Skip to content

“ఇంటిలో ఆయన తన కుటుంబానికి సేవ చేసేవారు అంటే తన ఇంటి పనులలో సహాయం చేసేవారు, మరియు నమాజు సమయం వచ్చినప్పుడు నమాజు కోసం బయటకు వెళ్లేవారు.”

కుడి వైపున నిద్రపోవడం వల్ల త్వరగా మేల్కొనవచ్చు, ఎందుకంటే గుండె కుడి వైపు నిద్రపోయిన స్థితిలో గుండే తక్కువగా స్థిరంగ ఉంటుంది మరియు గుండె ఎడమ వైపున ఉన్నందు వలన కుడి వైపునకు తిరిగి పడుకోవడం అనేది గుండెకు మరింత విశ్రాంతినిస్తుంది. ఒక వ్యక్తి ఎడమ వైపునకు తిరిగి నిద్రపోతే, శరీరపు బరువు దానిపై పడి ఒత్తిడి కలుగజేస్తుంది, అది హృదయానికి హాని కలిగిస్తుంది.

“నేను ఆయిషా రదియల్లాహు అన్హాను అడిగాను, “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇంట్లో ఏమి చేసేవారు?” అని. ఆమె ఇలా అన్నారు, “ఇంటిలో ఆయన తన కుటుంబానికి సేవ చేసేవారు అంటే తన ఇంటి పనులలో సహాయం చేసేవారు, మరియు నమాజు సమయం వచ్చినప్పుడు నమాజు కోసం బయటకు వెళ్లేవారు.”

سَأَلْتُ عَائِشَةَ مَا كَانَ النَّبِيُّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ يَصْنَعُ فِي بَيْتِهِ؟ قَالَتْ: كَانَ يَكُونُ فِي مِهْنَةِ أَهْلِهِ -تَعْنِي خِدْمَةَ أَهْلِهِ-، فَإِذَا حَضَرَتِ الصَّلاَةُ خَرَجَ إِلَى الصَّلاَةِ.

అల్ బుఖారీ నమోదు చేసినారు:
ప్రామాణికమైన హదీథు
వ్యాఖ్యానము

విశ్వాసుల మాతృమూర్తి అయిన ఆయషా రదియల్లాహు అన్హాను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన ఇంటిలో ఎలా ఉండేవారు అని, తన ప్రవర్తన గురించి, తాను చేసే పనుల గురించి అడిగారు. ఆమె ఇలా జవాబిచ్చినారు: "ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇతరుల వలే ఒక మానవమాత్రుడు మాత్రమే. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం పురుషులు తమ ఇళ్లలో చేసే విధంగానే పని చేసేవారు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం తన పనులను తానే చేసుకునేవారు మరియు తన కుటుంబానికి కూడా సేవ చేసేవారు (అంటే ఇంటి పనులలో సహాయం చేసేవారు); ఆయన తమ గొర్రెలకు పాలు పితుకుతారు, తన బట్టలు చిరిగిపోతే కుట్టుకుంటారు, తన చెప్పులు తెగిపోతే వాటిని కుట్టి సరిచేసుకుంటారు మరియు ఇంటిలో లోహపు బాల్చీ (బక్కెట్టు) పాడైపోతే దానికి అతుకులు వేసి బాగుచేస్తారు. అయితే నమాజు సమయం ఆసన్నమైనపుడు, ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఆలస్యం చేయకుండా నమాజు కొరకు బయటకు వెళ్ళేవారు.

హదీథు యొక్క ప్రయోజనాలలో నుండి

ఇందులో ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం అణకువ, వినయవిధేయతల యొక్క పరిపూర్ణత మరియు ఆయన కుటుంబం పట్ల ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ప్రీతి, వాత్సల్యము గమనించవచ్చు.

ప్రాపంచిక లక్ష్యాలు, పనులు అల్లాహ్ యొక్క దాసుడిని నమాజు నుండి దూరం చేయకూడదు.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విధిగా ఆచరించవలసిన ఐదు నమాజులను వాటి ప్రారంభ సమయాలలో ఆచరించేవారు.

ఇమాం ఇబ్న్ హజర్ అల్ అస్ఖలానీ (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు: “ఈ హదీథు వినయాన్ని, అహంకారాన్ని విడిచిపెట్టి, తన కుటుంబానికి సేవ చేయడాన్ని ప్రోత్సహిస్తుంది”.

సమీక్షకుడు

సహీహ్ అల్ బుఖారీ. (1/ 136) (676).

ఇంకా (8)

بهجة الناظرين شرح رياض الصالحين.

لسليم الهلالي (1/ 660).

شرح رياض الصالحين.

لابن عثيمين (3/ 526).

شرح صحيح البخاري.

لابن بطال (2/ 296).

نزهة المتقين شرح رياض الصالحين.

لمجموعة من الباحثين (1/ 516).