Skip to content

ముస్లిమేతరులు మంచివారైనప్పటికీ నరకంలో ఎందుకు ప్రవేశిస్తారు?

محاور التعريف بالإسلام
اليوم الآخر والمصيرالنار
مصدر الإجابة
قسم ما يتعلق بغير المسلمين والشرك والعبادة
الباب / الفصل
(قسم ما يتعلق بغير المسلمين والشرك والعبادة)

السؤال

ముస్లిమేతరులు మంచివారైనప్పటికీ నరకంలో ఎందుకు ప్రవేశిస్తారు?

الجواب

ఈ ప్రశ్న తరచుగా తలెత్తవచ్చు: ఎవరైతే మంచి జీవితాన్ని గడిపి, నిజాయితీ మరియు సత్ప్రవర్తనతో వ్యవహరించాడో, కానీ అతను ముస్లిం కాకపోయినట్లయితే, అతడు నరకంలో ఎలా ప్రవేశిస్తాడు? ఇది అన్యాయం కాదా?

నిశ్చయంగా హక్కులన్నింటిలో అత్యంత గొప్ప హక్కు అల్లాహ్ కు చెందిన తౌహీద్ హక్కు. మనిషి సృష్టితాలతో సత్ప్రవర్తన కలిగి ఉండవచ్చు, కానీ అతనికి సమస్త శుభాలను అనుగ్రహించిన తన సృష్టికర్తను అతను తిరస్కరిస్తే, అతను అత్యంత గొప్ప హక్కును వృధా చేసినట్లే. కాబట్టి దాసుల హక్కుల కంటే అల్లాహ్ హక్కు అత్యంత గొప్పది. అది, ఎటువంటి భాగస్వామ్యం లేకుండా ఆరాధనను అల్లాహ్ ఒక్కడికే చేయడం. మహోన్నతుడైన అల్లాహ్ తన వచనంలో ఇలా సెలవిచ్చాడు:

﴾నిశ్చయంగా, అల్లాహ్ తనకు భాగస్వామిని (సాటిని) కల్పించటాన్ని ఏ మాత్రమూ క్షమించడు. మరియు అది తప్ప దేనిని (ఏ పాపాన్ని) అయినా, ఆయన తాను కోరిన వారిని క్షమిస్తాడు... ﴿

[నిసా: 1]

ఎవరైతే తౌహీద్‌ను తిరస్కరిస్తాడో, అతను ఎంతటి కార్యం చేసినా సరే, అతని నుండి ఏ ఆచరణ కూడా స్వీకరించబడదు.

అల్లాహ్ రెండు షరతులతో తప్ప ఏ ఆచరణనూ అంగీకరించడు: ఆయనను విశ్వసించడం మరియు ఆయన పట్ల చిత్తశుద్ధి కలిగి ఉండటం. కనుక ఈమాన్ (విశ్వాసం) లేని వ్యక్తి ఆచరణలో ప్రజలకు మేలు ఉన్నప్పటికీ, అల్లాహ్ అతని ఆచరణను స్వీకరించడు. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా తెలిపాడు:

﴾మరియు మేము, వారు (అవిశ్వాసులు) చేసిన కార్యాల వైపుకు మరలుతాము, తరువాత వాటిని సూక్ష్మకణాల వలే (ధూళి వలే) ఎగురవేస్తాము.﴿

[ఫుర్ఖాన్: 3]

ఎవరైనా ముస్లిమేతరుడు సత్కర్మ ఆచరిస్తే, అల్లాహ్ అతనికి ఈ ప్రపంచంలోనే మానసిక ప్రశాంతత, లేదా మంచి పేరు, లేదా సిరిసంపదలు, లేదా సంతానం రూపంలో దాని ప్రతిఫలాన్ని ప్రసాదించవచ్చు. మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా బోధించారు:

“నిశ్చయంగా ఒక కాఫిర్ (దైవదిక్కారి) సత్కర్మలు చేసినప్పుడు అతనికి ఈ ప్రపంచంలోనే ఉపాధి నొసగబడుతుంది.”

ఇక పరలోకంలో విశ్వాసం లేకుండా చేసే ఆచరణ అతనికి ఏ విధంగానూ ప్రయోజనం చేకూర్చదు.

మరియు అల్లాహ్ న్యాయవంతుడు, ఎవరినీ అతనికి ఆధారం చేరి అతను దానిని వ్యతిరేకించిన తరువాత తప్ప శిక్షించడు. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

﴾మరియు మేము ఒక ప్రవక్తను పంప నంత వరకు (ప్రజలకు) శిక్ష విధించేవారము కాము... ﴿

[అల్ ఇస్రా:15]

ఎవరైతే జీవించారో మరియు వారికి సరైన సందేశం చేరలేదో, ప్రళయ దినాన వారి తీర్పు అల్లాహ్ యొక్క ఆధీనములో ఉంటుంది. అల్లాహ్ యొక్క న్యాయము మరియు ఆయన కరుణను స్పష్టం చేసే విధంగా వారు పరీక్షించబడతారు.

తన సృష్టికర్తను తిరస్కరించిన వ్యక్తికి, ప్రజల పట్ల చూపే మంచి వైఖరి ఏమాత్రం ప్రయోజనం చేకూర్చదు. ఇది ఎలా ఉంటుందంటే, ఒక ఉద్యోగి తన సహోద్యోగుల పట్ల విధేయత కనబరుస్తూ, తనకు ఉద్యోగం ఇచ్చిన కంపెనీ మేనేజర్ ఉనికినే తిరస్కరించినట్లుగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ సమస్య సహోద్యోగులతో అతని ప్రవర్తనలో లేదు, బదులుగా అత్యంత గొప్ప హక్కుదారుడిని తిరస్కరించడంలో ఉంది.

తన అవిశ్వాస స్థితిలో మరణించిన వారు నరకంలో ప్రవేశించడం అన్యాయం కాదు, అది అల్లాహ్ యొక్క న్యాయం; ఎందుకంటే తౌహీద్ (ఏకదైవారాధన)ను తిరస్కరించడమే అతిపెద్ద పాపము. అయినప్పటికీ, అల్లాహ్ ఎవరికీ అన్యాయం చేయడు: ఎవరికైతే సత్యం చేరిన తరువాత దానికి విముఖత చూపుతారో వారు శిక్షకు అర్హులు, మరియు ఎవరికైతే రుజువు (సత్య సందేశం) చేరలేదో వారి తీర్పు అల్లాహ్ అధీనంలో ఉంటుంది. మరియు పరలోకదినాన పరిపూర్ణమైన న్యాయం స్పష్టమవుతుంది, అక్కడ ఎవరికీ అణువంత కూడా అన్యాయం జరగదు.

المصدر

قسم ما يتعلق بغير المسلمين والشرك والعبادة

ملاحظات

--