మీలో ఎవరూ విశ్వాసి కాలేడు - నేను తెచ్చిన దానికి అతని కోరికలు అనుసరించేలా చేసేంత వరకు
అబూ ముహమ్మద్ అబ్దుల్లాహ్ ఇబ్నె అమర్ ఇబ్నిల్ ఆస్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖన, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
"మీలో ఎవరూ విశ్వాసి కాలేడు - నేను తెచ్చిన దానికి అతని కోరికలు అనుసరించేలా చేసేంత వరకు."
«لَا يُؤْمِنُ أَحَدُكُمْ حَتَّى يَكُونَ هَوَاهُ تَبَعًا لِمَا جِئْتُ بِهِ».
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా వివరించారు: ఒక వ్యక్తి తన విశ్వాసంలో పరిపూర్ణతను పొందలేడు - అతను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెచ్చిన ఆజ్ఞలు, నిషేధాలు మరియు ఇతర విషయాలను ప్రేమించేంత వరకు. తద్వారా అతను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశించిన వాటిని ప్రేమిస్తాడు, మరియు ఆయన నిషేధించిన వాటిని ద్వేషిస్తాడు.
"ఈ హదీథు, ఇస్లామీయ చట్టానికి (షరియా) పూర్తిగా సమర్పించుకోవడానికి మరియు దానిని పాటించడానికి మార్గదర్శకం చేసే ఒక ప్రాథమిక సూత్రం."
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెచ్చిన దానిపై ఒక వ్యక్తి తన బుద్ధి లేదా అలవాటుకు ప్రాధాన్యత నిస్తే, అలాంటి వ్యక్తి నుండి విశ్వాసం దూరం చేయబడిందని మానవుడిని హెచ్చరించడం.
"ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం 'నేను తెచ్చిన దానిని' అని అన్నందున, ప్రతి విషయంలోనూ ఇస్లామీయ షరియాను అమలు చేయడం తప్పనిసరి."
"విశ్వాసం విధేయతతో పెరుగుతుంది మరియు అవిధేయతతో తగ్గుతుంది."
ఇంకా (5)
الحجة على تارك المحجة لأبي الفتح نصر بن إبراهيم المقدسي.
برقم (25).
فتح الباري لابن حجر (13/289).
جامع العلوم والحكم (3/1146).
شرح النووي على مسلم (1/77).
గ్రంథాలలో ఉల్లేఖించబడింది
5 గ్రంథాలుఇంకా (5)
- أخطاء يرتكبها بعض الحجاج«لَا يُؤْمِنُ أَحَدُكُمْ حَتَّى يَكُونَ هَوَاهُ تَبَعًا لِمَا جِئْتُ بِهِ»[49].
- الخطب المنبريةموسوعة الخطب المنبرية (القسم الأول)«لَا يُؤْمِنُ أَحَدُكُمْ حَتَّى يَكُونَ هَوَاهُ تَبَعًا لِمَا جِئْتُ بِهِ»
- شرح الأربعين النووية«لَا يُؤْمِنُ أَحَدُكُمْ حَتَّى يَكُونَ هَوَاهُ تَبَعًا لِمَا جِئْتُ بِهِ».
- كتاب التوحيدكتاب التوحيد للشيخ محمد بن عبد الوهاب((لاَ يُؤْمِنُ أَحَدُكُمْ حَتَّى يَكُونَ هَوَاهُ تَبَعًا لِمَا جِئْتُ بِهِ)).
- متن اصول الإيمانمتن أصول الإيمان{لا يؤمن أحدكم حتى يكون هواه تبعا لما جئت به}.