Skip to content
البَقَرَة /

ఆయత్ 138

2 : 138

ఆయత్ 138 of البَقَرَة (2 : 138). This page carries the verse in the Uthmani script with a translation of its meaning, at a stable URL that can be cited on its own.

البَقَرَة ఆయతులు 286
సూరా · البَقَرَة
తెలుగు · Muhammad
2 : 138

صِبۡغَةَ ٱللَّهِ وَمَنۡ أَحۡسَنُ مِنَ ٱللَّهِ صِبۡغَةٗۖ وَنَحۡنُ لَهُۥ عَٰبِدُونَ

(వారితో ఇలా అను): "(మీరు) అల్లాహ్ రంగును (ధర్మాన్ని) స్వీకరించండి. మరియు అల్లాహ్ కంటే మంచి రంగు (ధర్మం) ఎవరిది? మరియు మేము ఆయనను మాత్రమే ఆరాధించేవారము."

Explanation & meanings · 1
  1. దీని మరొక తాత్పర్యం ఇలా ఉంది: 'అల్లాహ్ రంగును (ధర్మాన్ని) ఎంచుకోండి. మరియు అల్లాహ్ రంగు (ధర్మం) కంటే ఉత్తమమైన రంగు (ధర్మం) ఎవరిది? మరియు మేము ఆయనను మాత్రమే ఆరాధించే వారము.' క్రైస్తవులు ఒక పసుపురంగు చేసి ఉంచుతారు. బిడ్డ పుట్టినా లేక ఎవడైనా క్రైస్తవ మతం అవలంబించినా! వారు, అతనిని ఆ రంగులో ముంచి: 'పవిత్రమైన క్రైస్తవుడయ్యాడు.' అని అంటారు. దీనిని బాప్టిసం (Baptism) అంటారు. ఈ ఆచారాన్ని ఖండిస్తూ : అల్లాహ్ (సు.తా.) రంగు (ధర్మం) అంటే ఇస్లాం ధర్మమే, అంటే అల్లాహ్ (సు.తా.) కు విధేయులై కేవలం ఆయననే ఆరాధించడం. ఇదే ప్రవక్తలందరూ బోధించిన ధర్మం, అని విశదపరచబడింది.