Skip to content

“అల్లాహ్ కు అత్యంత ప్రియమైన ప్రదేశాలు మస్జిదులు, మరియు అల్లాహ్ కు అత్యంత అయిష్టమైన ప్రదేశాలు మార్కెట్లు (బజార్లు, సంతలు, అంగళ్ళు, వాణిజ్యకేంద్రాలు, వ్యాపార లావాదేవీలు జరిగే ప్రదేశలు మొ.)”

అబూ హురైరాహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన: “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:

“అల్లాహ్ కు అత్యంత ప్రియమైన ప్రదేశాలు మస్జిదులు, మరియు అల్లాహ్ కు అత్యంత అయిష్టమైన ప్రదేశాలు మార్కెట్లు (బజార్లు, సంతలు, అంగళ్ళు, వాణిజ్యకేంద్రాలు, వ్యాపార లావాదేవీలు జరిగే ప్రదేశలు మొ.)”.

«أَحَبُّ الْبِلَادِ إِلَى اللهِ مَسَاجِدُهَا، وَأَبْغَضُ الْبِلَادِ إِلَى اللهِ أَسْوَاقُهَا».

ముస్లిం నమోదు చేసినారు:
ప్రామాణికమైన హదీథు
వ్యాఖ్యానము

ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేస్తున్నారు: సర్వశక్తిమంతుడైన అల్లాహ్’కు అత్యంత ప్రియమైన ప్రదేశాలు మస్జిదులు, ఎందుకంటే అవి విధేయతా గృహాలు మరియు దైవభక్తిపై స్థాపించ బడినటువంటివి. అల్లాహ్’కు అత్యంత అసహ్యకరమైన ప్రదేశాలు మార్కెట్లు, ఎందుకంటే అవి తరచుగా మోసం, వంచన, వడ్డీ, తప్పుడు ప్రమాణాలు, వాగ్దానాల ఉల్లంఘనలు మరియు అల్లాహ్ యొక్క జ్ఞాపకం (స్మరణ) నుండి తప్పుదారి పట్టించే ప్రదేశాలు.

హదీథు యొక్క ప్రయోజనాలలో నుండి

ఈ హదీథులో మస్జిదుల పవిత్రత మరియు వాటి యొక్క ఘనత తెలియజేయ బడుతున్నది; ఎందుకంటే అవి అల్లాహ్ యొక్క నామము తరచుగా ప్రస్తావించబడే గృహాలు.

అలాగే ఇందులో సర్వశక్తిమంతుడైన అల్లాహ్ యొక్క ప్రేమ మరియు ప్రసన్నతను పొందే సంకల్పముతో మస్జిదులకు తరుచూ వెళుతూ ఉండాలని, మస్జిదులలో ఎక్కువ కాలం గడపాలని; ద్వేషానికి కారణమయ్యే విషయాల్లో పడకుండా ఉండటానికి, అవసరమైనప్పుడు తప్ప, మార్కెట్లకు సందర్శనలను తగ్గించుకోవాలనే ప్రోత్సాహం ఉన్నది.

ఇమాం అన్’నవవీ రహిమహుల్లాహ్ ఇలా అన్నారు: “అల్లాహ్ యొక్క కరుణ మరియు కృప అవతరించే ప్రదేశాలు మస్జిదులు; దీనికి విరుద్ధమైనవి మార్కెట్ ప్రదేశాలు.”

సమీక్షకుడు

సహీహ్ ముస్లిం. (1/ 464) (671).

ఇంకా (8)

نزهة المتقين.

لمجموعة من الباحثين (2/ 1250).

بهجة الناظرين.

لسليم الهلالي (3/ 305).

شرح رياض الصالحين.

لابن عثيمين (6/ 655).

كنوز رياض الصالحين.

لمجموعة من الباحثين (21/ 526).