ఆమె పాలుత్రాగే తన శిశువుతో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లమ్ వద్దకు రాగా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లమ్ ఆ శిశువును తన ఒడిలో కూర్చోబెట్టుకున్నారు, అయితే ఆ శిశువు ఆయన దుస్తులపై మూత్రం పోసాడు, వెంటనే ఆయన నీటిని తెప్పించి దానిపై చిలకరించారు, దానిని (వస్త్రాన్ని) కడగలేదు.
ఉమ్మె ఖైస్ బింత్ మిహ్సన్ రదియల్లాహు అన్హా ఉల్లేఖన:
ఆమె పాలుత్రాగే తన శిశువుతో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లమ్ వద్దకు రాగా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లమ్ ఆ శిశువును తన ఒడిలో కూర్చోబెట్టుకున్నారు, అయితే ఆ శిశువు ఆయన దుస్తులపై మూత్రం పోసాడు, వెంటనే ఆయన నీటిని తెప్పించి దానిపై చిలకరించారు, దానిని (వస్త్రాన్ని) కడగలేదు.
أَنَّهَا أَتَتْ بِابْنٍ لَهَا صَغِيرٍ لَمْ يَأْكُلِ الطَّعَامَ إِلَى رَسُولِ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ، فَأَجْلَسَهُ رَسُولُ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ فِي حَجْرِهِ، فَبَالَ عَلَى ثَوْبِهِ، فَدَعَا بِمَاءٍ، فَنَضَحَهُ وَلَمْ يَغْسِلْهُ.
ఉమ్మే ఖైస్ బింత్ మిహ్సన్ రదియల్లాహు అన్హా, అన్నం తినడం ప్రారంభించని తన చిన్న కుమారుడితో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లమ్ వద్దకు వచ్చారు. ప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ అతడిని తన ఒడిలో కూర్చోబెట్టుకున్నారు, అప్పుడు ఆ బాలుడు ఆయన దుస్తులపై మూత్రం పోసాడు. దాంతో ఆయన నీటిని తెప్పించి, తన వస్త్రంపై చిలకరించారే గానీ, దానిని కడగలేదు.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఉత్తమ ప్రవర్తన మరియు ఆయన అపారమైన వినమ్రత.
మంచిగా వ్యవహరించాలని, వినయంతో మెలగాలని, చిన్నపిల్లల పట్ల మృదువుగా వ్యవహరించాలని మరియు పిల్లలను గౌరవించడం, ఒడిలో కూర్చోబెట్టుకోవడం వంటి వాటి ద్వారా వారి పెద్దల హృదయాలను సంతోషపరచాలని ప్రోత్సహించబడింది.
మగశిశువు అన్నం తినే వయస్సుకు చేరకపోతే అతని మూత్రం మాలిన్యంగా పరిగణించబడుతుందా?.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఈ చర్యను నద్’హా అంటారు, ఇది ఆహారం తినడం ప్రారంభించని మగ శిశువుకు మాత్రమే ప్రత్యేకం. అయితే ఆడ శిశువు చిన్నదైనప్పటికీ, ఆమె మూత్రం పడిన వస్త్రాన్నిమ తప్పనిసరిగా కడగాలి.
తల్లి పాలు త్రాగే పసిబిడ్డ మలాన్ని, ఇతర అశుద్దాల వలె కడగడం తప్పనిసరి.
నీటితో కడగటంతో పాటు క్రింది అదనపు విషయం కూడా అనివార్యం.
ఒకటి: అశుద్ధి నుండి త్వరగా స్వచ్ఛత, పవిత్రత పొందడానికి మరియు మరచిపోకుండా ఉండటానికి అశుద్ధ స్థలాన్ని శుభ్రపరచడంలో తొందరపడటం.
సహీహ్ అల్ బుఖారీ. (1/ 54) (223).
సహీహ్ ముస్లిం. (1/ 238) (287).
ఇంకా (6)
الإلمام بشرح عمدة الأحكام.
لإسماعيل الأنصاري (1/ 42).
تيسير العلام شرح عمدة الأحكام.
للبسام (ص55).
تنبيه الأفهام شرح عمدة الأحكام.
لابن عثيمين (1/ 68).