Skip to content
అల్-బఖరహ్ /

ఆయత్ 17

2 : 17

ఆయత్ 17 of అల్-బఖరహ్ (2 : 17). This page carries the verse in the Uthmani script with a translation of its meaning, at a stable URL that can be cited on its own.

అల్-బఖరహ్ ఆయతులు 286
సూరా · అల్-బఖరహ్
తెలుగు · Muhammad
2 : 17

مَثَلُهُمۡ كَمَثَلِ ٱلَّذِي ٱسۡتَوۡقَدَ نَارٗا فَلَمَّآ أَضَآءَتۡ مَا حَوۡلَهُۥ ذَهَبَ ٱللَّهُ بِنُورِهِمۡ وَتَرَكَهُمۡ فِي ظُلُمَٰتٖ لَّا يُبۡصِرُونَ

వారి ఉపమానం ఇలా ఉంది: ఒక అగ్నిని వెలిగించగా, అది పరిసరాలను ప్రకాశింపజేసిన తర్వాత అల్లాహ్ వారి వెలుగును తీసుకుని వారిని అంధకారంలో విడిచి పెట్టడం వల్ల, వారు ఏమీ చూడలేక పోతారు.

Explanation & meanings · 2
  1. మస'లున్: అంటే ఉపమానం, పోలిక, సాదృశ్యం, దృష్టాంతం అనే అర్థాలున్నాలు.
  2. 'అబ్దుల్లాహ్ బిన్-మస్'ఊద్ (ర'ది. 'అ.) కథనం (ఫ'త్హ్ అల్-ఖదీర్): మహాప్రవక్త ('స'అస), మదీనాకు వచ్చిన తరువాత విశ్వసించిన వారిలో కొందరు కాపట్యానికి లోనవుతారు. అంటే వారు ఇస్లాం వెలుగును పొందిన తరువాత దానిని విడిచి మరల అంధకారంలో చిక్కుకు పోతారు. ఆ విషయం ఈ విధంగా బోధించబడింది. ఒక వ్యక్తి రాత్రిలో ఎడారిలో మంట వెలిగించి కాపుకుంటాడు. అది వారి పరిసరాలను వెలిగిస్తుంది. కాని ఆ అగ్ని ఆరి పోగానే వారు మళ్ళీ అంధకారంలో చిక్కు కుంటారు. ఏమీ చూడ లేక పోతారు. అదే విధంగా బాహ్యంగా మాత్రమే ఇస్లాం స్వీకరించిన వారి హృదయాలు అంధకారంలో ఉండి పోతాయి. వారు ఇస్లాం వెలుగును పొందిన తరువాత కూడా అంధకారంలోనే ఉండి పోతారు.