Skip to content

نص الموضوع

వడ్డీ అత్యంత ఘోరమైన పాపాలలో ఒకటి. అది అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తో యుద్ధం చేయడం. అది దానిని చేసేవాడిని ఇహలోకంలో మరియు పరలోకంలో తీవ్రమైన నష్టాలకు గురిచేస్తుంది, అంతేకాక అది ఆర్థిక జీవితాన్ని పాడు చేసి, వ్యక్తి మరియు సమాజంపై ప్రభావం చూపుతుంది.

రిబా అనగా గడువుకు బదులుగా అప్పుపై విధించే అదనపు మొత్తం, మరియు రిబా వర్తించే రెండు వస్తువుల మార్పిడిలో ఉండే అదనపు మొత్తాన్ని కూడా రిబా అంటారు, దీనిని రిబాఉల్-ఫద్ల్ అని పిలుస్తారు.

ఇక రిబా అన్-నసీయా అనగా, రిబాఉల్-ఫద్ల్ యొక్క ఇల్లతు (కారణం)లో ఏకీభవించిన ప్రతీ రెండు రకాల వస్తువుల విక్రయంలో, వాటి స్వాధీనాన్ని (చెల్లింపును) ఆలస్యం చేయడం.

అబూ సయీద్ అల్ ఖుద్రీ రదియల్లాహు అన్హు ఉల్లేఖనం: “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:

«బంగారానికి బంగారం, వెండికి వెండి, గోధుమలకు గోధుమలు, జొన్నలకు జొన్నలు, ఖర్జూరాలకు ఖర్జూరాలు, ఉప్పుకు ఉప్పు — సరిసమానంగా, చేతికి చేయి (అక్కడికక్కడే) మార్పిడి జరగాలి. ఎవరైతే ఎక్కువ ఇచ్చినా లేదా అదనంగా తీసుకున్నా, అది వడ్డీ అవుతుంది. ఇందులో తీసుకునేవాడు మరియు ఇచ్చేవాడు ఇద్దరూ సమానులే». [105]

[1] దీనిని బుఖారీ హదీథు సంఖ్య (2766); ముస్లిం హదీథు సంఖ్య (89) లో ఉల్లేఖించారు.

వడ్డీకి సంబంధించిన వ్యవహారాలు మరియు పద్ధతులు చాలా ఉన్నాయి, కాబట్టి ఒక ముస్లిం వాటిని తెలుసుకొని, వాటి పట్ల జాగ్రత్త వహించి, వాటికి దూరంగా ఉండాలి, మరియు ఏ లావాదేవీలోనైనా దాని ధార్మిక తీర్పును తెలుసుకునే వరకు దానిలో ప్రవేశించకూడదు.

ఆధారాలు:

వడ్డీ గురించి హెచ్చరిస్తూ ఖుర్ఆన్ మరియు సున్నత్ లలో అనేక ప్రామాణికి ఆధరాలు వచ్చాయి, వాటిలో:

మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:

﴾ఎవరైతే వడ్డీ తింటారో! వారి స్థితి (పునరుత్థాన దినమున) షైతాన్ తాకడం వల్ల భ్రమపరచబడిన వ్యక్తి స్థితి వలె ఉంటుంది. ఇది ఎందుకంటే! వారు: "వ్యాపారం కూడా వడ్డీ లాంటిదే!" అని చెప్పడం. కాని అల్లాహ్ వ్యాపారాన్ని ధర్మ సమ్మతం (హలాల్) చేశాడు మరియు వడ్డీని నిషిద్ధం (హరామ్) చేశాడు. కనుక తన ప్రభువు చేసిన ఈ హితబోధ అందిన వ్యక్తి మున్ముందు వడ్డీ తినటం త్యజిస్తే, అతడు పూర్వం తిన్నదేదో తిన్నాడు. అతడి వ్యవహారమంతా అల్లాహ్ కే చెందుతుంది. (ఈ ఆదేశం తరువాత ఈ దుర్వ్యవహారానికి) పాల్పడేవారు నరకవాసులవుతారు. అక్కడ వారు శాశ్వతంగా ఉంటారు.275﴿

[అల్ బఖర: 264]

మరియు మహాశక్తిసంపన్నుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

﴾ఓ విశ్వాసులారా! అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి మరియు మీరు (నిజంగా) విశ్వాసులే అయితే, మీకు రావలసిన వడ్డీని విడిచి పెట్టండి.278

కాని, ఒకవేళ మీరు అలా చేయకపోతే! అల్లాహ్ మరియు ఆయన సందేశహరుని తరఫు నుండి యుద్ధ ప్రకటన ఉందని తెలుసుకోండి...279﴿

మరియు అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

﴾ఓ విశ్వాసులారా! ఇబ్బడిముబ్బడిగా పెరిగే ఈ వడ్డీని తినకండి. మరియు మీరు సాఫల్యం పొందటానికి అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి.130﴿

[ఆలె ఇమ్రాన్: 103],

అబూ హురైర రజియల్లాహు అన్హు మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ ద్వారా ఉల్లేఖిస్తున్నారు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు:

«వినాశకరమైన (అనగా నాశనం చేసే) ఏడు పాపముల నుండి దూరంగా ఉండండి». దానికి వారు, “ఓ అల్లాహ్ ప్రవక్తా! అవి ఏమిటి?” అని అడిగారు. దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: «అల్లాహ్ కు సాటి కల్పించుట; చేతబడి; అల్లాహ్ నిషిద్ధం చేసిన ప్రాణిని అన్యాయంగా చంపటం; వడ్డీ తినుట; అనాథల సొమ్ము తినుట; యుధ్ధభూమి నుండి వెనుదిరిగి పారిపోవుట; శీలవంతులు, అమాయకులు మరియు విశ్వాసులైన స్త్రీలపై అపనిందలు వేయుట» [106].

సమురా బిన్ జుందుబ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:

«నిన్న రాత్రి నేను ఇద్దరు వ్యక్తులను చూశాను. వారు నా వద్దకు వచ్చి నన్ను ఒక పవిత్రమైన భూమికి తీసుకెళ్లారు. మేము వెళ్లుతూ రక్తంతో నిండిన ఒక నదికి వచ్చాము. అందులో ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు. నది మధ్యలో మరో వ్యక్తి ఉండి, అతని చేతిలో రాళ్లు ఉన్నాయి. నదిలో ఉన్న వ్యక్తి బయటకు రావాలని ప్రయత్నించినప్పుడు, మధ్యలో ఉన్న వ్యక్తి ఒక రాయిని అతని నోటిలో విసిరాడు; అలా అతడిని మళ్లీ ఉన్న చోటికే తిరిగి పంపాడు. ప్రతిసారి అతడు బయటకు రావడానికి ప్రయత్నించినప్పుడల్లా, అతని నోటిలో రాయిని విసిరి మళ్లీ అలాగే తిరిగి పంపుతున్నాడు. నేను అడిగాను: ‘ఇది ఏమిటి?’ అప్పుడు ఆయన చెప్పారు: ‘నువ్వు నదిలో చూసిన వాడు వడ్డీ తినేవాడు» [107].

నష్టాలు:

వడ్డీతో లావాదేవీలు చేయడంలో చాలా హానులు ఉన్నాయి, వాటిలో కొన్ని:

– వడ్డీ తినేవాడు పరలోకంలో తీవ్రమైన హెచ్చరికకు మరియు బాధాకరమైన శిక్షకు గురవుతాడు. మహోన్నతుడైన అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త ﷺ అతనితో యుద్ధం ప్రకటించారు; మహోన్నతుడైన అల్లాహ్ సెలవిస్తున్నాడు:

  • అతను రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం శాపానికి గురయ్యాడు; ఎందుకంటే జాబిర్ బిన్ అబ్దుల్లాహ్ రజియల్లాహు అన్హుమ ఉల్లేఖనం:

«దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వడ్డీ తినేవారిని, తినిపించేవారిని, దానిని రాసేవాడిని, దానికి సాక్షులుగా ఉండే ఇద్దరినీ శపించి, వారందరూ సమానులే అని అన్నారు» [108]

[3] ఈ హదీసును ముస్లిం, హదీథు సంఖ్య (233) లో ఉల్లేఖించారు.

  • అతడు ప్రజల సొమ్మును దుర్మార్గంతో తినేవాడు, మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

﴾ఓ విశ్వాసులారా! మీరు ఒకరి సొమ్ము నొకరు అన్యాయంగా తినకండి, పరస్పర అంగీకారంతో చేసే వ్యాపారం వల్ల వచ్చేది (లాభం) తప్ప...﴿

[నిసా: 31]

మరియు ఇమామ్ అత్తబరీ దీని భావాన్ని ఇలా తెలిపారు:

"మీలో ఒకరు మరొకరి సొమ్మును వడ్డీ, జూదం మరియు అల్లాహ్ మీకు నిషేధించిన ఇతర విషయాల ద్వారా తినకండి, అది వ్యాపారం అయితే తప్ప" [109].

[109] తబ్రీ వ్యాఖ్యానము (6/625).

  • వడ్డీ ద్వారా సంపాదించిన ధనంలో శుభం తుడిచిపెట్టుకుపోతుంది, మహోన్నతుడైన అల్లాహ్ సెలవిచ్చాడు:

﴾అల్లాహ్ వడ్డీ (ఆదాయాన్ని) నశింపజేస్తాడు మరియు దానధర్మాలు (చేసేవారికి) వృద్ధినొసంగుతాడు. మరియు సత్యతిరస్కారుడు (కృతఘ్నుడు), పాపిష్టుడు అయిన వ్యక్తిని అల్లాహ్ ప్రేమించడు.276﴿

సాదీ రహిమహుల్లాహ్ ఇలా తెలిపారు:

﴾అల్లాహ్ వడ్డీ (ఆదాయాన్ని) నశింపజేస్తాడు﴿ అనగా: ఆయన దానిని మరియు దానిలోని దీవెనలను తొలగిస్తాడు, ఫలితంగా అది విపత్తులకు గురవడానికి మరియు దాని నుండి దీవెనలు తొలగించబడటానికి ఒక కారణంగా మారుతుంది. ఒకవేళ దాని నుండి ఖర్చు చేసినా, అతనికి దానిపై ప్రతిఫలం లభించదు, అంతేకాక, అది అతడిని నరకానికి చేర్చే సాధనంగా మారుతుంది [110].

[11] తఫ్సీర్ అస్-సాదీ (పేజి: 324).

ఇబ్నె మస్ఊద్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు:

“ఎవరైతే రిబా (వడ్డీ) ద్వారా ఎక్కువగా సంపాదిస్తాడో, అతని వ్యవహారం యొక్క పర్యవసానం తగ్గుదలే అవుతుంది.” [111].

[74] ఈ హదీసును ఇబ్నె మాజహ్, హదీథు సంఖ్య (4019) లో ఉల్లేఖించారు.

  • వడ్డీ హృదయాలలో ద్వేషాలను నాటుతుంది, దయ మరియు కరుణను దూరం చేస్తుంది, అందువలన సోదరభావం అంతం అవుతుంది, సమాజ నిర్మాణం చెదిరిపోతుంది.
  • వడ్డీ ఒక సామాజిక నేరం, అది ఏ సమాజంలోనైనా వ్యాపిస్తే, ఆ సమాజాన్ని నాశనం చేసి దాని పునాదులను కూల్చివేస్తుంది.

రక్షణ:

వడ్డీ లావాదేవీల నుండి నివారణ మార్గాలు:

  • విశ్వాసమును బలపరచడం, మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

﴾ఓ విశ్వాసులారా! ఇబ్బడిముబ్బడిగా పెరిగే ఈ వడ్డీని తినకండి...﴿

మరియు దీనిని బట్టి తెలిసేదేమిటంటే, ఆ ఆదేశాన్ని పాటించడానికి మరియు ఆ నిషేధాన్ని విడనాడటానికి విశ్వాసమే ప్రేరేపించే మరియు తప్పనిసరి చేసే కారణం; ఎందుకంటే విశ్వాసం అనేది అవయవాల ఆచరణలను ఆవశ్యకపరిచే, విశ్వసించవలసిన వాటి యొక్క సంపూర్ణ దృవీకరణ [112].

[112]చూడండి తఫ్సీర్ అస్సఅదీ (పేజీ 148).

  • తఖ్వాను సాధించడం: మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
  • అల్లాహ్ కారుణ్యం పొందేందుకు ఆకాంక్షించడం, వడ్డీని నిషేధించిన తరువాత అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

﴾మరియు మీరు కరుణింపబడటానికి అల్లాహ్ కు మరియు సందేశహరునికి విధేయులై ఉండండి.132﴿

  • మరణాన్ని, మరియు ప్రళయదినాన సంభవించే భయానక పరిస్థితులను గుర్తుచేసుకోవడం, వడ్డీ ఆయతుల తరువాత అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

﴾మరియు మీరు తిరిగి అల్లాహ్ సమక్షానికి చేరుకోబోయే ఆ దినానికి భయపడండి. అప్పుడు ప్రతి వ్యక్తికి తన కర్మల ప్రతిఫలం ఇవ్వబడుతుంది. వారి కెలాంటి అన్యాయం జరుగదు.281﴿

  • నరకాగ్ని భయం, వడ్డీని నిషేధించిన తర్వాత సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు :

﴾మరియు సత్యతిరస్కారుల కొరకు సిద్ధం చేయబడిన నరకాగ్నికి భీతిపరులై ఉండండి.131﴿

  • షరియా నియమాలను, వాటిలో అమ్మకాల నియమాలు మరియు వడ్డీ నియమాలను నేర్చుకోవాలని, ఉమర్ బిన్ ఖత్తాబ్ రజియల్లాహు అన్హు చెప్పారు:

"ధర్మంలో అవగాహన ఉన్న వ్యక్తి తప్ప మరెవరూ మన మార్కెట్లలో అమ్మకాలు చేయకూడదు" [113].

[28] ఈ హదీసును తిర్మిథీ, హదీథు సంఖ్య (2140) లో ఉల్లేఖించారు.

ఇంకో పదాలలో:

"లేనిచో, ఇష్టమున్నా లేకపోయినా వడ్డీ సొమ్ము తిన్నట్లేV [114].

[114] ఇమామ్ అస్బహానీ గారి అత్-తర్గీబ్ వత్-తర్హీబ్ (810).

  • జీవనోపాధి మరియు దాని మార్గాలలో హరామ్ ను విడిచి హలాల్ తో సరిపెట్టుకోవడం, మరియు సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ను దుఆ చేయడం. దానికి ఉదాహరణగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నుండి హదీసులో వచ్చిన విషయం:

«ఓ అల్లాహ్! నీవు హలాల్ (ధర్మసమ్మతం) చేసిన వాటి ద్వారా నీవు హరాం చేసిన వాటి నుండి నన్ను విముక్తి కలిగించు, నీ కరుణా కటాక్షాల ద్వారా నీవు తప్ప అందరి నుండి నన్ను నిరుపేక్షాపరున్ని చేయుము» [94].