Skip to content

పెద్ద పాపము మరియు చిన్న పాపము యొక్క నిర్వచనం:

نص الموضوع

పెద్ద పాపము(కబీరా): అనేది: అల్లాహ్ గ్రంథం లేదా దైవప్రవక్త ﷺ సున్నహ్‌లో స్పష్టంగా హెచ్చరిక (వయీద్), శాపం (లఆనత్) లేదా హద్దు శిక్షతో అనుసంధానించబడిన ప్రతి పాపం. లేదా దాని దుష్పరిణామం హెచ్చరిక, హద్దు శిక్ష లేదా శాపంతో అనుసంధానించబడిన పాపం దుష్పరిణామంతో సమానమని తెలిసినది, లేదా దానికన్నా ఎక్కువ దుష్పరిణామం కలిగినది, లేదా దాన్ని చేయువాడు తన ధర్మం పట్ల నిర్లక్ష్యాన్ని చూపినట్లు సూచించేదీ — ఇవన్నీ కబీరా పాపాలే.

అందువల్ల, చిన్న పాపము (సఘీర) అంటే: పైన పేర్కొనబడిన ఘోరమైన పాపము యొక్క నిర్వచనంలోకి రాని ప్రతి పాపము. దానికి శిక్షను గురించిన హెచ్చరిక, నిర్ధారిత శిక్ష, లేదా శాపము వంటివి ఉండవు, మరియు దానిని ఆచరించువాడు ధర్మశాస్త్ర (షరీఆత్) ఆదేశములను తేలికగా తీసుకుంటున్నట్లుగా అది సూచించదు.

పెద్ద పాపము మరియు చిన్న పాపము మధ్య వ్యత్యాసం:

  1. పెద్ద పాపముతో హెచ్చరిక లేదా నిర్ణీత శిక్ష లేదా శాపం వంటివి ముడిపడి ఉంటాయి, చిన్న పాపముతో అలాంటివి ఏవీ ముడిపడి ఉండవు.
  2. (కబీరా) పెద్ద పాపం దానిని చేసినవాడు షరీఅత్ (ధర్మ) ఆదేశాల పట్ల నిర్లక్ష్యాన్ని చూపుతున్నాడని సూచిస్తుంది; కాగా (సఘీరా) చిన్న పాపం అలా కాదు.
  3. పెద్ద పాపాలను చేసినవారికి అవి క్షమించబడేందుకు తప్పనిసరిగా తౌబా అవసరం. అయితే చిన్న పాపాలు తౌబా ద్వారా, లేదా పెద్ద పాపాలను దూరంగా ఉంచడం ద్వారా, లేదా మనిషిని బాధించే కష్టాలు–పరీక్షల ద్వారా, లేదా సత్కార్యాల ద్వారా పరిహరించబడతాయి.

మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

﴾ఒకవేళ మీకు నిషేధించబడి నటువంటి మహాపాపాలకు మీరు దూరంగా ఉంటే, మేము మీ చిన్నచిన్న దోషాలను మన్నించి, మిమ్మల్ని గౌరవస్థానాల్లోకి ప్రవేశింపజేస్తాము.31﴿

[నిసా: 31]

మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

﴾మరియు దినపు చివరి రెండు భాగాల్లోనూ మరియు రాత్రిపూట కొంత భాగంలో కూడా నమాజ్ నెలకొల్పండి. నిశ్చయంగా, సత్కార్యాలు దుష్కార్యాలను దూరం చేస్తాయి. జ్ఞాపకం ఉంచుకునే వారికి ఇది ఒక ఉపదేశం (జ్ఞాపిక).114﴿

[హూద్: 114]

ఆయిషా రదియల్లాహు అన్హా ఉల్లేఖన, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు:

«ముస్లింకు ఏ ఆపద సంభవించినా, చివరికి ముల్లు గుచ్చుకున్నా, దాని ద్వారా అల్లాహ్ అతని పాపాలను క్షమిస్తాడు» [2].

[1] దీనిని బుఖారీ హదీథు సంఖ్య (2766); ముస్లిం హదీథు సంఖ్య (89) లో ఉల్లేఖించారు.

అబూ హురైరహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖనం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చేవారు:

«ఘోరపాపాలకు పాల్పడకుండా ఉంటే, ఐదు పూటల నమాజులు, ఒక జుమా నుండి మరో జుమా వరకు, ఒక రమదాన్ నుండి మరో రమదాన్ వరకు, వాటి మధ్య జరిగే (చిన్న) పాపాలకు పరిహారాలు.» [3].

[3] ఈ హదీసును ముస్లిం, హదీథు సంఖ్య (233) లో ఉల్లేఖించారు.

పెద్ద పాపాల యొక్క ధార్మిక, ఇహలోక ప్రమాదాలు మరియు నష్టాలు:

మహాపాపాలకు పాల్పడటం ఇహపరాల్లో అనేక ప్రమాదాలకు మరియు నష్టాలకు దారితీస్తుంది, వాటిలో:

  • ఘోరమైన పాపాలకు (అల్ కబాయిర్) పాల్పడిన వ్యక్తి స్వర్గంలో ప్రవేశించలేడని హెచ్చరించబడ్డాడు; జుబైర్ బిన్ ముత్’ఇం రదియల్లాహు అన్హు ఉల్లేఖనం, ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిస్తుండగా విన్నారు:

“బందుత్వాలను తెగత్రెంపులు చేసుకునేవాడు స్వర్గంలో ముమ్మాటికి ప్రవేశించలేడు”[4].

అంటే: రక్తసంబంధాలను తెగత్రెంపు చేసుకునేవాడు.

హుజైఫహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిస్తుండగా నేను విన్నాను:

“అపోహలను కల్పించేవాడు స్వర్గం లోనికి ప్రవేశించడు” [5].

అనగా చాడీలు చెప్పేవాడు అని అర్ధం

  • వాటిలో కొన్ని సమాధి శిక్షకు కారణమవుతాయి; ఇబ్నె అబ్బాస్ రదియల్లాహు అన్హుమా ఇలా సెలవిచ్చారు:

ఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రెండు సమాధుల ప్రక్క నుండి వెళ్ళడం జరిగింది. ఆయన ఇలా అన్నారు: “వీటిలో ఉన్నవారు శిక్షించబడుచున్నారు, కానీ పెద్ద పాపము చేసినందుకు కాదు. వారిలో ఒకడు తనను మూత్రబిందువుల నుండి కాపాడుకునేవాడు కాదు, మరొకడు చాడీలు చెప్పేవాడు”[6].

  • అది పరలోకంలో కఠిన శిక్షకు గల కారణాలలో ఒకటి; ఆయిషా రదియల్లాహు అన్హా ఉల్లేఖనం: “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:

‘పరలోక దినాన ప్రజల్లో అత్యంత కఠినంగా శిక్షించబడేవాడు’ అల్లాహ్ సృష్టించిన ప్రకారంగా సృష్టించ దలిచినవాడు’[7].

యుదాహూన్ : సామ్యపరుస్తారు, అంటే దాని అర్ధం: రూపకల్పన చేసేవారు.

  • ఇది అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త తరఫున శాపానికి కారణమవుతుంది. ఎందుకంటే ఇబ్నె అబ్బాస్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖనం:

స్త్రీలను అనుకరించే పురుషుల్ని, పురుషుల్ని అనుకరించే స్త్రీలను దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం శపించారు[8].

[8] ఈ హదీసును బుఖారీ ఉల్లేఖించారు, హదీథు సంఖ్య (5885)

మరియు అబ్దుల్లాహ్ ఇబ్నె మస్’ఊద్ రదియల్లాహు అన్హు ఉల్లేఖనం:

వడ్డీ తినేవారిని, తినిపించేవారిని దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం శపించారు. [9]

  • అది ఆచరణలు నశించిపోవడానికి మరియు అవి వ్యర్థమవడానికి గల కారణాలలో ఒకటి; బురైదహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖనం, నిశ్చయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు:

“ఎవరైతే అసర్ నమాజు ను వదిలేస్తారో అతని సత్కార్యాలు వ్యర్ధమవుతాయి.” [10]

  • ఆ పాపానికి హద్దు (శిక్ష) ఉంటే, దానికి పాల్పడిన వారిపై ధర్మబద్ధమైన హద్దులు విధించబడతాయి, మహోన్నతుడై అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

﴾మరియు పురుషుడు దొంగ అయినా, లేదా స్త్రీ దొంగ అయినా, వారి చేతులను నరికి వేయండి. ఇది వారి కర్మలకు గుణపాఠంగా అల్లాహ్ నిర్ణయించిన ప్రతిఫలం (శిక్ష). మరియు అల్లాహ్ సర్వ శక్తిమంతుడు, మహా వివేచనాపరుడు.38﴿

[అల్ మాయిదా: 38]

మరియు మహాశక్తిసంపన్నుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

﴾వ్యభిచారిణి మరియు వ్యభిచారుడు, ఈ ఇద్దరిలో ప్రతి ఒక్కరికి నూరేసి కొరడా దెబ్బలు కొట్టండి...﴿

[అన్-నూర్: 2]

మరియు అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

﴾మరియు ఎవరైనా శీలవతులైన స్త్రీలపై అపనింద మోపిన తరువాత నలుగురు సాక్షులను తీసుకొని రాలేరో, వారికి ఎనభై కొరడా దెబ్బలు కొట్టండి మరియు వారి సాక్ష్యాన్ని ఎన్నటికీ స్వీకరించకండి. అలాంటి వారు పరమ దుష్టులు (ఫాసిఖూన్).﴿

  • ఇది అనుగ్రహాలు తొలగిపోవడానికి, మారిపోవడానికి కారణం. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

﴾ఇది ఎందుకంటే! వాస్తవానికి, ఒక జాతి వారు, తమ నడవడికను తాము మార్చుకోనంత వరకు, అల్లాహ్ వారికి ప్రసాదించిన తన అనుగ్రహాన్ని ఉపసంహరించుకోడు...﴿

[అన్ఫాల్: 53]

షైఖ్ స'అదీ' రహిమహుల్లాహ్ చెప్పారు:

﴾ఇది﴿ ఈ శిక్ష ఏదైతే అల్లాహ్ తిరస్కరించే జాతులపై విధించి, వారు ఉన్న అనుగ్రహాలను మరియు సౌభాగ్యాలను వారి నుండి తొలగించాడో, అది వారి పాపాల వలన మరియు వారు తమ స్వయాన్ని మార్చుకోవటం వలన. ఎందుకంటే నిశ్చయంగా అల్లాహ్ ఒక జాతి వారికి తాను ప్రసాదించిన ధార్మిక మరియు ప్రాపంచిక అనుగ్రహాన్ని, ﴿వారు తమ నడవడికను తాము మార్చుకోనంత వరకు﴾ మార్చడు. దానికి బదులుగా, వారు ఆయన పట్ల కృతజ్ఞతలో వృద్ధి చెందితే, ఆయన దానిని మిగిల్చి ఉంచి, వారికి దానిని అధికం చేస్తాడు. వారు విధేయత నుండి అవిధేయత వైపునకు మారి, అల్లాహ్ అనుగ్రహం పట్ల కృతఘ్నత చూపి, దానిని తిరస్కారంగా మార్చుకున్నప్పుడు, ఆయన దానిని వారి నుండి లాక్కుంటాడు మరియు వారు తమ స్వయాన్ని మార్చుకున్న విధంగానే దానిని వారికి వ్యతిరేకంగా మార్చివేస్తాడు. మరియు ఇందులో అల్లాహ్ కొరకు వివేకం, న్యాయం మరియు తన దాసుల పట్ల మేలు ఉన్నది, ఎందుకంటే ఆయన వారి దుర్మార్గం వలన తప్ప వారిని శిక్షించలేదు.

[11] తఫ్సీర్ అస్-సాదీ (పేజి: 324).

  • అవి భూమిపై అల్సకల్లోలాలు వ్యాపించడానికి కారణమవుతాయి; ఎందుకంటే పాపాల కారణంగానే అల్లకల్లోలాలు వెలుగులోకి వస్తాయి. మరి వాటిలో మహాపాపాలైతే మరింత స్పష్టంగా అల్లకల్లోలాలు ప్రబలుతాయి. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

﴾మానవులు తమ చేజేతులా సంపాదించుకున్న దాని ఫలితంగా భూమిలో మరియు సముద్రంలో కల్లోలం వ్యాపించింది. ఇది వారిలో కొందరు చేసిన దుష్కర్మల ఫలితాన్ని రుచి చూపటానికి, బహుశా ఇలాగైనా వారు (అల్లాహ్ వైపునకు) మరలుతారేమోనని!41﴿

[అర్రూమ్: 41]

  • అవి జ్ఞానమును కోల్పోవడానికి ఒక కారణము, ఎందుకంటే జ్ఞానము హృదయంలో అల్లాహ్ ప్రసాదించే ఒక కాంతి, మరియు పాపము ఆ కాంతిని ఆర్పివేస్తుంది.

ఇమామ్ షాఫియీ ఇమామ్ మాలిక్ ఎదుట కూర్చొని ఆయనకు చదివి వినిపించినప్పుడు, ఆయనలో కనిపించిన అపారమైన తెలివి, ప్రకాశించే మేధస్సు, సంపూర్ణమైన అవగాహనను చూసి ఇమామ్ మాలిక్‌కు అది ఎంతో నచ్చింది. అప్పుడు ఆయన ఇలా అన్నారు:

నిశ్చయంగా అల్లాహ్ నీ హృదయంలో ఒక వెలుగును ప్రసాదించాడు, కావున దానిని పాపం అనే చీకటితో ఆర్పవద్దు." [12]

[12] చూడండి: మనాఖిబుష్-షాఫియీ-రచన అల్-బైహఖీ (1/ 104).

పాపాలకు పాల్పడటం అనేది, ఆ వ్యక్తి యొక్క వ్యవహారాలు కష్టతరం కావడానికి గల కారణాలలో ఒకటి, తద్వారా అతను ఏ పని వైపుకు వెళ్ళినా, అది తన ముందు మూసుకుపోయినట్లుగా లేదా కష్టతరంగా ఉన్నట్లుగా పొందుతాడు. ఇది ఎలాగంటే, ఎవరైతే అల్లాహ్‌కు భయపడతాడో, అల్లాహ్ అతని వ్యవహారాన్ని సులభతరం చేస్తాడు. కాబట్టి ఎవరైతే దైవభీతిని విస్మరించి ఘోర పాపాలకు పాల్పడతాడో, అల్లాహ్ అతని వ్యవహారాన్ని కష్టతరం చేస్తాడు. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

﴾యూదులకు వారు చేసిన ఘోర దుర్మార్గాలకు ఫలితంగానూ మరియు వారు, అనేకులను అల్లాహ్ మార్గంపై నడువకుండా ఆటంక పరుస్తూ ఉన్నందు వలననూ, మేము ధర్మసమ్మతమైన అనేక పరిశుద్ధ వస్తువులను వారికి నిషేధించాము; 160

మరియు వాస్తవానికి, వారికి నిషేధింపబడినా; వారు వడ్డీ తీసుకోవటం వలననూ మరియు వారు అధర్మంగా ఇతరుల సొమ్మును తినటం వలననూ, మరియు వారిలో అవిశ్వాసులైన వారి కొరకు మేము బాధాకరమైన శిక్షను సిద్ధ పరచి ఉంచాము.161﴿

  • అవి వాటిని చేసేవాని హృదయంలో చీకటికి కారణమవుతాయి, రాత్రి చీకటిని అనుభూతి చెందినట్లే అతను వాటిని అనుభూతి చెందుతాడు. తద్వారా పాపము యొక్క చీకటి అతని హృదయానికి, అతని దృష్టికి ఇంద్రియగోచరమైన చీకటి వలె అవుతుంది. నిశ్చయంగా విధేయత కాంతి, మరియు పాపము చీకటి. ఆ చీకటి ఎంత బలపడితే, అతని సంక్షోభము అంతగా పెరుగుతుంది, చివరికి అతనికి తెలియకుండానే అతను బిద్అత్ (ధర్మంలో నూతన కల్పనలు), మార్గభ్రష్టత్వాలు మరియు వినాశకరమైన విషయాలలో పడిపోతాడు. హుదైఫహ్ (రదియల్లాహు అన్హు) ఇలా ఉల్లేఖిస్తున్నారు: “మేము ఉమర్ (రదియల్లాహు అన్హు) వద్ద కూర్చుని ఉన్నాము. ఆయన ఇలా అన్నారు: మీలో ఎవరు రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) (హఠాత్తుగా వచ్చిపడే) విపత్తు, ఆపద (అల్’ఫిత్నా) గురించి ప్రస్తావించడం విన్నారు? కొంతమంది “మేము విన్నాము” అన్నారు. దానికి ఆయన ఇలా అన్నారు: “బహుశా మీరు ఒక వ్యక్తికి తన కుటుంబములోని సమస్యలు, మరియు అతని పొరుగువారితో సమస్యలు గురించి అనుకుంటున్నారు, అవునా?” వారు “అవును” అన్నారు. అప్పుడు ఆయన ఇలా అన్నారు: “అవి నమాజు, ఉపవాసం మరియు దానధర్మాల ద్వారా ప్రాయశ్చిత్తం చేయబడతాయి. కానీ మీలో ఎవరు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సముద్రపు అలల వలె ఎగసిపడే ‘అల్-ఫిత్నా’ గురించి ప్రస్తావించగా విన్నారు?”. హుదైఫహ్ రదియల్లాహు అన్హు ఇలా అన్నారు: “అక్కడున్న ప్రజలు మౌనంగా ఉండిపోయారు”. ఆయన ఇంకా ఇలా అన్నారు “నేను విన్నాను”. ఉమర్ రదియల్లాహు అన్హు “మీ తండ్రి నీ కొరకు త్యాగం చేయబడుగాక (మీ తండ్రి గొప్ప ధర్మపరుడు)”. హుదైఫహ్ రదియల్లాహు అన్హు ఇలా అన్నారు: “రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా పలుకగా నేను విన్నాను:

“రెల్లు చాపను రెల్లు పుల్లలతో ఒకదాని తరువాత ఒకటి కలిపి నేసినట్లుగా, “అల్-ఫితన్” (ఆకర్షణలు, ప్రలోభాలు, వాంఛలు, కోరికలు, సంకటములు, పరీక్షలు మొ.) మనుషుల హృదయాలకు ప్రస్తుతపరచబడతాయి. ఏ హృదయమైతే వాటితో నిండిపోతుందో దానిపై ఒక నల్లటి మచ్చ వేయబడుతుంది. మరియు ఏ హృదయమైతే వాటిని తిరస్కరిస్తుందో దానిపై ఒక తెల్లని మచ్చ వేయబడుతుంది; అలా హృదయాలు రెండు రకాలుగా తయారవుతాయి. ఒకటి శ్వేత వర్ణములో, దానిపై ఏది పడినా దానికి అంటకుండా జారిపోయేటంతటి అతి నున్నటి ఉపరితలం కలిగిన రాయిలాగా, ఆకాశాలూ మరియు భూమి మిగిలి ఉన్నంత కాలం ఏ ప్రలోభాలూ, ఆకర్షణలూ తాకకుండా ఉంటుంది. మరియు మరొకటి నలుపు మరియు ధూళి రంగులో బోర్లించి ఉన్న పాత్రలాగా, మంచిని గుర్తించకుండా లేదా చెడును, కీడును తిరస్కరించకుండా, తాను నింపుకున్న వాంఛలు, మోహము, కోరికలతో నిండి ఉంటుంది.” [13].

[13] సహీహ్ ముస్లిం, హదీథు సంఖ్య (144).

  • అవి ద్వేషము, శత్రుత్వము మరియు శత్రువు ఆధిపత్యానికి ఒక కారణం, మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

﴾మేము క్రైస్తవులము." అని అనే వారి నుంచి కూడా మేము దృఢమైన ప్రమాణం తీసుకున్నాము; కాని వారు తమకు ఇవ్వబడిన బోధనలలో అధిక భాగాన్ని మరచి పోయారు; కావున తీర్పుదినం వరకు వారి మధ్య విరోధాన్ని మరియు ద్వేషాన్ని కల్గించాము. మరియు త్వరలోనే అల్లాహ్ వారు చేస్తూ వచ్చిన కర్మలను గురించి వారికి తెలియజేస్తాడు. 14﴿

ఎప్పుడైతే ప్రజలు అల్లాహ్ ఆజ్ఞాపించిన వాటిలో కొన్నింటిని వదిలివేసి, ఆయన నిషేధించిన వాటికి పాల్పడతారో, అప్పుడు వారి మధ్య శతృత్వము మరియు ద్వేషము ఏర్పడుతుంది మరియు వారిపై శతృవులు ఆధిక్యతను పొందుతారు [14].

[14] చూడండి: మజ్మూఉల్ ఫతావా (3/421).

  • సమాజం భ్రష్టుపడటానికి కూడా ఇవి కారణమవుతాయి. ఎందుకంటే వీటివల్ల అబద్ధం, అపవాదం, పరనింద, చాడీలు చెప్పడం, మోసం, వంచన, అహంకారం, గర్వం, అన్యాయంగా ఒకరి ధనాన్ని మరొకరు తినడం వంటి నీచమైన నైతిక లోపాలు వ్యాపిస్తాయి. జీవన వ్యవస్థ చెడిపోతుంది, మంత్రవిద్య వంటి వాటి ద్వారా ప్రజల మధ్య హానీ విస్తరిస్తుంది. అలాగే వ్యభిచారం, సమలైంగికత్వం, స్త్రీల వేషధారణను పురుషులు అవలంబించడం, పురుషుల వేషధారణను స్త్రీలు అవలంబించడం వంటి అశ్లీల చర్యలు కూడా విస్తరిస్తాయి.[15]

[15] చూడండి: ఇబ్నుల్ ఖయ్యిం గారి అద్దాఉ వద్దవాఉ, (1/132).

మహాపాపం చేసినవారి పట్ల అహ్లుస్సున్నత్ వల్‌జమాఅత్ వైఖరి మరియు వాగ్దానం–హెచ్చరికలకు సంబంధించిన హదీస్‌లు:

అహ్లుస్సున్నహ్ వల్‌జమాఅహ్ అభిప్రాయం ప్రకారం, షిర్క్ మరియు మహాకుఫ్ర్‌కు తక్కువగా ఉండే మహాపాపాన్ని చేసిన వ్యక్తి పూర్తి విశ్వాసం కలిగినవాడు కాదు. అలాగే విశ్వాసం లేనివాడిగా కూడా పరిగణించబడడు. అతడు చేసిన పాప పరిమాణానికి అనుగుణంగా అతని విశ్వాసం తగ్గిపోతుంది. కాబట్టి అతనికి పూర్తిగా విశ్వాసం పేరు తీసివేయబడదు, అలాగే సంపూర్ణంగా విశ్వాసం ఉందని కూడా చెప్పబడదు. అతడు విశ్వాసం ఉన్నవాడే కాని, విశ్వాసం లోపించినవాడు, లేదా తన విశ్వాసం కారణంగా ముమిన్, తన పెద్దపాపం కారణంగా ఫాసిక్ అని చెప్పబడతాడు.

పరలోకంలో అతని తీర్పు అల్లాహ్ ఇచ్చకు లోబడి ఉంటుంది. ఆయన కోరుకుంటే, అతడిని క్షమించి, ఎటువంటి ముందస్తు శిక్ష లేకుండా స్వర్గంలోకి ప్రవేశింపజేస్తాడు. లేదా ఆయన కోరుకుంటే, అతని నేరానికి తగినంత శిక్షించి, ఆ తర్వాత అతడిని (నరకం నుండి) బయటకు తీసి విశ్వాసులతో పాటు స్వర్గంలోకి ప్రవేశింపజేస్తాడు. మరియు అతను పరలోకానికి ముందే ఈ లోకంలోనే తన మహాపాపాల నుండి శుద్ధి పొందవచ్చు. అది నిష్కల్మషమైన పశ్చాత్తాపం (తౌబతున్ నసూహా) ద్వారా, లేదా అతనిపై ఇస్లామీయ శిక్షను అమలు చేయడం ద్వారా, లేదా కష్టనష్టాల ద్వారా, లేదా సత్కార్యాలు అధికంగా చేయడం ద్వారా కావచ్చు. తద్వారా అతను పునరుత్థాన దినమున వచ్చినప్పుడు, అతనిపై ఎటువంటి శిక్ష ఉండదు.

ఇక మహాపాపులకు హెచ్చరికగా వచ్చిన హదీసుల విషయానికొస్తే, ఉదాహరణకు అబూ హురైర రజియల్లాహు అన్హు ఉల్లేఖనం, దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు:

ఒక వ్యభిచారి వ్యభిచరించేటప్పుడు విశ్వాసి కాజాలడు,మద్యపానసేవకుడు మద్యం త్రాగేటప్పుడు విశ్వాసిగా ఉండడు,దొంగ దొంగిలించేటప్పుడు విశ్వాస స్థితిలో ఉండడు[16].

దీని భావమేమిటంటే, అతని నుండి పరిపూర్ణ విశ్వాసం తొలగిపోయి, ఇస్లాం మాత్రమే మిగిలి ఉంటుంది. అతడు ఆ పాపాన్ని విడిచిపెట్టి, దాని నుండి పశ్చాత్తాపపడినప్పుడు, అతని విశ్వాసం తిరిగి వస్తుంది. కాబట్టి, అతడు ఈ పెద్ద పాపాలకు పాల్పడినప్పుడు మాత్రమే అతని నుండి పరిపూర్ణ విశ్వాసం తొలగించబడుతుంది, కానీ అతనిలో విశ్వాసం యొక్క మూలం మిగిలి ఉంటుంది;

ఎందుకంటే, అల్లాహ్‌కు దేనినీ సాటి కల్పించకుండా మరణించిన వ్యక్తి, అతను వ్యభిచరించినా, దొంగతనం చేసినా సరే, స్వర్గంలో ప్రవేశిస్తాడని వాగ్దానం చేసే ఇతర హదీసులు కూడా ఉన్నాయి. ఉదాహరణకు అబూ జర్ర్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం, ఆయన ఇలా అన్నారు: దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు:

«నా ప్రభువు తరఫు నుండి ఒకరు నా వద్దకు వచ్చి, నాకు ఈ శుభవార్త వినిపించారు: 'నా సమాజం నుండి ఎవరైతే అల్లాహ్ కు దేనినీ సాటి కల్పించకుండా మరణిస్తాడో, అతను స్వర్గంలో ప్రవేశిస్తాడు'». నేను, 'అతను వ్యభిచారం చేసినా, దొంగతనం చేసినా కూడానా?' అని అడిగాను. దానికి ఆయన, «అవును, అతను వ్యభిచారం చేసినా, దొంగతనం చేసినా సరే» అని అన్నారు [17].

మహాపాపాలను ఎదుర్కొనే విధానం మరియు వాటి చికిత్స:

  • అవిధేయత, ముఖ్యంగా ఘోర పాపాల ఆధిక్యత, పూర్తి సమాజంపై శిక్షలు మరియు విపత్తులు రావడానికి కారణమవుతుందనే విషయం గురించి సమాజంలో అవగాహన కల్పించడం, అందుకు అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

﴾మరియు మీలోని దుర్మార్గులకు మాత్రమే గాక (అందరికీ) సంభవించబోయే ఆ విపత్తు గురించి భీతిపరులై ఉండండి. మరియు అల్లాహ్ శిక్ష విధించటంలో చాలా కఠినుడని తెలుసుకోండి.25﴿

  • ధార్మిక జ్ఞానమును నేర్చుకొనుట; ఎందుకంటే దానిని నేర్చుకోవడం ఆత్మను పాపాల నుండి హెచ్చరిస్తుంది. ఏ విధంగానంటే, ఎవరైతే ఈ పాపాలపై విధించబడిన శిక్షల గురించి తెలుసుకుంటారో, అతని ఆత్మ వాటిలో పడకుండా నిరోధించబడుతుంది.
  • చెడును అడ్డుకొనే విధిని నిర్వర్తించడం; పాపాత్ములను మహా పాపాల నుండి వారించడం, వారిని గద్దించడం. నుఅమాన్ బిన్ బషీర్ రదియల్లాహు అన్హు ఉల్లేఖనం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు:

అల్లాహ్ నిర్దేశించిన హద్దులలో నిలిచి ఉండేవారి, మరియు వాటిని ఉల్లంఘించేవారి ఉపమానం, ఓడపై చీట్లు వేసుకున్న ఒక సమూహం వంటిది. దాని ఫలితంగా కొందరికి ఓడ పై అంతస్థులో, మరికొందరికి క్రింది అంతస్థులో చోటు లభించింది. క్రింది అంతస్థులోని వారు త్రాగు నీటి కొరకు పై అంతస్థుకు వెళ్ళినపుడు, అక్కడ ఉన్నవారిని దాటుకుంటూ వెళ్ళవలసి వచ్చేది. దానితో వారు ఇలా అన్నారు: “మనం ఉంటున్న భాగములోనే ఒక రంధ్రము చేస్తే, మన పైనున్న వారికి ఇబ్బంది కలిగించము కదా”. ఒకవేళ వారు కోరిన విధంగా చేయడానికి వారిని వదిలేస్తే, అందరూ నాశనమైపోతారు. ఒకవేళ వారిని ఆ పని నుండి ఆపితే, వారు రక్షింపబడతారు, మరియు వారితో పాటు అందరూ రక్షింపబడతారు [18].

ఆయన ప్రవచనం: «అల్లాహ్ యొక్క హద్దులపై నిలబడేవాడు» అనగా: సర్వశక్తిమంతుడైన అల్లాహ్ యొక్క ఆదేశాలపై స్థిరంగా ఉండేవాడు, ఆయన నిషేధించిన వాటికి దూరంగా ఉండేవాడు, మంచిని చేయమని ఆదేశించేవాడు మరియు చెడు నుండి వారించేవాడు.

«అందులో పడిపోయినవాడు» మంచిని వదిలివేసేవాడు, చెడు చేసేవాడు.

«ఇస్తహమూ» అనగా వారిలో ప్రతి ఒక్కరూ ఒక వాటాను, అంటే ఒక భాగాన్ని, పొందేందుకు చీట్లు వేశారు.

«వారి చేతులను పట్టుకున్నారు», పడవకు రంధ్రం చేయకుండా వారిని వారించారు.

  • కుటుంబం నుండి లభించే సరియైన విశ్వాస సంస్కరణ, మరియు తల్లిదండ్రులు తమ పిల్లలను, ప్రత్యేకంగా కౌమారదశలో పర్యవేక్షించడం, విశ్వాసపు రంగుతో నిండి, ఉన్నతమైన నడవడిక కలిగిన నీతిమంతులైన యువకుల తరం నిర్మాణానికి దారితీస్తుంది.
  • పాపాలకు ధర్మసమ్మతమైన ప్రత్యామ్నాయాన్ని కల్పించడం, ఎందుకంటే మహోన్నతుడైన అల్లాహ్ దేనినైనా నిషేధించినప్పుడు, దానికి బదులుగా తాను ధర్మసమ్మతం చేసిన వాటిలో సరిపడినంత కల్పించాడు, ఉదాహరణకు, యువకులకు త్వరగా వివాహం చేయడమే వ్యభిచారానికి నివారణ,

దొంగతనాన్ని వ్యక్తులకు ఉపాధి అవకాశాలను కల్పించడం ద్వారా నివారించవచ్చు. అలాగే గీబత్ చేయడం, ప్రజల గౌరవంపై దాడి చేయడం వంటి వాటిని ఖాళీ సమయాన్ని విధేయతతో గడపడం ద్వారా లేదా అల్లాహ్ అనుమతించిన హలాల్ కార్యాలలో నిమగ్నం కావడం ద్వారా నివారించవచ్చు. ఇదే విధంగా ప్రతి పాపం లేదా ప్రతి మహాపాపం విషయంలో కూడా పరిష్కారం ఉంటుంది.

  • యువత యొక్క శక్తులను వినియోగించుకొని, వాటిని ఉమ్మత్ కు ధార్మిక మరియు ప్రాపంచిక విషయాలలో ప్రయోజనం చేకూర్చే కార్యాల వైపు మళ్ళించాలి; అవి ధార్మిక జ్ఞానాన్ని నేర్చుకోవడం, ఇస్లామీయ ప్రచారాన్ని వ్యాప్తి చేయడం, ప్రాపంచిక విషయాలలో ఉపయోగపడే వైద్యం, ఇంజనీరింగ్, వాణిజ్యం వంటి సిద్ధాంత మరియు అనువర్తిత శాస్త్రాలను నేర్చుకోవడం, అలాగే వడ్రంగం, కమ్మరం వంటి ఉపయోగకరమైన పరిశ్రమలు మరియు చేతివృత్తులను నేర్చుకోవడం. ఎందుకంటే, మనస్సు విధేయతతో నిమగ్నం కాకపోతే, అది పాపంలో నిమగ్నమవుతుంది.
  • ముస్లిం తన విశ్వాసమును నిరంతరం పరిరక్షించుకోవాలి. ఎందుకంటే వస్త్రము క్షీణించినట్లుగా విశ్వాసం కూడా హృదయంలో క్షీణిస్తుంది, కావున హృదయంలో విశ్వాసమును అధికం చేసే విధేయత కార్యాలను అధికంగా చేయడం ద్వారా దానిని పరిరక్షించుకోవాలి.
  • ఒక ముస్లిం పాపానికి దారితీసే ప్రతి విషయం నుండి దూరంగా ఉండాలి, ముఖ్యంగా సామాజిక మాధ్యమాలు మరియు వెబ్‌సైట్‌లు అశ్లీలత, నాస్తికత్వం మరియు అల్లాహ్‌కు కోపం తెప్పించే ప్రతి విషయాన్ని వ్యాప్తి చేస్తున్న ఈ కాలంలో. కాబట్టి ఒక ముస్లిం తనపై తాను చెడు యొక్క ఏ ద్వారాన్ని తెరుచుకోకూడదు, ఎందుకంటే దానిని తెరిచినవాడు దానిలో ప్రవేశిస్తాడు. నవ్వాస్ బిన్ సమ్ఆన్ రదియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం, దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు:

«అల్లాహ్ ఒక ఉపమానాన్ని ఇలా ఇచ్చినాడు: ఒక రాచమార్గము, ఆ రాచమార్గానికి ఇరువైపులా రెండు గోడలు, ఆ గోడలలో పరదాలు వేయబడి ఉన్న అనేక తెరిచి ఉన్న ద్వారాలు ఉన్నాయి. ఆ రాచమార్గపు ప్రవేశ ద్వారం వద్ద ఒక దాయీ (పిలిచేవాడు) ఇలా పిలుస్తూ ఉంటాడు: ‘ఓ ప్రజలారా! మీరందరూ ఈ రాచమార్గములోనికి ప్రవేశించండి, వంకరగా పోకండి.’ మరియు ఆ మార్గం పై నుండి పిలిచే మరొక దాయీ ఉన్నాడు. ఎవరైనా ఆ ద్వారాలలో దేనినైనా తెరవాలని ప్రయత్నిస్తే, అతను ఇలా అంటాడు: ‘నీ పాడుగాను! దానిని తెరువకు. ఎందుకంటే, నీవు దానిని తెరిస్తే, దానిలో ప్రవేశిస్తావు (అనగా: దానిలోనికి వెళ్ళిపోతావు).’ ఆ రాచమార్గము: ఇస్లాం; ఆ రెండు గోడలు: అల్లాహ్ విధించిన హద్దులు; ఆ తెరిచి ఉన్న ద్వారాలు: అల్లాహ్ నిషేధాలు; ఆ రాచమార్గపు ప్రవేశ ద్వారం వద్ద ఉన్న దాయీ: అల్లాహ్ యొక్క దివ్య గ్రంథము; మరియు మార్గం పై నుండి పిలిచే దాయీ: ప్రతి ముస్లిం హృదయములో ఉండే అల్లాహ్ యొక్క ఉపదేశకుడు» [19].

[19] ఈ హదీసును అహ్మద్ హదీథు సంఖ్య (17634) లో ఉల్లేఖించారు.

  • ముస్లింలపై అధికార బాధ్యత ఉన్న పాలకులు మరియు అధికారులందరూ ధర్మాన్ని పరిరక్షించే విధిని నిర్వర్తించడం; అంటే మంచి గురించి ఆజ్ఞాపించడం, చెడు నుండి వారించటం మరియు దానిని తొలగించడం, హద్దులను అమలుపరచడం, మొదలైనవి. ఈ విషయములో మఅఖిల్ బిన్ యసార్ రదియల్లాహు అన్హు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నుండి ఉల్లేఖిస్తున్నారు:

“అల్లాహ్ అధికార పదవిలో నియమించిన ఏ దాసుడైనా సరే, తాను చనిపోయే దినమున, తన పాలితులను మోసం చేస్తున్న స్థితిలో చనిపోతే, అటువంటి వారిపై అల్లాహ్ స్వర్గాన్ని నిషేధించినాడు” [20].

[20] ఈ హదీసును బుఖారీ (7150) మరియు ముస్లిం (142) ఉల్లేఖించారు. మరియు పదాలు ముస్లింవి.

మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు:

“మీలో ఎవరైనా చెడును చూసినట్లయితే, దానిని అతడు చేతితో ఆపాలి, ఒకవేళ అలా చేయగలిగే సమర్థత లేనట్లయితే, దానిని అతడు నోటితో ఆపాలి, ఒకవేళ అలా ఆపగలిగే సమర్థత కూడా లేనట్లైయితే దానిని అతడు తన మనసుతో ఆపని చేయాలి; అది విశ్వాసము యొక్క అత్యంత బలహీన స్థాయి.” [21]

ఈ స్థాయి బలం,అధికారము లేదా పాలనా బాధ్యత ఉన్నవారికి మాత్రమే వర్తిస్తుంది.

చివరగా, మహోన్నతుడైన అల్లాహ్ ను ఆయన మన హృదయాలను మరియు అవయవాలను ఆయన విధేయతపై స్థిరంగా ఉంచాలని, బహిరంగమైనవైనా, గోప్యమైనవైనా, చిన్నవైనా, పెద్దవైనా అన్ని పాపాల నుండి మనలను రక్షించాలని మేము ప్రార్థిస్తున్నాము.