Skip to content

కలహాలు, అశాంతి సమయాలలో ఆరాధన చేయడం అంటే నాకు హిజ్రత్ (ధర్మం కోసం వలస) చేసినట్లుగా ఉంటుంది

మఅఖిల్ ఇబ్న్ యసార్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:

కలహాలు, అశాంతి సమయాలలో ఆరాధన చేయడం అంటే నాకు హిజ్రత్ (ధర్మం కోసం వలస) చేసినట్లుగా ఉంటుంది.

«الْعِبَادَةُ فِي الْهَرْجِ كَهِجْرَةٍ إِلَيَّ».

ముస్లిం నమోదు చేసినారు:
ప్రామాణికమైన హదీథు
వ్యాఖ్యానము

కలహాలు, గందరగోళం, పరస్పర హత్యలు ఎక్కువగా ఉన్న కాలంలో కూడా ఎవరు ఆరాధనలను పట్టుదలగా నిరంతరం కొనసాగిస్తూ ఉంటారో, వారికి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వద్ద మక్కా విజయానికి ముందు హిజ్రత్ చేసినవారి స్థానం లభిస్తుంది. అశాంతి, ఫిత్నా (కలహాలు), హత్యలు, మరియు ప్రజల వ్యవహారాలు గందరగోళంగా ఉన్న కాలంలో ఆరాధనలో నిబద్ధంగా ఉండాలని, దాన్ని గట్టిగా పట్టుకొని ఉండాలని ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం సూచించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్ద అలాంటి సమయంలో కూడా ఆరాధన కొనసాగించినందుకు లభించే పుణ్యం, హిజ్రత్ (వలస) చేసిన వారి పుణ్యంతో సమానం. ఎందుకంటే, అటువంటి కష్టకాలంలో ప్రజలు ఆరాధనను మర్చిపోయి, ఇతర విషయాలలో మునిగి పోతారు, అతి కొద్దిమంది మాత్రమే ఆరాధనకు సమయం కేటాయిస్తారు.

హదీథు యొక్క ప్రయోజనాలలో నుండి

ఫిత్నా (కలహాలు, గందరగోళం) కాలంలో ఆరాధన చేయాలని, అల్లాహ్ వైపు మరింత దృష్టి కేంద్రీకరించాలని ప్రోత్సహించడం అనేది ఫిత్నాల నుంచి రక్షణగా పని చేస్తుంది. మరియు పాపం, వినాశం నుంచి కాపాడుకునేందుకు ఇది చాలా అవసరం.

ఫిత్నా (కలహాలు, గందరగోళం) మరియు ప్రజలు నిర్లక్ష్యం చేసే సమయాలలో ఆరాధన చేయడంలోని గొప్ప మహత్యం ఇక్కడ వివరించబడింది.

ఒక ముస్లిం కలహాలు, గందరగోళాలు మరియు నిర్లక్ష్యమైన పరిస్థితులకు దూరంగా ఉండాలి.

సమీక్షకుడు

సహీహ్ ముస్లిం. (4/ 2268) (2948).

ఇంకా (4)

كشف المشكل من حديث الصحيحين (2/ 42).

البحر المحيط الثجاج في شرح صحيح الإمام مسلم بن الحجاج (45/ 5).

بهجة الناظرين (2/ 455).

نزهة المتقين (ص942).