19 : 97
فَإِنَّمَا يَسَّرۡنَٰهُ بِلِسَانِكَ لِتُبَشِّرَ بِهِ ٱلۡمُتَّقِينَ وَتُنذِرَ بِهِۦ قَوۡمٗا لُّدّٗا
కావున నీవు (ఓ ప్రవక్తా!) దైవభీతి గలవారికి శుభవార్త నివ్వటానికి మరియు వాదులాడే జాతి వారిని హెచ్చరించటానికీ, మేము దీనిని (ఈ ఖుర్ఆన్ ను) సులభతరం చేసి, నీ భాషలో అవతరింపజేశాము.
Explanation & meanings · 1
- మానవుడు అల్లాహ్ (సు.తా.) మాటలను అర్థం చేసుకోవటానికి ఆయన దివ్యగ్రంథాలను ఆ ప్రాంతపు ప్రజల భాషలోనే అవతరింపజేశాడు, చూడండి, 14:4 మరియు ము'హమ్మద్ ('స'అస) పై ఈ ఖుర్ఆన్ అవతరణ కొరకు చూడండి, 2:97 మరియు 26:193-194.