10 : 49
قُل لَّآ أَمۡلِكُ لِنَفۡسِي ضَرّٗا وَلَا نَفۡعًا إِلَّا مَا شَآءَ ٱللَّهُۗ لِكُلِّ أُمَّةٍ أَجَلٌۚ إِذَا جَآءَ أَجَلُهُمۡ فَلَا يَسۡتَـٔۡخِرُونَ سَاعَةٗ وَلَا يَسۡتَقۡدِمُونَ
(ఓ ముహమ్మద్!) వారిలో ఇలా అను: "అల్లాహ్ కోరితే తప్ప! నా కొరకు నేను కీడుగానీ, మేలుగానీ చేసుకోగలిగే శక్తి నాకు లేదు. ప్రతి సమాజానికి ఒక గడువు నియమింపబడి ఉంది. వారి గడువు వచ్చినపుడు వారు ఒక ఘడియ వెనక గానీ లేక ముందు గానీ కాలేరు."
Explanation & meanings · 2
- ఇక్కడ అల్లాహుతా'ఆలా దైవప్రవక్త ('స'అస)తో: "అల్లాహ్ కోరనిదే నాకు నేను, కీడు గానీ, మేలు గానీ, చేసుకోలేను." అని చెప్పమంటున్నాడు. దైవప్రవక్త ('స'అస) కే తన స్వంతానికి కీడుగానీ మేలుగానీ చేసుకునే శక్తి లేనప్పుడు, ఇతర వలీలకు గానీ లేక సద్పురుషులకు గానీ - జీవించి ఉన్నా లేక మరణించినా - ఇతరులకు కీడు గానీ మేలు గానీ చేయగల శక్తి ఎలా ఉండగలదు? వారిని అర్థించేవారు ఇది ఎందుకు అర్థం చేసుకోలేరు?
- చూడండి, 7:34.