22 : 31
حُنَفَآءَ لِلَّهِ غَيۡرَ مُشۡرِكِينَ بِهِۦۚ وَمَن يُشۡرِكۡ بِٱللَّهِ فَكَأَنَّمَا خَرَّ مِنَ ٱلسَّمَآءِ فَتَخۡطَفُهُ ٱلطَّيۡرُ أَوۡ تَهۡوِي بِهِ ٱلرِّيحُ فِي مَكَانٖ سَحِيقٖ
ఏకాగ్రచిత్తంతో (ఏకదైవ సిద్ధాంతంతో) అల్లాహ్ వైపునకే మరలండి. ఆయనకు సాటి (భాగస్వాములను) కల్పించకండి. అల్లాహ్ కు సాటి కల్పించిన వాని గతి ఆకాశం నుండి క్రింద పడిపోయే దాని వంటిదే! దానిని పక్షులైనా ఎత్తుకొని పోవచ్చు, లేదా గాలి అయినా దూర ప్రదేశాలకు ఎగుర గొట్టుకు పోవచ్చు!
Explanation & meanings · 1
- హునఫా': అంటే ఒకే వైపుకు మొగ్గటం. అంటే ఏకదైవ సిద్ధాంతాన్ని పాటించటం. ఆరాధనలను కేవలం ఆ ఏకైక ఆరాధ్యుడు అల్లాహ్ (సు.తా.) కే ప్రత్యేకించుకోవటం. ఇంకా చూడండి, 2:135.