35 : 29
إِنَّ ٱلَّذِينَ يَتۡلُونَ كِتَٰبَ ٱللَّهِ وَأَقَامُواْ ٱلصَّلَوٰةَ وَأَنفَقُواْ مِمَّا رَزَقۡنَٰهُمۡ سِرّٗا وَعَلَانِيَةٗ يَرۡجُونَ تِجَٰرَةٗ لَّن تَبُورَ
నిశ్చయంగా, అల్లాహ్ గ్రంథాన్ని (ఖుర్ఆన్ ను) పారాయణం చేసేవారు మరియు నమాజ్ ను స్థాపించేవారు మరియు తమకు ప్రసాదించబడిన జీవనోపాధి నుండి రహస్యంగా మరియు బహిరంగంగా ఖర్చు (దానం) చేసేవారు అందరూ! నష్టంలేని వ్యాపారాన్ని అపేక్షించేవారే!
Explanation & meanings · 1
- బహిరంగంగా ఖర్చు చేయటం అంటే విధి జకాత్ చెల్లించటం మరియు రహస్యంగా అంటే జకాత్ చెల్లించిన తరువాత అధికంగా దానం చేయటం.