19 : 28
يَٰٓأُخۡتَ هَٰرُونَ مَا كَانَ أَبُوكِ ٱمۡرَأَ سَوۡءٖ وَمَا كَانَتۡ أُمُّكِ بَغِيّٗا
ఓ హారూన్ సోదరీ! నీ తండ్రీ చెడ్డవాడు కాదు మరియు నీ తల్లి కూడా చెడు నడత గలది కాదే!"
Explanation & meanings · 1
- హారూన్ సోదరీ! అంటే ఆమెకు హారూన్ అనే సవతి (అర్థ) సోదరుడు ఉండవచ్చు, లేదా మూసా ('అ.స.) సోదరుడు హారూన్ తో సంబంధం ఉన్నందున అలా పిలువబడి ఉండవచ్చు! తమ వంశంలోని పెద్దవాని పేరుతో పిలువబడటం ఆచారమే. (ఇబ్నె-కసీ'ర్ మరియు ఏసర్ అత్ -తఫాసీర్). చూడండి, 3:37 వ్యాఖ్యానం 3.