క్రైస్తవులు స్వర్గంలో ప్రవేశిస్తారా?
- محاور التعريف بالإسلام
- المحتوى المخصص بحسب الدينمحتوى للنصارىالتعريف بالأنبياء السابقين ومكانة عيسى عليه السلامحقيقة عيسى عليه السلاماليوم الآخر والمصيرالجنة
- مصدر الإجابة
- قسم الأديان والفرق
- الباب / الفصل
- (قسم الأديان والفرق)
السؤال
క్రైస్తవులు స్వర్గంలో ప్రవేశిస్తారా?
الجواب
భూమ్యాకాశాలపై అధికారము అల్లాహ్ కే కలదు. ఆయన తాను కోరినది చేస్తాడు మరియు ఎంచుకుంటాడు, మరియు స్వచ్ఛమైన ధర్మం ఆయనకే చెందుతుంది. కావున సృష్టి ఆయనదే, సామ్రాజ్యం ఆయనదే మరియు శాసనాధికారం ఆయనదే. మహిమాన్వితమైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
﴾మరియు ఆకాశాలలో మరియు భూమిలో ఉన్నదంతా ఆయకు చెందినదే! మరియు నిరంతర విధేయతకు కేవలం ఆయనే అర్హుడు. ఏమీ? మీరు అల్లాహ్ ను కాదని ఇతరులకు భయభక్తులు చూపుతారా?﴿
[నహల్ : 97]
మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
﴾మరియు భూమ్యాకాశాల సామ్రాజ్యాధిపత్యం కేవలం అల్లాహ్ కే చెందినది. మరియు అల్లాహ్ ప్రతిదీ చేయగల సమర్థుడు.﴿
[సూరతు ఆలి ఇమ్రాన్: 52-55], మరియు సర్వోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
﴾తీర్పుదినానికి స్వామి.﴿
[సూరతుల్ ఫాతిహ: 5-7]
కావున ఇహలోకము మరియు పరలోకములో సంపూర్ణ అధికారం అల్లాహ్ కే చెందుతుంది. ఆయనే ధర్మాన్ని శాసించాడు మరియు దానికి ప్రతిఫలమిస్తాడు. ఇస్లాం అనేది సత్య ధర్మం అని, అది తప్ప ఇతర ధర్మాలన్నీ అసత్యమైనవని మరియు వాటిని ఆచరించే వారి నుండి అవి తిరస్కరించబడతాయని తీర్పుచేసింది ఆయనే. అదే విధంగా ఇహలోకము మరియు పరలోకము పరమ పవిత్రుడు మరియు మహోన్నతుడైన సత్యప్రభువుకే చెందుతాయి, కావున ఆయనే ఆదేశిస్తాడు మరియు తీర్పుచేస్తాడు. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:-
﴾మరియు ఆయనే, అల్లాహ్! ఆయన తప్ప మరొక ఆరాధ్య దైవం లేడు! మొదట (ఇహలోకంలో) మరియు చివరకు (పరలోకంలో) స్తుతింపదగినవాడు కేవలం ఆయనే! మరియు విశ్వన్యాయాధిపత్యం ఆయనదే. మీరంతా ఆయన వైపునకే మరలింపబడతారు.﴿
[సూరతుల్ ఖసస్: 70]
అల్లాహ్ తీర్పు చేశాడు మరియు ఆయన తీర్పే సత్యమైనది: అల్లాహ్ కొరకు కుమారుడిని చేసేవాడు బహుదైవారాధకుడు మరియు అవిశ్వాసి. మరియు మసీహ్ అలైహిస్సలాం క్రైస్తవులను అల్లాహ్ తో పాటు సాటి కల్పించటం నుండి హెచ్చరించారు, మరియు ఇతరులను అల్లాహ్ కు భాగస్వాములుగా చేసే వారికి నిశ్చయంగా అల్లాహ్ స్వర్గాన్ని నిషేధించాడని హెచ్చరించారు, మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చినట్లు:
﴾నిశ్చయంగా, మర్యమ్ కుమారుడు మసీహ్ (క్రీస్తు) యే అల్లాహ్!" అని పలికే వారు వాస్తవంగా సత్యతిరస్కారులు! మరియు మసీహ్ (క్రీస్తు) ఇలా అన్నాడు: "ఓ ఇస్రాయీల్ సంతతి వారలారా! నా ప్రభువు మరియు మీ ప్రభువైన అల్లాహ్ నే ఆరాధించండి. వాస్తవానికి, ఇతరులను అల్లాహ్ కు భాగస్వాములుగా చేసే వారికి, నిశ్చయంగా, అల్లాహ్ స్వర్గాన్ని నిషేధించాడు. మరియు వారి ఆశ్రయం నరకాగ్నియే! మరియు దుర్మార్గులకు సహాయం చేసే వారు ఎవ్వరూ ఉండరు. ﴿
[సూరతుల్ మాయిద : 44వ ఆయతు]
మరియు అల్లాహ్ యొక్క ప్రవక్తలు మరియు సందేశహరులు అలైహిముస్సలాతు వస్సలాంలలో ఎవరైనా ఒక్క ప్రవక్తను తిరస్కరించినా, అతను నరకంలో శాశ్వతంగా, ఎల్లప్పుడూ ఉంటాడు. మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
﴾ఆద్ జాతి, సందేశహరులను అసత్యవాదులని తిరస్కరించింది.﴿
[సూరతుష్ షుఅరా: 214]
వారు ప్రవక్తలను తిరస్కరించారని అల్లాహ్ తెలియపరచాడు, ఇంకా వారు తమ ప్రవక్తను తప్ప ఇంకెవరినీ తిరస్కరించలేదు, కానీ ఒక ప్రవక్తను తిరస్కరించినవాడు నిజానికి ప్రవక్తలందరినీ తిరస్కరించినట్లే; ఎందుకంటే వారందరి సందేశం ఒకటి, మరియు తన ప్రవక్తలలో (అలైహిస్సలాం) ఒక ప్రవక్తను అవిశ్వసించిన వారిని అల్లాహ్ అవిశ్వాసులుగా తీర్మానించాడు, మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
﴾ఓ విశ్వాసులారా! అల్లాహ్ ను, ఆయన సందేశహరుణ్ణి, ఆయన తన సందేశహరునిపై (ముహమ్మద్ పై) అవతరింపజేసిన గ్రంథాన్ని మరియు ఆయన ఇంతకు పూర్వం అవతరింపజేసిన గ్రంథాలన్నింటినీ విశ్వసించండి. అల్లాహ్ ను, ఆయన దూతలను, ఆయన గ్రంతాలను, ఆయన ప్రవక్తలను, అంతిమ దినాన్ని తిరస్కరించినవాడు, వాస్తవానికి మార్గభ్రష్టుడై, మార్గభ్రష్టత్వంలో చాలా దూరం పోయినట్లే!﴿
[సూరతు నిసా: 163],
యూదులు మరియు క్రైస్తవులకు సంబంధించి హదీసులో ఇలా వచ్చింది, అబూ హురైర ఉల్లేఖనం దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు:
“ఎవరి చేతిలోనైతే ఈ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రాణాలు ఉన్నాయో, ఆయన సాక్షిగా, ఈ జాతిలో (ఈ మానవ జాతిలో) అది యూదుల జాతి గాని, మరియు క్రైస్తవుల జాతి గానీ ఎవరైతే నా గురించి విని కూడా నేను ఏ సందేశముతో అయితే పంపబడినానో దానిని విశ్వసించకుండానే చనిపోతాడో, అతడు తప్పకుండా నరకవాసులలో ఒకడు అవుతాడు.”
[సహీహ్ ముస్లిం (170)].
మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు:
“ముస్లిం ఆత్మ తప్ప మరెవరూ స్వర్గంలో ముమ్మాటికి ప్రవేశించలేరు”
[ఈ హదీసును బుఖారీ, హదీథు సంఖ్య (2620) మరియు ముస్లిం, హదీథు సంఖ్య (1003) లో ఉల్లేఖించారు].
అయితే ఇస్లాం కాలాన్ని పొందని ఏకేశ్వరోపాసకులైన క్రైస్తవులు, ఎవరైతే అల్లాహ్ ను ప్రభువుగా మరియు ఈసా అలైహిస్సలాంను సందేశహరునిగా విశ్వసించారో, వారు విశ్వాసులు మరియు వారి గమ్యస్థానం స్వర్గము.
కానీ, ఏ మానవుడైతే ఇస్లాం సందేశం గురించి వినలేదో, మరియు అల్లాహ్ యొక్క ధర్మం ఏమిటో తెలుసుకోలేదో, మరియు ఎవరిపై ఆధారం నిరూపితమవలేదో, అల్లాహ్ అతనికి అన్యాయం చేయడని తెలుసుకోవాలి; ఎందుకంటే అల్లాహ్ న్యాయముగా తీర్పునిస్తాడు, మరియు ఆయన ప్రజలకు ఏమాత్రం అన్యాయం చేయడు. మరియు తీర్పు దినము నాడు అల్లాహ్ సృష్టితాలను తిరిగి లేపినప్పుడు, ఎవరికైతే ఇస్లాం సందేశం చేరలేదో వారిని ఆయన పరీక్షిస్తాడు; ఒకవేళ వారు విశ్వసించి మరియు సత్యమని అంగీకరిస్తే వారు స్వర్గంలో ప్రవేశిస్తారు, మరియు ఒకవేళ వారు తిరస్కరించి మరియు అహంకారం ప్రదర్శిస్తే, అల్లాహ్ పట్ల వారి అవిశ్వాసానికి, మూర్ఖత్వానికి మరియు అహంకారానికి గాను ఆయన వారిని నరకాగ్నిలో ప్రవేశింపజేస్తాడు.
المصدر
ملاحظات
--