18 : 60
وَإِذۡ قَالَ مُوسَىٰ لِفَتَىٰهُ لَآ أَبۡرَحُ حَتَّىٰٓ أَبۡلُغَ مَجۡمَعَ ٱلۡبَحۡرَيۡنِ أَوۡ أَمۡضِيَ حُقُبٗا
మరియు (జ్ఞాపకం చేసుకోండి) మూసా తన సేవకునితో ఇలా అన్నది: "రెండు సముద్రాల సంగమ స్థలానికి చేరనంత వరకు నేను నా ప్రయాణాన్ని ఆపను. నేను సంవత్సరాల తరబడి సంచరిస్తూ ఉండవలసినా సరే!"
Explanation & meanings · 3
- ఈ యువకుడే యూషాఅ'బిన్. మూసా ('అ.స.) తరువాత, అతను తన జాతి వారికి నాయకత్వాన్ని వహించారు.
- ఈ సంగమ స్థానం అఖ్బా అఖాతం మరియు సూయజ్ అఖాతం రెండు వచ్చి ఎర్ర సముద్రంలో (రెడ్ సీ) లో కలిసే సంగమం కావచ్చని వ్యాఖ్యాతల అభిప్రాయం.
- మూసా ('అ.స.) ఒకనితో ఒకసారి: 'నాకు మించిన జ్ఞానవంతుడు ఇప్పుడు ఎవ్వడూ లేడు!' అని అంటారు. అది అల్లాహ్ (సు.తా.)కు నచ్చదు. అప్పుడు అల్లాహుతా'ఆలా అతనితో రెండు సముద్రాల సంగమంలో నీవు: 'నిన్ను మించిన జ్ఞానిని పొందగలవు.' అని దివ్యజ్ఞానం ద్వారా తెలుపుతాడు. అప్పుడతను ('అ.స.) ఆ జ్ఞాని అన్వేషణలో బయలుదేరుతారు.