡقِصَاصُ فِي ٱلۡقَتۡلَىۖ ٱلۡحُرُّ بِٱلۡحُرِّ وَٱلۡعَبۡدُ بِٱلۡعَبۡدِ وَٱلۡأُنثَىٰ بِٱلۡأُنثَىٰۚ فَمَنۡ عُفِيَ لَهُۥ مِنۡ أَخِيهِ شَيۡءٞ فَٱتِّبَاعُۢ بِٱلۡمَعۡرُوفِ وَأَدَآءٌ إِلَيۡهِ بِإِحۡسَٰنٖۗ ذَٰلِكَ تَخۡفِيفٞ مِّن رَّبِّكُمۡ وَرَحۡمَةٞۗ فَمَنِ ٱعۡتَدَىٰ بَعۡدَ ذَٰلِكَ فَلَهُۥ عَذَابٌ أَلِيمٞ

ఓ విశ్వాసులారా! హత్య విషయంలో మీ కొరకు న్యాయప్రతీకారం (ఖిసాస్) నిర్ణయించబడింది. ఆ హత్య చేసిన వాడు, స్వేచ్ఛగలవాడైతే ఆ స్వేచ్ఛాపరుణ్ణి, బానిస అయితే ఆ బానిసను, స్త్రీ అయితే ఆ స్త్రీని (వధించాలి). ఒకవేళ హతుని సోదరులు (కుటుంబీకులు) హంతకుణ్ణి కనికరించదలిస్తే, ధర్మయుక్తంగా రక్తశుల్క నిర్ణయం జరగాలి. హంతకుడు రక్తధనాన్ని, ఉత్తమరీతిలో అతనికి చెల్లించాలి. ఇది మీ ప్రభువు తరఫు నుండి మీకు లభించే సౌకర్యం, కారుణ్యం. దీని తర్వాత కూడా ఈ హద్దును అతిక్రమించే వానికి బాధాకరమైన శిక్ష ఉంటుంది.

Explanation & meanings · 2
  1. ఇది ఇస్లాంకు ముందు అరబ్బులలో ఉన్న దురాచారాన్ని ఖండిస్తోంది. వారు ఒక మగ హంతకునికి బదులుగా అతని కుటుంబంలో అనేక మంది మగవారిని, ఒక స్త్రీ హంతకురాలికి బదులుగా ఆమె కుటుంబంలోని పురుషుణ్ణి లేక ఒక బానిస హంతకునికి బదులుగా ఒక స్వతంత్ర పురుషుణ్ణి హత్య చేసేవారు.
  2. చూడండి, 55:60.