Skip to content
837 హదీసులు

ప్రవక్త హదీసుల విజ్ఞాన సర్వస్వం

ఫలితాలను ఫిల్టర్ చేయండి

837 లో 97 కార్డులు

ఫిల్టర్లను తీసివేయి

ఉల్లేఖకుడు

అన్ని ఉల్లేఖకులను చూపించు (49)
“ఉమ్మె సలమహ్ రజియల్లాహు అన్హా తాను హబషహ్(అబిసీనియా) లో మారియా అని పిలువబడే ఒక చర్చీను చూసిన విషయాన్ని రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వద్ద ప్రస్తావించినారు. అందులో తాను చూసిన ప్రతిమలను (విగ్రహాలను) గురించి ప్రస్తావించినారు. అపుడు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “అది ఎటువంటి జాతి అంటే – తమలో ధర్మపరాయణుడైన ఒక దాసుడు చనిపోయినా, లేక ఒక ధర్మపరాయణుడైన వ్యక్తి చనిపోయినా వారు అతని సమాధిపై ఒక ఆరాధనా గృహాన్ని (దేవాలయాన్ని) నిర్మించి అందులో వారి విగ్రహాలను ప్రతిష్టించి పూజించడం మొదలుపెడతారు. అల్లాహ్ వద్ద వారు సృష్టి మొత్తములో అత్యంత నీచులు, దుష్టులు.”
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంపై {إِذَا جَاءَ نَصْرُ اللَّهِ وَالْفَتْحُ} (అన్నస్ర్ సూరహ్ 1) అవతరించిన తర్వాత, ఆయన ప్రతి నమాజ్‌లో ఇలా పలకకుండా ఉండలేదు (నమాజు కొనసాగించలేదు): "సుబహానక రబ్బనా వ బిహమ్దిక, అల్లాహుమ్మఘ్ఫిర్లీ (మా ప్రభువా! నీవు పరమ పవిత్రుడవు, స్తుతులన్నీ నీకే శోభిస్తాయి, ఓ అల్లాహ్! నన్ను క్షమించు)."
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
ఒక రాత్రి నేను రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రక్క మీద లేకపోవడం గమనించాను; ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం కొరకు అటూఇటూ తడిమాను. నా చేతికి వారి పాదాల అరికాళ్లు తగిలాయి, ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం సజ్దాలో ఉన్నారు, ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం పాదాలు నిటారుగా ఉన్నాయి మరియు వారు ఇలా దుఆ చేస్తూ ఉన్నారు: “అల్లాహుమ్మ అఊదు బిరిదాక మిన్ సఖతిక; వ బిముఆఫాతిక మిన్ ఉఖూబతిక; వ అఊదుబిక మిన్క; లా ఉహ్’సీ థనాఅన్ అలైక; అన్’త కమా అథ్’నైత అలా నఫ్’సిక” (ఓ అల్లాహ్! నీ అనుగ్రహము ద్వారా నీ ఆగ్రహము నుండి రక్షణ కోరుతున్నాను; నీ క్షమాభిక్ష ద్వారా నీ శిక్ష నుండి రక్షణ కోరుతున్నాను; మరియు నీ నుండి నీతోనే రక్షణ కోరుతున్నాను; (ఓ అల్లాహ్!) నీ ప్రశంసలను నేను లెక్కించలేను; (ఏ ప్రశంసా పదాలతో) నిన్ను నీవు ఏమని ప్రశంసించుకున్నావో, నీవు ఆవిధంగానే ఉన్నవాడవు.”
ప్రామాణికమైన హదీథు ముస్లిం నమోదు చేసినారు:
“నిలబడి ఆచరించు, అలా చేయలేకపోతే కూర్చుని ఆచరించు, అలా కూడా చేయలేకపోతే ఒకవైపునకు తిరిగి పడుకుని ఆచరించు”.
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ నమోదు చేసినారు:
“ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం క్రమం తప్పకుండా ఫజ్ర్ యొక్క రెండు రకాతుల సున్నతు నమాజు కంటే ఎక్కువగా ఏ సున్నతు నమాజును పాటించలేదు.
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లమ్ నమాజును తక్బీర్ ద్వారా, మరియు ఖిరాత్ పఠనాన్ని ‘అల్హందులిల్లాహి రబ్బీల్ ఆలమీన్’ ద్వారా ప్రారంభించేవారు, రుకూ చేసేటప్పుడు తలను మరీ క్రిందికి మరీ పైకి కాకుండా (వీపుకు) సమానంగా ఉంచేవారు, రుకూ నుండి లేచిన తరువాత స్థిరంగా నిలబడనంత వరకు సజ్దాలోకి వెళ్ళేవారు కాదు, సజ్దా నుండి తల లేపి సక్రమంగా కూర్చోనంత వరకు మరో సజ్దా చేసేవారు కాదు, ప్రతీ రెండు రకాతులలో ‘అత్తహియ్యాత్’ చదివేవారు, ఎడమ కాలును పరచి కుడికాలు నిలబెట్టి కూర్చునేవారు, షైతాన్ మాదిరి కూర్చోవడాన్ని వారించేవారు, జంతువుల వలె రెండు చేతులను నేలపై చాచి పెట్టడాన్ని వారించేవారు, చివరగా తన నమాజును సలాం చేస్తూ ముగించేవారు.
ప్రామాణికమైన హదీథు ముస్లిం నమోదు చేసినారు:
«నమాజ్ కోసం ఇఖామత్ చెప్పబడిన తర్వాత ఫర్ద్ నమాజ్ తప్ప మరే నమాజు లేదు»
ప్రామాణికమైన హదీథు ముస్లిం నమోదు చేసినారు:
“ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జుహ్ర్ సలాహ్ కు ముందు నాలుగు (రకాతులు), మరియు ఫజ్ర్ సలాహ్’కు ముందు రెండు రకాతులు నమాజు ఆచరించడాన్ని ఎన్నడూ విడిచి పెట్టలేదు.”
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ నమోదు చేసినారు: