Skip to content

మనం చూడలేని దేవుడిని మనం ఎందుకు ఆరాధించాలి?

محاور التعريف بالإسلام
الشبهات والاعتراضات
مصدر الإجابة
قسم ما يتعلق بغير المسلمين والشرك والعبادة
الباب / الفصل
(قسم ما يتعلق بغير المسلمين والشرك والعبادة)

السؤال

మనం చూడలేని దేవుడిని మనం ఎందుకు ఆరాధించాలి?

الجواب

కొంతమంది ఇలా ప్రశ్నించవచ్చు: మన కంటికి కనిపించని ప్రభువును మనం ఎలా ఆరాధించాలి? మనం ఆయనను విశ్వసించాలంటే, ఆయన భౌతికంగా మరియు కంటికి కనిపించేలా ఉండటం సమంజసం కాదా?

మొదటిది: అల్లాహ్ ను చూడలేకపోవడం ఆయన ఉనికిని నిరాకరించదు.

మనం చూడలేని విషయాలు చాలా ఉన్నాయి, అయినప్పటికీ బుద్ధి, ఇంద్రియాలు మరియు వాటి ప్రభావాల ద్వారా వాటి ఉనికిని మనం ఖచ్చితంగా నమ్ముతున్నాము. (ఉదా: గాలి, విద్యుత్తు మరియు గురుత్వాకర్షణ శక్తి). వాటి ప్రభావాలను చూడడం వల్ల మనం వాటిని నమ్ముతున్నాము. అదేవిధంగా అల్లాహ్, ఆయన మహోన్నతుడు, ఎలాంటి లోపాలూ, కొరతలూ లేనివాడు, ఈ విశ్వంలో ఆయన సృష్టి, ఆయన శక్తి మరియు ఆయన గొప్పదనం యొక్క ప్రభావాలను మనం చూస్తున్నాము. కాబట్టి ఆయన ఉనికిని కళ్లతో చూడాల్సిన అవసరం లేనంత స్పష్టంగా ఉంటుంది. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

﴾... అల్లాహ్ ను గురించి (మీకు) సందేహం ఉందా? ఆకాశాలనూ మరియు భూమినీ సృష్టించిన... ﴿

[ఇబ్రాహీం: 10]

రెండవది: కంటి చూపులు ఆయనను గ్రహించలేనంతగా అల్లాహ్ మహోన్నతుడు.

అల్లాహ్ మహోన్నతుడు మరియు సంపూర్ణుడు, ఆయన సృష్టితాలను పోలి ఉండడు మరియు ఇంద్రియాలు ఆయనను తమ పరిధిలోకి తీసుకురాలేవు. కావున ఇహలోకంలో ఆయనను చూడలేకపోవడం ఆయనలో ఎలాంటి లోపమూ కాదు, బదులుగా అది ఆయన గొప్పదనం మరియు మహోన్నత స్థానం వల్లనే. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

﴾ఏ చూపులు కూడా ఆయనను అందుకోలేవు, కాని ఆయన (అన్ని) చూపులను పరివేష్టించి ఉన్నాడు. మరియు ఆయన సూక్ష్మగ్రాహి, సర్వం తెలిసినవాడు.﴿

[అల్ అన్ ఆమ్:103]

మూడవది: అగోచర విషయాలను విశ్వసించడంలోని ఆంతర్యం

అగోచర విషయాలను విశ్వసించడం దైవభీతి గలవారి అత్యంత గొప్ప లక్షణాలలో ఒకటి. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు :

﴾(వారికి) ఎవరైతే అగోచర యథార్థాన్ని విశ్వసిస్తారో...﴿

[అల్ బఖర: 21]

అగోచర విషయాలను విశ్వసించడం వల్ల మనిషిలో సత్యసంధత మరియు చిత్తశుద్ధి అభివృద్ది చెందుతాయి, మరియు అతను పూర్ణవిశ్వాసంతో మరియు తనను తాను సమర్పించుకోవడంతో అల్లాహ్‌ను ఆరాధిస్తున్నాడా, లేక కేవలం తన ఇంద్రియాలకు గోచరమయ్యే వాటినే ఆరాధిస్తున్నాడా అని అతని వాస్తవికత పరీక్షించబడుతుంది. మరియు ప్రపంచంలో పరీక్షించటం యొక్క ఉద్దేశ్యాలలో ఇది ఒకటి.

నాలుగవది: పరలోక దినాన తనను చూస్తారని అల్లాహ్ విశ్వాసులకు వాగ్దానం చేశాడు.

విశ్వాసులు వారికి ఒక పరీక్షగా ఈ ప్రపంచంలో అల్లాహ్ దర్శనం నుండి దూరం చేయబడతారు, కానీ స్వర్గంలో అతిపెద్ద అనుగ్రహం ఏమిటంటే అల్లాహ్ వారిని తన ముఖాన్ని దర్శించుకునేలా చేసి గౌరవించడమే, మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చినట్లు :

﴾ఆ రోజున కొన్ని ముఖాలు కళకళ లాడుతూ ఉంటాయి;

తమ ప్రభువు (అల్లాహ్) వైపునకు చూస్తూ ఉంటాయి.﴿

[అల్ ఖియామా: 22-23]

మహనీయ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు:

"నిశ్చయంగా మీరు ఏ విధంగానైతే పున్నమి రాత్రి చంద్రుడిని చూస్తున్నారో, ఆ విధంగా మీరు మీ ప్రభువును చూస్తారు; ఆయనను చూడడంలో మీరు ఎటువంటి ఇబ్బందినీ ఎదుర్కొనరు."

ఈ ప్రపంచములో (అల్లాహ్ ను) కనులారా చూసే భాగ్యానికి దూరమవడానికి ప్రతిగా పరలోకమునందు అత్యంత మహత్తరమైన వరం లభిస్తుంది.

కాబట్టి, ఈ ఇహలోకంలో మనం అల్లాహ్ ను చూడలేకపోయినప్పటికీ ఆయనను ఆరాధించటం అనేది వింత కాదు మరియు లోపం కూడా కాదు. బదులుగా, అది ఆయన గొప్పదనం యొక్క ఆవశ్యకత, మరియు అదృశ్య విషయాలపై విశ్వాసం ఉంచడంలో మన పరీక్షా రంగం. బుద్ధిపరమైన, సహజమైన, విశ్వసంబంధమైన మరియు ధార్మిక ఆధారాల ద్వారా ఆయన ఉనికి నిర్ధారించబడింది. ఒకవేళ ప్రజలు ఆయనను ప్రత్యక్షంగా చూసినట్లయితే, పరీక్షకు ఎలాంటి అర్థం మిగిలి ఉండేది కాదు, మరియు విశ్వాసం ఒక ఎంపికగా కాకుండా బలవంతంగా మారిపోయేది. ఈ ఇహలోకంలో విశ్వాసం అదృశ్యంగా ఉండాలన్నదే అల్లాహ్ యొక్క వివేకం, తద్వారా అసత్యపరుల నుండి సత్యవంతులు, మరియు వట్టి వాదనలు చేసేవారి నుండి చిత్తశుద్ధి గలవారు వేరుచేయబడతారు.

మరియు ఆయన దర్శనం అల్లాహ్ పరలోకంలో తన దాసుల కోసం భద్రపరిచిన గొప్ప అనుగ్రహం, కావున ఇప్పుడు ఆయనను విశ్వసించడం దాసుని సత్యసంధతకు నిదర్శనం అవుతుంది, మరియు పరలోకదినాన ఆయన ముఖ దర్శనము ఈ సత్యసంధతకు ప్రతిఫలం అవుతుంది.

المصدر

قسم ما يتعلق بغير المسلمين والشرك والعبادة

ملاحظات

--