Skip to content
الكَهف /

ఆయత్ 94

18 : 94

ఆయత్ 94 of الكَهف (18 : 94). This page carries the verse in the Uthmani script with a translation of its meaning, at a stable URL that can be cited on its own.

الكَهف ఆయతులు 110
సూరా · الكَهف
తెలుగు · Muhammad
18 : 94

قَالُواْ يَٰذَا ٱلۡقَرۡنَيۡنِ إِنَّ يَأۡجُوجَ وَمَأۡجُوجَ مُفۡسِدُونَ فِي ٱلۡأَرۡضِ فَهَلۡ نَجۡعَلُ لَكَ خَرۡجًا عَلَىٰٓ أَن تَجۡعَلَ بَيۡنَنَا وَبَيۡنَهُمۡ سَدّٗا

వారన్నారు: "ఓ జుల్ ఖర్ నైన్! వాస్తవానికి యాజూజ్ మరియు మాజూజ్ లు, ఈ భూభాగంలో కల్లోలం రేకెత్తిస్తున్నారు. అయితే నీవు మాకూ మరియు వారికీ మధ్య ఒక అడ్డుగోడను నిర్మించటానికి, మేము నీకేమైనా శుల్కం చెల్లించాలా?"

Explanation & meanings · 1
  1. వీరి గాథ బైబిల్ లో కూడా పేర్కొనబడింది. చూడండి, యెహంజ్కేలు - (Exekiel), 38:2 మరియు 39:6. ఇంకా ఇతర చోట్లలో కూడా వీరి విషయం పేర్కొనబడింది. చూడండి, యోహాను ప్రకటన - (Revelation of St. John), 20:8. చాలా మంది వ్యాఖ్యాతలు వీరిని మంగోలులు లేక టాటార్ లు (Mongols or Tatars) కావచ్చని అంటారు. వీరు అసత్యవాదులు మరియు అంతిమ గడియకు ముందు భూమిలో కల్లోలం రేకెత్తించి మానవ నాగరికతను నాశనం చేస్తారు. ఇంకా చూడండి, 21:96-97. వాస్తవం అల్లాహ్ (సు.తా.)కే తెలుసు. 'స'హీ'హ్ బు'ఖారీ మరియు ముస్లింలలో ఇలా ఉంది: 'యా'జూజ్ మా'జూజ్ లు,' రెండు మానవ జాతులు. వారి సంఖ్య ఇతర మానవుల కంటే అధికముగా ఉంటుంది. మరియు వారితోనే నరకం అత్యధికంగా నిండుతుంది.