58 : 10
إِنَّمَا ٱلنَّجۡوَىٰ مِنَ ٱلشَّيۡطَٰنِ لِيَحۡزُنَ ٱلَّذِينَ ءَامَنُواْ وَلَيۡسَ بِضَآرِّهِمۡ شَيۡـًٔا إِلَّا بِإِذۡنِ ٱللَّهِۚ وَعَلَى ٱللَّهِ فَلۡيَتَوَكَّلِ ٱلۡمُؤۡمِنُونَ
నిశ్చయంగా, రహస్య సమాలోచన షైతాన్ చేష్టయే. అది విశ్వాసులకు దుఃఖం కలిగించటానికే! కాని అల్లాహ్ అనుమతి లేనిదే అది వారికి ఏ మాత్రం నష్టం కలిగించజాలదు. మరియు విశ్వాసులు కేవలం అల్లాహ్ మీదే నమ్మకం ఉంచుకోవాలి.
Explanation & meanings · 2
- ఒకవేళ మీరు ముగ్గురు ఒకేచోట ఉంటే, మీరు మీలో ఒకడిని విడిచి మిగతా ఇద్దరు పరస్పరం గుసగుసలాడుకోరాదు! ఎందుకంటే అది, మూడోవాణ్ణి చింతకు గురిచేస్తుంది. ('స'హీ'హ్ ముస్లిం, 'స'హీ'హ్ బు'ఖారీ) అతడు అనుమతిస్తే, మిగతా ఇద్దరు ఏకాంతంలో మాట్లాడుకోవచ్చు!
- చూడండి, 14:22.