13 : 30
كَذَٰلِكَ أَرۡسَلۡنَٰكَ فِيٓ أُمَّةٖ قَدۡ خَلَتۡ مِن قَبۡلِهَآ أُمَمٞ لِّتَتۡلُوَاْ عَلَيۡهِمُ ٱلَّذِيٓ أَوۡحَيۡنَآ إِلَيۡكَ وَهُمۡ يَكۡفُرُونَ بِٱلرَّحۡمَٰنِۚ قُلۡ هُوَ رَبِّي لَآ إِلَٰهَ إِلَّا هُوَ عَلَيۡهِ تَوَكَّلۡتُ وَإِلَيۡهِ مَتَابِ
అందుకే (ఓ ముహమ్మద్!) మేము నిన్ను ఒక సమాజం వారి వద్దకు పంపాము - వాస్తవానికి వారికి పూర్వం ఎన్నో సమాజాలు గతించాయి - నీవు నీపై మేము అవతరింప జేసిన దివ్యజ్ఞానం వారికి వినిపించటానికి! ఎందుకంటే వారు తమ కరుణామయుణ్ణి తిరస్కరిస్తున్నారు. వారితో అను: "ఆయనే నా ప్రభూవు! ఆయన తప్ప మరొక ఆరాధ్యుడు లేడు! నేను ఆయననే నమ్ముకున్నాను. మరియు ఆయన వైపునకే నేను పశ్చాత్తాపంతో మరలి పోవలసి ఉన్నది."
Explanation & meanings · 1
- మక్కా ముష్రికులు రహ్మాన్ శబ్దాన్ని తిరస్కిరించేవారు. కావున హుదైబియా ఒప్పందం రోజు దైవప్రవక్త ము'హమ్మద్ ('స'అస): "బిస్మిల్లా హిర్ర'హ్మా నిర్ర'హీమ్." అని ఒప్పందం వ్రాయించడం ప్రారంభించినప్పుడు, ఒప్పందం చేసుకోవడానికి వచ్చిన రాయబారి: "అర్-రహ్మాన్ అర్-రహీమ్ ను" మేము ఎరుగము "బిస్మిక అల్లాహుమ్మ" అని వ్రాయలి." అని పట్టుపట్టాడు. ఖతదా('ర.ది.'అ.) కథనం, 'స. బు'ఖారీ).