Skip to content
الكَهف /

ఆయత్ 45

18 : 45
الكَهف ఆయతులు 110
సూరా · الكَهف
తెలుగు · Muhammad
18 : 45

وَٱضۡرِبۡ لَهُم مَّثَلَ ٱلۡحَيَوٰةِ ٱلدُّنۡيَا كَمَآءٍ أَنزَلۡنَٰهُ مِنَ ٱلسَّمَآءِ فَٱخۡتَلَطَ بِهِۦ نَبَاتُ ٱلۡأَرۡضِ فَأَصۡبَحَ هَشِيمٗا تَذۡرُوهُ ٱلرِّيَٰحُۗ وَكَانَ ٱللَّهُ عَلَىٰ كُلِّ شَيۡءٖ مُّقۡتَدِرًا

మరియు వారికి ఇహలోక జీవితాన్ని ఈ ఉపమానం ద్వారా బోధించు: మేము ఆకాశం నుండి నీటిని కురిపించినపుడు, దానిని భూమిలోని చెట్టూ చేమలు పీల్చుకొని (పచ్చగా పెరుగుతాయి). ఆ తరువాత అవి ఎండి పొట్టుగా మారిపోయినపుడు, గాలి వాటిని చెల్లాచెదురు చేస్తుంది. మరియు వాస్తవానికి అల్లాహ్ యే ప్రతిదీ చేయగల సమర్ధుడు.

Explanation & meanings · 1
  1. ఇహలోక జీవితం ఈ విధంగా బోధించబడుతోంది: అల్లాహుతా'ఆలా! ఆ ఏకైక ఆరాధ్యుడు, సర్వశక్తిమంతుడు, కోరితే మన జీవితాలను, వర్షం కురిసినపుడు కళకళలాడే పంటపొలాల మాదిరిగా చేయగలడు. లేదా ఎండిన పొట్టుగా గాలికి ఎగురవేయగలడు. కేవలం అల్లాహ్ (సు.తా.) యే ప్రతిదీ చేయగల సమర్థుడు. ఇటువంటి వాక్యాలకు చూడండి 10:24, 39:21, 57:20