Skip to content
837 హదీసులు

ప్రవక్త హదీసుల విజ్ఞాన సర్వస్వం

ఫలితాలను ఫిల్టర్ చేయండి

837 లో 4 కార్డులు

ఫిల్టర్లను తీసివేయి
“ఫజ్ర్ నమాజు కొరకు పలుకబడే అజాన్’లో “హయ్య అలల్ ఫలాహ్” (సాఫల్యము వైపునకు రండి) తరువాత “అస్సలాతు ఖైరుమ్మినన్’నౌమ్” (నిద్ర కంటే నమాజు ఉత్తమమైనది, శుభప్రదమైనది) అని పలుకుట సున్నత్’లో భాగము.”
ప్రామాణికమైన హదీథు ఇబ్న్ ఖుజైమ, దారు ఖుత్నీ మరియు బైహిఖీ నమోదు చేసినారు:
“నిశ్చయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాలకృత్యాలు తీర్చుకున్న తరువాత ‘ఇస్తింజా’ చేయడానికి (శుభ్రపరుచుకోవడానికి) పేడ లేదా ఎముకను ఉపయోగించడాన్ని నిషేధించినారు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “ఈ రెండూ శుద్ధపరచవు.”
ప్రామాణికమైన హదీథు దారు ఖుత్నీ నమోదు చేసినారు:
“ఎవరికీ హాని తలపెట్టకండి, హాని తలపెట్టిన వానికి ప్రతీకారం చేయకండి. ఎవరైతే (ఇతరులకు) హాని తలపెడతాడో అల్లాహ్ అతడికి హాని కలుగజేస్తాడు మరియు ఎవరైతే (ఇతరుల పట్ల) కఠినంగా ఉంటాడో, అల్లాహ్ అతడి పట్ల కఠినంగా ఉంటాడు”.
సాక్ష్యాల ఆధారంగా ప్రామాణికమైనది. దారు ఖుత్నీ నమోదు చేసినారు:
“మీలో ఎవరైనా ఉదూ చేసి, తరువాత (పాదములకు) “ఖుఫ్”లను (“ఖుఫ్ఫైన్” – పలుచని తోలుతో చేయబడిన మేజోళ్ళు) తొడుగుకున్నట్లయితే, వాటిని తొడిగి ఉన్న స్థితిలోనే అతడు నమాజు ఆచరించవచ్చును, “జనాబత్” స్థితికి (సంభోగానంతర అశుద్ధ స్థితికి) లోనైతే తప్ప వాటిని కాళ్ళనుండి తీయకుండా వాటి పైన తడి చేతులతో ‘మసహ్’ చేయవచ్చును (తడమవచ్చు).”
ప్రామాణికమైన హదీథు దారు ఖుత్నీ నమోదు చేసినారు: