Skip to content

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం (పడుకునే) పరుపు తోలుతో తయారుచేయబడింది. దానిలో పలుచటి ఖర్జూర చెట్ల బెరడు నింపబడి ఉండేది

ఉమ్ముల్ ముమినీన్ ఆయిషా రదియల్లాహు అన్హా ఉల్లేఖన:

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం (పడుకునే) పరుపు తోలుతో తయారుచేయబడింది. దానిలో పలుచటి ఖర్జూర చెట్ల బెరడు నింపబడి ఉండేది. మరియు ముస్లిం ఉల్లేఖన ప్రకారం: రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆనుకునే దిండు తోలుతో తయారుచేయబడింది, దానిలో పలుచటి ఖర్జూర చెట్ల బెరడు నింపబడి ఉండేది.

كَانَ فِرَاشُ رَسُولِ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ مِنْ أَدَمٍ، وَحَشْوُهُ مِنْ لِيفٍ، وَلِمُسلمٍ: كَانَ وِسَادَةُ رَسُولِ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ الَّتِي يَتَّكِئُ عَلَيْهَا مِنْ أَدَمٍ حَشْوُهَا لِيفٌ.

అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
ప్రామాణికమైన హదీథు
వ్యాఖ్యానము

విశ్వాసుల మాతృమూర్తి ఆయషా రదియల్లాహు అన్హా తెలిపారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నిద్రించే పరుపు తోలుతో తయారు చేయబడింది, మరియు దానిలో ఖర్జూర చెట్ల బెరడు నింపబడి ఉండేది. ఆయన ఆనుకునే తలగడ కూడా అదే విధంగా ఉండేది.

హదీథు యొక్క ప్రయోజనాలలో నుండి

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గనక తలచుకుంటే ఇహలోక సుఖభోగాలను అనుభవించే శక్తి సామర్థ్యాలను పరమ పవిత్రుడైన అల్లాహ్ ఆయనకు ప్రసాదించే అవకాశం ఉన్నప్పటికీ, ఆయన వాటి పట్ల వైరాగ్యము మరియు విముఖతను కలిగి ఉండేవారు అనే విషయం యొక్క వివరణ ఉన్నది.

పరుపులు మరియు దిండ్లను తీసుకోవడానికి, వాటిపై నిద్రపోవడానికి మరియు వాటిపై ఆనుకోవడానికి అనుమతి ఉంది అని స్పష్టము అవుతున్నది.

ఒక ముస్లిం తన హోదాను మరియు జీవన విధానాన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క హోదాతో పోల్చుకోవాలి, ఎందుకంటే ఆయన ఒక రోల్ మోడల్ మరియు మంచి ఉదాహరణ మరియు ఆయన అడుగుజాడలను అనుసరించే వారు ఈ ప్రపంచంలో మరియు పరలోకంలో మార్గనిర్దేశం చేయబడతారు మరియు విజయం సాధిస్తారు.

పరలోకం కోసం సన్నద్ధమవ్వాలని, ఒక విశ్వాసి అల్లాహ్ ఆజ్ఞాపాలనలో సహాయపడేంత వరకు మాత్రమే ఈ ప్రపంచంతో సంతృప్తి చెందాలని, మరియు దానిని అధికంగా సమీకరించడంలో నిమగ్నం కాకూడదని ప్రోత్సహించబడింది. అల్లాహ్ ఒక జాతిని గద్దిస్తూ ఇలా అన్నాడు: {అధికంగా సమీకరించాలనే కోరిక మిమ్మల్ని పరధ్యానంలో పడవేసింది, మీరు సమాధులను సందర్శించేంత వరకు} [అత్తకాసుర్ 102:1-2].

సమీక్షకుడు

సహీహ్ అల్ బుఖారీ. (8/ 97) (6456).

సహీహ్ ముస్లిం. (3/ 1650) (2082).

ఇంకా (4)

البحر المحيط الثجاج في شرح صحيح الإمام مسلم بن الحجاج (34/ 662).

إرشاد الساري لشرح صحيح البخاري (9/ 264).

المفهم لما أشكل من تلخيص كتاب مسلم (5/ 403).

النهاية في غريب الحديث والأثر (971).