Skip to content
837 హదీసులు

ప్రవక్త హదీసుల విజ్ఞాన సర్వస్వం

ఫలితాలను ఫిల్టర్ చేయండి

837 లో 31 కార్డులు

ఫిల్టర్లను తీసివేయి
“(చనిపోయిన తరువాత) సమాధిలో ఒక ముస్లిం ప్రశ్నించబడినపుడు అతడు “అష్’హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్, వ అన్న ముహమ్మదర్రసూలుల్లాహ్” (అల్లాహ్ తప్ప నిజ ఆరాధ్యుడు వేరే ఎవ్వరూ లేరు, మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క సందేశహరుడు అని నేను సాక్ష్యమిస్తున్నాను” అని సాక్ష్యమిస్తాడు. ఇది ఖుర్’ఆన్ లో అల్లాహ్ వాక్కు యొక్క వివరణ: “యుథబ్బితు ల్లాహుల్లదీన ఆమనూ బిల్’ఖౌలి థ్థాబితి ఫిల్ హయాతిద్దున్యా వఫిల్ ఆఖిరతి” (సూరహ్ ఇబ్రాహీం 14:27) [“మహోన్నతుడైన అల్లాహ్ ఈ వాక్యం ద్వారా విశ్వసించిన వారిని ఇహలోకంలోనూ మరియు పరలోకంలోనూ దృఢంగా ఉంచుతాడు.”]
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
“అల్లాహ్ భూమిని ఒడిసి పట్టుకుంటాడు; ఆకాశాలను చుట్టచుట్టి (దానిని కూడా) తన కుడి చేతిలో పెట్టుకుంటాడు. అప్పుడు ఆయన ఇలా అంటాడు “నేనే రారాజును, భూమిపై (రాజరికం చేసిన) రాజులు ఏరీ, ఎక్కడున్నారు?”
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “పునరుత్థాన దినాన ప్రజలు చెప్పులు లేకుండా, బట్టలు లేకుండా, మరియు సున్తీ చేయని స్థితిలో (హషర్ మైదానంలో) జమ చేయ బడతారు.” నేను అడిగాను: “ఓ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం! సమీకరించబడిన స్త్రీలు మరియు పురుషులు ఒకరినొకరు చూసుకుంటారా?” దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా బదులిచ్చారు: “ఓ ఆయిషా! ఆ సమయంలో పరిస్థితి ఒకరినొకరు చూసుకోవడం కంటే చాలా తీవ్రంగా, గంభీరంగా ఉంటుంది.”
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
“ఎవరైతే అజాన్ (నమాజు కొరకు ఇవ్వబడే పిలుపు) విన్న తరువాత ఈ పలుకులు “అల్లాహుమ్మ, రబ్బహాదిహిద్ద’వతిత్తామ్మహ్, వస్సలాతిల్ ఖాఇమహ్, ఆతి ముహమ్మదన్ అల్’వసీలత, వల్ ఫజీలత, వబ్’అథ్’హు మఖామన్ మహ్’మూదన్ అల్లదీ వ అద్’తహు” (ఓ అల్లాహ్! ఈ పరిపూర్ణ పిలుపునకు మరియు స్థాపించబడబోయే ఈ నిత్య నమాజు పిలుపునకు ఓ ప్రభువా! దయచేసి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు (తీర్పు దినమున) స్వర్గంలో ఆయనకు తప్ప మరెవరికీ లభించని అత్యున్నత స్థానమును మరియు ఆధిక్యతను ప్రసాదించు, మరియు (తీర్పు దినమున) నీవు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లంకు వాగ్దానం చేసిన స్వర్గంలో శ్రేష్ఠమైన మరియు మరియు అత్యున్నతమైన స్థానానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లంను పంపు) అని పలుకుతాడో తీర్పు దినమున అతనికి నా మధ్యవర్తిత్వం ఖచ్చితంగా లభిస్తుంది."
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ నమోదు చేసినారు:
“నా నీటి తొట్టి (ఎంత పెద్దది అంటే) దాని రెండు అంచుల మధ్య దూరం ఒక నెల ప్రయాణమంత ఉంటుంది. దాని నీరు పాల కన్నా తెల్లనైనవి; దాని సువాసన కస్తూరీ గంధము కన్న మధురమైనది; దాని నుండి నీటిని త్రాగడానికి వాడే కప్పులు ఆకాశములో నక్షత్రాల వంటివి; దాని నుండి నీటిని త్రాగిన వారెవరూ మరింకెన్నడూ దాహానికి లోను కారు”.
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
అంత్యక్రియలు (గుసుల్) నిర్వహించి, మనుషులు జనాజాను భుజాలపై మోసినప్పుడు, అది ధర్మబద్ధంగా ఉంటే, ఇలా అంటుంది: "నన్ను ముందుకు తీసుకెళ్లండి", కానీ అది ధర్మబద్ధంగా లేకపోతే, ఇలా అంటుంది: "ఎంత దుఃఖం! వారు నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు?" మనిషి తప్ప మిగతా ప్రాణులన్నీ దాని మాటలు వింటాయి మరియు ఒకవేళ మనిషి దానిని వినగలిగితే, అతడు స్పృహ తప్పి పడిపోతాడు.
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ నమోదు చేసినారు:
“”ఎవరైతే “లా ఇలాహ ఇల్లల్లాహు, వహ్’దహు, లా షరీకలహు, వ అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు, వ అన్న ఈసా అబ్దుల్లాహి, వ రసూలుహు, వ కలిమతుహు, అల్’ఖాహా ఇలా మర్యమ, వ రూహుమ్మిన్’హు, వల్ జన్నతు హఖ్ఖున్, వన్నారు హఖ్ఖున్”, అని సాక్ష్యం పలుకుతాడో, అల్లాహ్ అతడిని స్వర్గం లో ప్రవేశింపజేస్తాడు, అతడి ఆచరణలు ఏమైనప్పటికీ.”
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు