Skip to content
صٓ /

ఆయత్ 44

38 : 44
صٓ ఆయతులు 88
సూరా · صٓ
తెలుగు · Muhammad
38 : 44

وَخُذۡ بِيَدِكَ ضِغۡثٗا فَٱضۡرِب بِّهِۦ وَلَا تَحۡنَثۡۗ إِنَّا وَجَدۡنَٰهُ صَابِرٗاۚ نِّعۡمَ ٱلۡعَبۡدُ إِنَّهُۥٓ أَوَّابٞ

(అల్లాహ్ అతనితో అన్నాడు): "ఒక పుల్లల కట్టను నీ చేతిలోకి తీసికొని దానితో (నీ భార్యను) కొట్టు మరియు నీ ఒట్టును భంగపరచుకోకు." వాస్తవానికి, మేము అతనిని ఎంతో సహనశీలునిగా పొందాము. అతను ఉత్తమ దాసుడు! నిశ్చయంగా, ఎల్లపుడు మా వైపునకు పశ్చాత్తాపంతో మరలుతూ ఉండేవాడు.

Explanation & meanings · 1
  1. రోగపీడుతుడుగా ఉన్న కాలంలో అయ్యూబ్ ('అ.స.) కోపంతో తన భార్యను - ఆమె తెలియకుండా చేసిన ఒక అపరాధానికి క్రోధితుడై - నూరు కొరడా దెబ్బలు కొడతానని ప్రమాణం చేస్తారు. ఆ ప్రమాణం పూర్తి చేయటానికి అల్లాహ్ (సు.తా.) అతనితో నూరు పుల్లల కట్టతో ఒకసారి నీ భార్యను కొట్టి నీ ప్రమాణం పూర్తి చేసుకో అని ఆదేశిస్తాడు. చూడండి, 5:89. ఈ ఆజ్ఞ కేవలం అయ్యూబ్ ('అ.స.) కొరకేనా, లేక అందరి కొరకా అనే విషయంలో వ్యాఖ్యాతల మధ్య భేదాభిప్రాయాలున్నాయి. కొందరు అంటారు : ఒకవేళ మొదట ప్రమాణం చేసినప్పుడు కఠినంగా శిక్షించదలిచే అభిప్రాయం లేకుంటే ఇలా చేయవచ్చు, (ఫ'త్హ్ అల్-ఖదీర్). ఒక 'హదీస్' ద్వారా తెలుస్తోంది : ఒకసారి దైవప్రవక్త ('స'అస) ఒక బలహీనుడైన వ్యభిచారికి, నూరు కొరడా దెబ్బలకు బదులుగా నూరు పుల్లల్లున్న చీపురు కట్టతో ఒకేసారి కొట్టి వదిలారు (ముస్నద్ అ'హ్మద్, 5/222, ఇబ్నె మాజా).