Skip to content
837 హదీసులు

ప్రవక్త హదీసుల విజ్ఞాన సర్వస్వం

ఫలితాలను ఫిల్టర్ చేయండి

837 లో 1 కార్డులు

ఫిల్టర్లను తీసివేయి

ఉల్లేఖకుడు

అలీ ఇబ్నె అబూ తాలిబ్ (రదియల్లాహు అన్హు) యెమెన్ నుండి రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లంకు కొంత బంగారం పంపారు. ఆ బంగారానికి ఇంకా కొంత మట్టి అంటుకుని ఉండగా, పచ్చటి వస్త్రంలో పెట్టి పంపించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆ బంగారాన్ని ఈ నలుగురికి పంచిపెట్టారు: 'ఉయైనహ్ బిన్ బద్ర్, అఖ్రఅ్ బిన్ హాబిస్, జైద్ అల్ ఖైల్, మరియు నాలుగో వ్యక్తి అల్‌ఖమా లేదా ఆమిర్ బిన్ తుఫైల్ (ఇద్దరిలో ఒకరు). అప్పుడు సహాబాలలో ఒకరు: "మేము వీళ్లకంటే దీనికి ఎక్కువ హక్కుదారులం" అని అన్నారు. ఇది ప్రవక్తకు తెలిసింది. దానిపై ఆయన ఇలా అన్నారు: "మీరు నన్ను నమ్మడం లేదా? నేను ఆకాశాల్లో ఉన్న అల్లాహ్‌కు విశ్వసనీయుడిని. ఉదయం, సాయంత్రం నా వద్దకు పరలోక వార్తలు వస్తుంటాయి." అప్పుడు ఒక వ్యక్తి (కళ్లలో లోతు, బుగ్గలు ముదురు, నుదురు పైగా, గడ్డం మందంగా, తల శుభ్రంగా గీయించుకున్నవాడు, కడుపుపై మడత పెట్టుకున్న దుస్తులు ధరించినవాడు) లేచి: "ఓ రసూలల్లాహ్! అల్లాహ్‌ కు భయపడండి" అని అన్నాడు. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహ వసల్లం: "నీకు శాపం! భూమిపై ఉన్న వారందరి కంటే ఎక్కువగా అల్లాహ్‌ కు భయపడటానికి నేను అర్హుడిని కాదా?" అని అన్నారు. ఆ తరువాత ఆ వ్యక్తి వెళ్లి పోయాడు. అపుడు ఖాలిద్ ఇబ్న్ వలీద్: "ఓ రసూలిల్లాహ్! నేను ఇతని మెడ నరికి వేయనా?" అని అడిగారు. దానికి ఆయన: "లేదు, ఎందుకంటే ఇతను నమాజ్ చేయువారిలోని వాడు" అని చెప్పారు. అపుడు ఖాలిద్: "ఎంతో మంది నమాజ్ చేస్తారు, కానీ వారి మనసులో లేనిది నోటితో చెబుతారు" అని అన్నారు. దానికి ప్రవక్త : "నేను ప్రజల హృదయాలను చీల్చి చూడమని, వారి పొట్టలను తెరచి చూడమని ఆదేశించబడలేదు" అన్నారు. ఆ వ్యక్తి వెళ్లిపోతుండగా ప్రవక్త: "ఈ వ్యక్తి సంతానంలోంచి ఒక వర్గం పుట్టుకు వస్తారు. వారు అల్లాహ్ గ్రంథాన్ని (ఖుర్ఆన్) మధురమైన స్వరంతో పారాయణం చేస్తారు, కానీ అది వారి గొంతును దాటి లోపలికి పోదు. వారు బాణం లక్ష్యాన్ని ఛేదించినంత వేగంగా ధర్మాన్ని విడిచి పెట్టి వెళ్తారు. ఒకవేళ నేను వారిని చూడగలిగితే, థమూద్ ప్రజలు నాశనమైనట్లుగా, వారినీ అలా నాశనం చేస్తాను" అని అన్నారు.
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు