Skip to content
الكَهف /

ఆయత్ 24

18 : 24
الكَهف ఆయతులు 110
సూరా · الكَهف
తెలుగు · Muhammad
18 : 24

إِلَّآ أَن يَشَآءَ ٱللَّهُۚ وَٱذۡكُر رَّبَّكَ إِذَا نَسِيتَ وَقُلۡ عَسَىٰٓ أَن يَهۡدِيَنِ رَبِّي لِأَقۡرَبَ مِنۡ هَٰذَا رَشَدٗا

"అల్లాహ్ కోరితే తప్ప (ఇన్షా అల్లాహ్)!" అని అననిదే! మరియు నీ ప్రభువును స్మరించు, ఒకవేళ నీవు మరచిపోతే! ఇలా ప్రార్థించు: "బహుశా నా ప్రభువు నాకు సన్మార్గం వైపునకు దీని కంటే దగ్గరి త్రోవ చూపుతాడేమో!"

Explanation & meanings · 1
  1. యూదులు దైవప్రవక్త ('స'అస) తో మూడు ప్రశ్నలు అడిగారు: 1) రూ'హ్ ఆత్మ అంటే ఏమిటి? 2) గుహవారి విషయం ఏమిటి? 3) జు'ల్-ఖర్ నైన్ ఎవడు? దైవప్రవక్త ('స'అస) అన్నారు: 'నేను రేపు మీకు జవాబిస్తాను.' కాని అతను ('స'అస): "అల్లాహ్ కోరితే," (ఇన్షా 'అల్లాహ్! అని అనలేదు. కావున 15 రోజుల వరకు ఏ వ'హీ రాలేదు. ఆ తరువాత వ'హీ వచ్చినప్పుడు: "ఇన్షా 'అల్లాహ్," అని తప్పక అనాలని ఆజ్ఞ వచ్చింది.