Skip to content
البَقَرَة /

ఆయత్ 124

2 : 124

ఆయత్ 124 of البَقَرَة (2 : 124). This page carries the verse in the Uthmani script with a translation of its meaning, at a stable URL that can be cited on its own.

البَقَرَة ఆయతులు 286
సూరా · البَقَرَة
తెలుగు · Muhammad
2 : 124

۞ وَإِذِ ٱبۡتَلَىٰٓ إِبۡرَٰهِـۧمَ رَبُّهُۥ بِكَلِمَٰتٖ فَأَتَمَّهُنَّۖ قَالَ إِنِّي جَاعِلُكَ لِلنَّاسِ إِمَامٗاۖ قَالَ وَمِن ذُرِّيَّتِيۖ قَالَ لَا يَنَالُ عَهۡدِي ٱلظَّٰلِمِينَ

మరియు ఇబ్రాహీమ్ ను అతని ప్రభువు (కొన్ని) ఉత్తరువులిచ్చి పరీక్షించిన విషయాన్ని (జ్ఞాపకం చేసుకోండి). వాటి అన్నింటిలో అతను నెగ్గాడు. అప్పుడు ఆయన (అల్లాహ్): "నిశ్చయంగా, నేను నిన్ను మానవ జాతికి నాయకునిగా చేస్తున్నాను." అని అన్నాడు. (దానికి ఇబ్రాహీమ్): "మరి నా సంతతి వారు?" అని అడిగాడు. (దానికి అల్లాహ్): "నా వాగ్దానం దుర్మార్గులైన వారికి వర్తించదు." అని జవాబిచ్చాడు.

Explanation & meanings · 2
  1. అల్లాహ్ (సు.తా.) ఇబ్రాహీమ్ ('అ.స.) యొక్క ఈ విన్నపాన్ని పూర్తి చేశాడు. ఇది 29:27లో పేర్కొనబడింది.
  2. "నా వాగ్దానం దుర్మార్గులైన వారికి వర్తించదు." అల్లాహ్ (సు.తా.) యొక్క ఈ ప్రవచనం ఎంతో ఆలోచింపదగినది. ఇక్కడ ఆయన విశదపరచింది ఏమిటంటే : ఒక మంచి సత్పురుషుని లేక ప్రవక్త సంతతికి చెందినంత మాత్రానా - వారు అవిశ్వాసులై, సత్కార్యాలు చేయని వారైతే - వారి వంశకీర్తి, వారి పెద్దల ప్రవక్తృత్వం వారికి ఏ విధంగానూ పనికిరాదు. ప్రతి ఒక్కడూ తన స్వంత విశ్వాసం మరియు సత్కార్యాల ఆధారంగానే ప్రతిఫలం పొందుతాడు. మహా ప్రవక్త ('స'అస) 'హదీస్' ఇలా ఉంది : "ఏ వ్యక్తి వ్యవహారాలైతే అతనిని వెనుక విడిచాయో, అలాంటి వ్యక్తి పుట్టు పూర్యోత్తరాలు, వంశ ప్రతిష్ఠలు అతనిని ఏ మాత్రం ముందుకు తేలేవు." ('స'హీ'హ్ ముస్లిం).