Skip to content
837 హదీసులు

ప్రవక్త హదీసుల విజ్ఞాన సర్వస్వం

ఫలితాలను ఫిల్టర్ చేయండి

837 లో 5 కార్డులు

ఫిల్టర్లను తీసివేయి
“జాగ్రత్త! రాబోయే కాలంలో ఒక వ్యక్తికి నా హదీసు చేరుతుంది. అతడు తన పడక మీద జారగిలబడి కూర్చుని ఇలా అంటాడు “మీకూ మాకూ మధ్యన అల్లాహ్ గ్రంథం ఉన్నది. అందులో హలాల్ గా ప్రకటించ బడినదంతా మేము హలాల్ గా భావిస్తాము మరియు అందులో హరాంగా ప్రకటించ బడినదంతా మేము హరాం గా భావిస్తాము”. (ఇంకా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు) “జాగ్రత్త! అల్లాహ్ యొక్క సందేశహరుడు దేనినైతే హరాంగా ప్రకటించినాడో, అది అల్లాహ్ హరాంగా ప్రకటించిన దానితో సమానం”.
ప్రామాణికమైన హదీథు అబూ దావూద్, అత్తిర్మిదీ మరియు ఇబ్నెమాజహ్ నమోదు చేసినారు:
మేము సమాజములలో చివరివారము మరియు లెక్క తీసుకోబడేవారిలో మొట్టమొదటి వారము, ఇలా అనబడుతుంది: నిరక్షరాస్య సమాజం మరియు దాని ప్రవక్త ఎక్కడ? కావున మేము చివరివారము మరియు మొదటివారము.
ప్రామాణికమైన హదీథు ఇబ్న్ మాజహ్ నమోదు చేసినారు:
“నిశ్చయంగా, తీర్పు దినము నాడు నా ఉమ్మత్’ నుండి అల్లాహ్ ఒక వ్యక్తిని ఎన్నుకుని సృష్టి అంతటి ముందు హాజరు పరుస్తాడు. అతడి ముందు (చెడు కర్మలు రాయబడిన) తొంభైతొమ్మిది దస్తావేజులు పరుచబడతాయి. ఒక్కొక్కటి కంటిచూపు మేర దూరమంత పెద్దవిగా ఉంటాయి. అప్పుడు ఆయన (అల్లాహ్) ఇలా పలుకుతాడు “వీటిలో ఏ ఒక్కదానినైనా నిరాకరించగలవా నీవు? వీటిని రాసిన వారు (తప్పుగా రాసి) నీకు ఏమైనా అన్యాయం చేసినారా?” దానికి అతడు “లేదు నా ప్రభూ!” అంటాడు. అపుడు ఆయన “మరి నీ వద్ద జావాబు ఏమైనా ఉందా?” అని అడుగుతాడు. దానికి అతడు “లేదు నా ప్రభూ!” అంటాడు. అపుడు అల్లాహ్ “నిశ్చయంగా మావద్ద నీవు చేసిన ఒక మంచి పని ఉన్నది. ఈ దినము నీకు ఎటువంటి అన్యాయమూ జరుగదు” అని ఒక పత్రాన్ని బయటకు తీస్తాడు. దానిపై “అష్’హదు అల్లాఇలాహ ఇల్లల్లాహ్, వ అష్’హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు, వ రసూలుహు” (నేను సాక్ష్యమిస్తున్నాను అల్లహ్ తప్ప వేరే నిజ ఆరాధ్యుదు ఎవరూ లేరు, మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన యొక్క దాసుడు మరియు సందేశహరుడు”). అల్లాహ్ అతనితో “నీ కర్మల త్రాసును తీసుకురా” అంటాడు. దానికి అతడు “ఓ నా ప్రభూ! నా పాపపు పనుల ఈ చిట్ఠాల (బరువు) ముందు ఈ కాగితం ముక్క ఏమి పనికి వస్తుంది?” అంటాడు. అపుడు ఆయన “ఈ దినము నీకు ఎలాంటి అన్యాయం జరుగదు” అని బదులిస్తాడు. పాపపు కర్మల చిట్ఠాలు త్రాసులో ఒక పళ్ళెంలో ఉంచబడతాయి. మరొక పళ్ళెం లో ఆ పత్రం ఉంచబడుతుంది. పాపపు కర్మ చిట్టాలు తేలికగా పైకి లేచిపోతాయి. ఆ పత్రం మహా బరువుగా తూగుతుంది. ఎందుకంటే అల్లాహ్ పేరు కంటే బరువైనది ఏదీ లేదు”.
ప్రామాణికమైన హదీథు అత్తిర్మిదీ మరియు ఇబ్నె మాజహ్ నమోదు చేసినారు:
“అప్పుడు, ఆ రోజు మీరు, (ఈ జీవితంలో అనుభవించిన) సౌఖ్యాలను గురించి తప్పక ప్రశ్నించబడతారు!) (సూరహ్: అత్-తకాథుర్ 102:8) అనే ఆయతు అవతరించినపుడు, జుబైర్ (ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తో ఇలా పలికారు “ఓ రసూలుల్లాహ్! ఏ సౌఖ్యాలను గురించి ప్రశ్నించడం జరుగుతుంది? మన వద్దనున్న రెండు నల్లని విషయాలు, ఖర్జూరాలు, నీళ్ళు; వాటి గురించా?” అపుడు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా జవాబిచ్చారు “అవి తప్పనిసరిగా ఉంటాయి.”
హసన్ హదీథు. అత్తిర్మిదీ మరియు ఇబ్నె మాజహ్ నమోదు చేసినారు:
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏదో విషయాన్ని చెబుతూ చివరన “అది (ఈ ప్రపంచము నుండి) ఙ్ఞానము అంతరించి పోయినపుడు జరుగుతుంది” అన్నారు. నేను “ఓ రసూలుల్లాహ్ (ల్లల్లాహు అలైహి వసల్లం ! ఙ్ఞానము ఎలా అంతరించి పోతుంది. మేము ఖుర్’అన్ చదువు తున్నాము, మా పిల్లలకు బోధిస్తున్నాము, వారు వారి సంతానికి నేర్పుతారు. అలా తీర్పు దినము వరకు జరుగుతుంది. మరి ఙ్ఞానము ఎలా అంతరించిపోతుంది?” అన్నాను. దానికి వారు ఇలా అన్నారు “నీ తల్లి నిన్ను కోల్పొవు గాక, ఓ జియాద్! ఈ మదీనా నగరంలో నువ్వొక మంచి ఙ్ణానవంతుడవని, మంచి పరిఙ్ఞానం కలిగిన వాడివి అని అనుకున్నాను. యూదులూ మరియు క్రైస్తవుల విషయంలో ఇలా జరగ లేదా, వారు తౌరాతు మరియు ఇంజీలు గ్రంథాలను చదువుతారు ఐనా వాటిలోని ఒక్క విషయం పై కూడా ఆచరించరు”.
ప్రామాణికమైన హదీథు ఇబ్న్ మాజహ్ నమోదు చేసినారు: