نص الموضوع
స్వలింగ సంపర్కము, అనగా పురుషుల పిరుదులలో సంభోగించడం, ఘోరపాపాలలో ఒక ఘోరపాపము. అది అల్లాహ్ ప్రజలను సృష్టించిన స్వచ్ఛమైన స్వభావాన్ని తలక్రిందులు చేస్తుంది. అందువల్ల అది నైతికతను నాశనం చేస్తుంది, పౌరుషాన్ని తుడిచివేస్తుంది, సంతానాన్ని అరికడుతుంది, సమాజాన్ని పాడుచేస్తుంది, మరియు మహోన్నతుడైన అల్లాహ్ యొక్క ఆగ్రహాన్ని మరియు కఠినమైన శిక్షను తప్పనిసరి చేస్తుంది. లూతు జాతి వారి గురించి మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
﴾మా తీర్పు సమయం వచ్చినపుడు మేము దానిని (సోడోంను) తలక్రిందులుగా జేసి, దాని మీద మట్టితో చేసి కాల్చిన గులకరాళ్ళను ఎడతెగకుండా కురిపించాము.82
అవి నీ ప్రభువు తరఫు నుండి గుర్తు వేయబడినవి. అది (ఆ శిక్ష) ఈ దుర్మార్గులకు ఎంతో దూరంలో లేదు 83﴿
[హూద్: 114]
ఆధారాలు:
లివాతత్ హరాము అని, దాని వికారము మరియు దాని నేరం యొక్క ఘోరత్వాన్ని గూర్చిన ఆధారాలు చాలా ఉన్నాయి, వాటిలో కొన్ని:
అల్లాహ్ లూత్ అలైహిస్సలాం తన జాతి ప్రజలతో పలికిన మాట గురించి తెలియపరుస్తూ ఇలా పలికాడు:
﴾(ప్రకృతికి విరుద్ధంగా) సర్వప్రాణులలో కెల్లా మీరే పురుషుల వద్దకు పోతారేమిటీ?165
మీ ప్రభువు, మీ కొరకు సహవాసులు (అజ్వాజ్) గా పుట్టించిన వారిని విడిచి పెడుతున్నారేమిటి? అలా కాదు, మీరు హద్దు మీరి ప్రవర్తించే జాతివారు!166﴿
[షు'అరా: 165-166]
﴾عَادُونَ﴿ అనగా: మీ ప్రభువు మీకు ధర్మసమ్మతం చేసిన మర్మావయవాలను మీరు అతిక్రమించి, వాటిలో నుంచి మీపై నిషేధించిన వాటి వైపు వెళ్తున్నారు [167].
[109] తబ్రీ వ్యాఖ్యానము (6/625).
మరియు అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
﴾ఇక లూత్! అతను తన జాతి వారితో: "ఏమీ? మీరు ఇంతకు పూర్వం ప్రపంచంలో ఎవ్వరూ చేయని అసహ్యకరమైన పనులు చేస్తారా?" అని అడిగిన విషయం జ్ఞప్తికి తెచ్చుకోండి.80
వాస్తవానికి, మీరు స్త్రీలను వదలి కామంతో పురుషుల వద్దకు పోతున్నారు. వాస్తవంగా, మీరు మితిమీరి ప్రవర్తిస్తున్నారు.81﴿
[అల్ ఆరాఫ్: 3]
అబ్దుల్లాహ్ ఇబ్నె అబ్బాస్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం: రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించినారు:
«ఎవరైనా లూత్ అలైహిస్సలాం జాతి వారి చర్యను చేస్తున్నట్లుగా మీరు గమనిస్తే, ఆ పని చేసేవాడిని మరియు చేయించుకునేవాడిని ఇద్దరినీ హతమార్చండి» [168].
[37] ఈ హదీసును అబూ దావుద్ హదీథు సంఖ్య (4607) లో ఉల్లేఖించారు.
జాబిర్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన: “రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా పలికినారు:
"నిశ్చయంగా నా ఉమ్మత్ విషయంలో నన్ను ఎక్కువగా భయాందోళనలకు గురి చేస్తున్న విషయం లూత్ జాతి వారి చర్య". [169]
[28] ఈ హదీసును తిర్మిథీ, హదీథు సంఖ్య (2140) లో ఉల్లేఖించారు.
నష్టాలు:
స్వలింగ సంపర్కము వలన అనేక నష్టాలు ఉన్నాయి, వాటిలో కొన్ని ఇవే:
- దీనిని ఆచరించువాడు పరలోకంలో తీవ్రమైన శిక్షకు గురవుతాడు.
- హలాల్ నికాహ్'లు తగ్గిపోవటం, మరియు అవివాహితులుగా మిగిలిపోవటం అధికమవటం.
- సంతానం తగ్గిపోవడం లేదా పూర్తిగా నిలిచిపోవడం; ఇది జీవన జలాన్ని (వీర్యాన్ని) నాశనం చేయడమే. ఇది సాగుకు అనర్హమైన భూమిలో విత్తనాన్ని చల్లినవాడితో సమానం.
- ఇబ్నుల్ ఖయ్యిమ్ రహిమహుల్లాహ్ ఇలా చెప్పారు:
"స్వలింగ సంపర్కము, చేసేవాడిలో మరియు చేయించుకునేవాడిలో చింత, విచారం మరియు అసహ్యాన్ని కలిగిస్తుంది" [170].
[170] జాదుల్ మఆద్ (4/241-242) సంక్షిప్తంగా.
ఇంకా: అది ముఖాన్ని నల్లగా చేస్తుంది, వక్షస్థలాన్ని చీకటిమయం చేస్తుంది మరియు హృదయ కాంతిని ఆర్పివేస్తుంది.
మరియు ఇంకా ఇది, ఆ పని చేసేవాడికి మరియు ఆ పనికి గురైన వాడికి మధ్య తప్పనిసరిగా విముఖత, తీవ్రమైన ద్వేషం మరియు సంబంధాల విచ్ఛిన్నానికి కారణమవుతుంది.
అంతేకాకుండా, అది చేసేవాడి మరియు దానికి గురైనవాడి స్థితిని కోలుకోలేని విధంగా నాశనం చేస్తుంది, అల్లాహ్ చిత్తశుద్ధితో కూడిన పశ్చాత్తాపం ద్వారా సంస్కరించాలని తలిస్తే తప్ప.
అంతేకాకుండా, ఇది అనుగ్రహాలు తొలగిపోవడానికి మరియు దైవాగ్రహాలు దిగిరావడానికి గల అతిపెద్ద కారణాలలో ఒకటి.
అంతేకాక, ఇది సిగ్గును పూర్తిగా తొలగిస్తుంది. సిగ్గు హృదయాల ప్రాణం, ఒకవేళ హృదయం దానిని కోల్పోతే, అది చెడును మంచిగాను, మంచిని చెడుగాను పరిగణిస్తుంది, మరియు అప్పుడు దాని వినాశనం స్థిరపడిపోతుంది.
అంతేకాకుండా, ఇది మరేదీ కలిగించనంతటి మొండితనాన్ని, దుస్సాహసాన్ని పుట్టిస్తుంది.
- పూర్వ యుగాలలో లేని వ్యాధులు పుట్టుకురావడం, ఉదాహరణకు ఎయిడ్స్ వ్యాధి.
- ఇది సిహాక్ (స్త్రీల మధ్య లైంగిక సంబంధం) లేదా వ్యభిచారానికి దారి తీస్తుంది; ఎందుకంటే పురుషులు పురుషులతోనే తృప్తి చెందితే, స్త్రీలు స్త్రీలతోనే తృప్తి చెందుతారు, లేదా తమ వాంఛను తీరించుకోవడానికి స్త్రీ తన భర్త కానివారిని ఆశ్రయించే పరిస్థితి కూడా కలుగవచ్చు.
రక్షణ:
స్వలింగసంపర్కము నేరములో పడకుండా రక్షణ పొందే మార్గములు:
- వివాహం, స్వలింగ సంపర్కం నుండి కాపాడే అత్యంత శక్తివంతమైన కారణాలలో ఒకటి. ఎవరికైతే వివాహం చేసుకోగల స్థోమత లేదో వారు ఉపవాసం పాటించాలి; అబ్దుల్లా బిన్ మస్ఊద్ రజియల్లాహు అన్హు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నుండి ఉల్లేఖించారు, ఆయన ఇలా అన్నారు:
“మీలో వివాహం చేసుకోగల స్థోమత కలిగిన వారు వివాహం చేసుకోవాలి. ఎందుకంటే (ఇది ఇతర మహిళలను చూడకుండా) చూపులను నిగ్రహిస్తుంది, మరియు (చట్టవిరుద్ధమైన లైంగిక సంబంధాలలో పడకుండా) మర్మాంగాలను రక్షిస్తుంది. మరియు ఎవరైనా అలా చేయలేకపోతే (వివాహం చేసుకునే స్థోమత లేకపోయినట్లైతే), అతడు ఉపవాసం ఉండాలి, ఎందుకంటే అది అతనికి రక్షణగా ఉంటుంది.” [85].
[1] దీనిని బుఖారీ హదీథు సంఖ్య (2766); ముస్లిం హదీథు సంఖ్య (89) లో ఉల్లేఖించారు.
- పురుషుడు మరో పురుషుని మర్మాంగాలను చూడరాదు; అబూ సయీద్ అల్ ఖుద్రి రజియల్లాహు అన్హు కథనం, మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లమ్ ప్రవచించారు:
“ఒక పురుషుడు మరో పురుషుని మర్మాంగవయవాల వైపుకు చూడకూడదు. అలాగే ఒక స్త్రీ మరో స్త్రీ మర్మాంగవయవాల వైపుకు చూడకూడదు. ఒక పురుషుడు మరో పురుషుడితో కలిసి ఒక దుప్పటిలో పడుకోకూడదు. అలాగే ఒక స్త్రీ మరో స్త్రీ తో కలిసి ఒక దుప్పటిలో పడుకోకూడదు” [172].
[3] ఈ హదీసును ముస్లిం, హదీథు సంఖ్య (233) లో ఉల్లేఖించారు.
- అశ్లీల వెబ్‌సైట్‌లలోకి ప్రవేశించవద్దు, లేదా స్త్రీ, పురుషులైన చెడు స్నేహితులతో సంప్రదించవద్దు.
- పది సంవత్సరాల వయసుకు చేరుకున్నప్పుడు సంతానం పడకలను - వారు మగపిల్లలైనా లేదా ఆడపిల్లలైనా సరే - వేరు చేయాలి. అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ బిన్ ఆస్ (రదియల్లాహు అన్హుమా) ఉల్లేఖనం ప్రకారం, అల్లాహ్ యొక్క ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు:
“మీ సంతానం ఏడు సంవత్సరాల వయసులో ఉన్నపుడు సలాహ్ (నమాజు) ఆచరించమని ఆదేశించండి; పది సంవత్సరాల వయసులో (సలాహ్ ఆచరించకపోతే) వారిని దండించండి; అలాగే వారి పడకలు (ఆడపిల్లల పడకలు, మగపిల్లల పడకలు) వేరు చేయండి.” [173].
- స్వలింగ సంపర్కము అనే మహాపాపం యొక్క ఇహపరలోక పరిణామాల నుండి భయపెట్టటం.
- సరైన అఖీదాను నాటడం, దాని మూలస్తంభాలను స్థిరపరచడం మరియు వ్యక్తులు, సమాజాల హృదయాలలో దానిని ఎల్లప్పుడూ పెంపొందించడం పట్ల సంపూర్ణ శ్రద్ధ వహించడం: ఎందుకంటే ప్రవర్తనా విచలనం చాలా సందర్భాలలో అఖీదాలోని లోపం వల్లనే సంభవిస్తుంది.