32 : 5
يُدَبِّرُ ٱلۡأَمۡرَ مِنَ ٱلسَّمَآءِ إِلَى ٱلۡأَرۡضِ ثُمَّ يَعۡرُجُ إِلَيۡهِ فِي يَوۡمٖ كَانَ مِقۡدَارُهُۥٓ أَلۡفَ سَنَةٖ مِّمَّا تَعُدُّونَ
ఆయనే ఆకాశం నుండి భూమి వరకు ప్రతి వ్యవహారాన్ని నడిపిస్తున్నాడు; తరువాత అంతా ఒకే దినమున, ఆయన వద్దకు పోయి చేరుతుంది; దాని (ఆ దినపు) పరిమాణం మీ లెక్క ప్రకారం వేయి సంవత్సరాలు.
Explanation & meanings · 1
- అంటే ఇది పునరుత్థానదినం అని, కొందరు వ్యాఖ్యాతలు బోధించారు. అది చాలా కష్టతరమైన దినం కావటం వల్ల వేయి సంవత్సరాల వలే కనిపిస్తుంది. చూడండి, 22:47లో కూడా: "…మరియు నిశ్చయంగా, నీ ప్రభువు వద్ద ఒక్క వద్ద ఒక్క దినం, మీ లెక్కల ప్రకారం వేయి సంపత్సరాలకు సమానమైనది." అని ఉంది. కాని 70:4లో: "యాభై వేల సంవత్సరాలకు సమానమైన (ప్రమాణం గల) ఒక రోజులో, దేవదూతలు మరియు ఆత్మ (జిబ్రీల్ 'అ.స.) ఆయన (సు.తా.) వద్దకు అధిరోహిస్తారు." అని, ఉంది. అంటే వారు అంత తీవ్రంగా ప్రయాణం చేస్తారన్నమాట.