34 : 16
فَأَعۡرَضُواْ فَأَرۡسَلۡنَا عَلَيۡهِمۡ سَيۡلَ ٱلۡعَرِمِ وَبَدَّلۡنَٰهُم بِجَنَّتَيۡهِمۡ جَنَّتَيۡنِ ذَوَاتَيۡ أُكُلٍ خَمۡطٖ وَأَثۡلٖ وَشَيۡءٖ مِّن سِدۡرٖ قَلِيلٖ
అయినా వారు విముఖులయ్యారు. కాబట్టి మేము వారి పైకి, కట్టను తెంచి వరదను పంపాము. మరియు వారి రెండు తోటలను చేదైనా ఫలాలిచ్చే చెట్లు, ఝావుక చెట్లు మరియు కొన్ని మాత్రమే రేగు చెట్లు ఉన్న తోటలుగా మార్చాము.
Explanation & meanings · 1
- అస్లీ'న్, ఝావుక చెట్లు (Tamarisk Trees) లేక వాటివంటి చెట్లు. దీని తాత్పర్యమేమిటంటే, వారి అవిశ్వాస వైఖరి మరియు సత్యతిరస్కారం వల్ల, మొదట మంచి ఫలాలనిచ్చే ఆ రెండు తోటలు ఎక్కువగా చేదైన ఫలాలిచ్చే పెద్ద పెద్ద ముండ్లు గల చెట్లుగా మారిపోయాయి. మరియు కొన్ని మాత్రమే మంచి ఫలాలిచ్చే రేగుచెట్లు (Lote-Trees)గా మిగిలి పోయాయి.