Skip to content
القَلَم /

ఆయత్ 51

68 : 51
القَلَم ఆయతులు 52
సూరా · القَلَم
తెలుగు · Muhammad
68 : 51

وَإِن يَكَادُ ٱلَّذِينَ كَفَرُواْ لَيُزۡلِقُونَكَ بِأَبۡصَٰرِهِمۡ لَمَّا سَمِعُواْ ٱلذِّكۡرَ وَيَقُولُونَ إِنَّهُۥ لَمَجۡنُونٞ

మరియు ఆ సత్యతిరస్కారులు, ఈ సందేశాన్ని (ఖుర్ఆన్ ను) విన్నప్పుడు, తమ చూపులతో నీ కాళ్ళు ఊడగొడతారా అన్నట్లు (నిన్ను జారించి పడవేసేటట్లు) నిన్ను చూస్తున్నారు. మరియు వారు నిన్ను (ఓ ముహమ్మద్!): "నిశ్చయంగా ఇతడు పిచ్చివాడు!" అని అంటున్నారు.

Explanation & meanings · 1
  1. ఒకవేళ నీకు అల్లాహ్ (సు.తా.) రక్షణయే గనక లేకుంటా! వారిదిష్టి నీకు తగిలేది. (ఇబ్నె-కసీ'ర్). ఇబ్నె-కసీ'ర్ ఇంకా ఇలా వ్రాసారు. దిష్టి తగలటం మరియు అల్లాహ్ (సు.తా.) అనుమతితో దానివల్ల నష్టం కలగటం నిజమే. కావున 'హదీస్' లలో దీని నుండి విముక్తి పొందటానికి దు'ఆలు ఇవ్వబడ్డాయి మరియు ఈ సలహాలు కూడా ఇవ్వబడ్డాయి : ఏదైనా మంచి వస్తువును చూస్తే దిష్టి తగలకుండా ఉండటానికి : 'మాషా అల్లాహ్' లేక 'బారకల్లాహ్' అనాలి. ఒకవేళ దిష్టి తగిలితే : దిష్టి పెట్టినవాడు ఒక పాత్రలో స్నానం చేసి ఆ నీటిని దిష్టి తగిలినవాడి మీద పోయాలి. (ఇబ్నె-కసీ'ర్).