13 : 22
وَٱلَّذِينَ صَبَرُواْ ٱبۡتِغَآءَ وَجۡهِ رَبِّهِمۡ وَأَقَامُواْ ٱلصَّلَوٰةَ وَأَنفَقُواْ مِمَّا رَزَقۡنَٰهُمۡ سِرّٗا وَعَلَانِيَةٗ وَيَدۡرَءُونَ بِٱلۡحَسَنَةِ ٱلسَّيِّئَةَ أُوْلَٰٓئِكَ لَهُمۡ عُقۡبَى ٱلدَّارِ
మరియు ఎవరైతే తమ ప్రభువు ప్రీతి కొరకు సహనం వహించి మరియు నమాజ్ స్థాపించి మరియు మేము ప్రసాదించిన ఉపాధి నుండి రహస్యంగా మరియు బహిరంగంగా (అల్లాహ్ మార్గంలో) ఖర్చు చేస్తూ, చెడును మంచి ద్వారా పారద్రోలుతూ ఉంటారో; అలాంటి వారికే ఉత్తమ పరలోక గృహం ప్రతిఫలంగా ఉంటుంది.
Explanation & meanings · 3
- అల్లాహ్ (సు.తా.) ఆజ్ఞలను పాటించటం మరయు పాపాల నుండి తప్పించుకోవటం ఒక సహనం. మరియు బాధలలో, ఆపదలలో సహనం వహించటం రెండవది. సత్పురుషులు ఈ రెండు రకాల సహనాన్ని వహిస్తారు.
- నమా'జ్ స్థాపించటం అంటే నమా'జ్ ను దాని సమయంలో, భయభక్తులతో సరిగ్గా సలపటం.
- వారు, ఎవరికైతే చెడు సంభవిస్తే దానికి బదులుగా మంచి చేస్తారో లేక మన్నించి సహనం వహిస్తారో, చూడండి, 41:34.