Skip to content

“ఎవరైతే ఫజ్ర్ సలాహ్’ను (ఫజ్ర్ నమాజును) ఆచరిస్తారో, వారు అల్లాహ్ రక్షణలో ఉన్నారు

జుందుబ్ బిన్ అబ్దుల్లాహ్ అల్ ఖస్రియ్యి రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:

“ఎవరైతే ఫజ్ర్ సలాహ్’ను (ఫజ్ర్ నమాజును) ఆచరిస్తారో, వారు అల్లాహ్ రక్షణలో ఉన్నారు. కనుక మీలో ఎవరూ కూడా అల్లాహ్ రక్షణలో ఉన్న వానికి ఏ విధంగానూ హాని తలపెట్టరాదు. ఎవరైతే హాని తలపెడతాడో, అతడిని అల్లాహ్ యొక్క ఆగ్రహం చుట్టుకుంటుంది. అతడు ముఖం మీద పడవేసి నరకాగ్ని లోనికి విసిరి వేయబడతాడు”.

«مَنْ صَلَّى صَلَاةَ الصُّبْحِ فَهُوَ فِي ذِمَّةِ اللهِ، فَلَا يَطْلُبَنَّكُمُ اللهُ مِنْ ذِمَّتِهِ بِشَيْءٍ، فَإِنَّهُ مَنْ يَطْلُبْهُ مِنْ ذِمَّتِهِ بِشَيْءٍ يُدْرِكْهُ، ثُمَّ يَكُبَّهُ عَلَى وَجْهِهِ فِي نَارِ جَهَنَّمَ».

ముస్లిం నమోదు చేసినారు:
ప్రామాణికమైన హదీథు
వ్యాఖ్యానము

ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం – ఎవరైతే ఫజ్ర్ సలాహ్ ఆచరిస్తారో వారు అల్లాహ్ యొక్క సంరక్షణలో, ఆయన పహరాలో మరియు ఆయన సహాయములో ఉంటారు - అని తెలియజేస్తున్నారు. తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేసారు – ఫజ్ర్ సలాహ్ ను వదిలి వేయడం ద్వారా లేదా భక్తులపై దాడి చేయడం లేదా వారిపై దౌర్జన్యం చేయడం ద్వారా, అల్లాహ్ యొక్క ఈ వాగ్దానాన్ని భంగ పరచడం లేదా వ్యతిరేకించడం మొదలైనవి చేయరాదని హెచ్చరించినారు. ఎందుకంటే ఎవరైతే అలా చేస్తాడో, అతడు అల్లాహ్ యొక్క వాగ్దానాన్ని భంగ పరిచాడన్నమాట. అటువంటి వాడిని ‘నా హక్కును నీవు ఎందుకు నిర్లక్ష్యం చేసావు’ అని అల్లాహ్ ప్రశ్నిస్తాడు. అల్లాహ్ ఆ విధంగా ఎవరినైతే అడుగుతాడో, అల్లాహ్ అతడిని ముఖంపై పడవేసి నరకాగ్నిలోనికి విసరివేస్తాడు.

పదాల అర్థాలు

...:

హదీథు యొక్క ప్రయోజనాలలో నుండి

ఇందులో ఫజ్ర్ సలాహ్ యొక్క ప్రాముఖ్యత, మరియు దాని ఘనత తెలుస్తున్నాయి.

ఇందులో – ఫజ్ర్ సలాహ్ ఆచరించిన వారికి హాని కలిగించరాదనే తీవ్రమైన హెచ్చరిక ఉన్నది.

సత్యవంతులైన అల్లాహ్ యొక్క దాసులకు హాని కలిగించే వారి పట్ల అల్లాహ్ యొక్క ప్రతీకారం ఉంటుందని తెలుస్తున్నది.

సమీక్షకుడు

సహీహ్ ముస్లిం. (1/ 454) (657).

ఇంకా (6)

المعجم الأوسط (4/ 5) (3464).

نزهة المتقين شرح رياض الصالحين (1/ 249).

شرح رياض الصالحين.

لابن عثيمين (2/ 561).

بهجة الناظرين شرح رياض الصالحين.

لسليم الهلالي (1/ 323).