Skip to content

“చెప్పండి, మీరు కోరుకున్నంత ఆహారం మరియు పానీయాలతో మీరు సుఖంగా జీవించడం లేదా? నేను మీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లంను చూశాను, ఆయన వద్ద (ఇంటిలో) కడుపు నింపుకోవడానికి తక్కువ నాణ్యత గల ఖర్జూరం కూడా దొరకలేదు

అన్’ను’మాన్ ఇబ్న్ బషీర్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన:

“చెప్పండి, మీరు కోరుకున్నంత ఆహారం మరియు పానీయాలతో మీరు సుఖంగా జీవించడం లేదా? నేను మీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లంను చూశాను, ఆయన వద్ద (ఇంటిలో) కడుపు నింపుకోవడానికి తక్కువ నాణ్యత గల ఖర్జూరం కూడా దొరకలేదు.

أَلَسْتُمْ فِي طَعَامٍ وَشَرَابٍ مَا شِئْتُمْ؟ لَقَدْ رَأَيْتُ نَبِيَّكُمْ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ وَمَا يَجِدُ مِنَ الدَّقَلِ مَا يَمْلَأُ بِهِ بَطْنَهُ.

ముస్లిం నమోదు చేసినారు:
ప్రామాణికమైన హదీథు
వ్యాఖ్యానము

ఇందులో అన్-నుమాన్ ఇబ్న్ బషీర్ రదియల్లాహు అన్హు ప్రజలకు వారి ఆశీర్వాదాలను గుర్తుచేస్తున్నారు; వారు కోరుకున్నంత ఎక్కువ ఆహారం మరియు పానీయాలను భుజిస్తూ ఉన్నారు. తరువాత ఆయన, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్థితిని, ఆకలి కారణంగా ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం కడుపు నింపుకోవడానికి – నాణ్యమైన ఖర్జూరాల మాట అటుంచి – కనీసం నాణ్యతలేని ఖర్జూరం కూడా ఆయనకు దొరకలేదు అని వివరిస్తున్నారు.

హదీథు యొక్క ప్రయోజనాలలో నుండి

ఇందులో ప్రాపంచిక జీవితం పట్ల ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అనాసక్తత, వైరాగ్యము తెలుస్తున్నాయి.

అలాగే ఈ లోకం పట్ల అనాసక్తంగా ఉండాలని, అది తమ భారాన్ని తగ్గిస్తుందని, మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉదాహరణను అనుసరించాలని ప్రజలకు హితబోధ ఉన్నది.

ఇందులో ప్రజలు అనుభవిస్తున్న ఆశీర్వాదాలను గుర్తుచేస్తూ, వాటి కోసం అల్లాహ్’కు కృతజ్ఞతతో ఉండాలని వారిని కోరడం కనిపిస్తున్నది.

సమీక్షకుడు

సహీహ్ ముస్లిం. (4/ 2284) (2977).

ఇంకా (10)

بهجة الناظرين شرح رياض الصالحين.

لسليم الهلالي (1/ 537).

نزهة المتقين شرح رياض الصالحين.

لمجموعة من الباحثين (1/ 421).

كنوز رياض الصالحين.

لمجموعة من الباحثين (7/ 300).

شرح رياض الصالحين.

لابن عثيمين (3/ 370).

كشف المشكل.

لابن الجوزي (2/ 216).