18 : 31
أُوْلَٰٓئِكَ لَهُمۡ جَنَّٰتُ عَدۡنٖ تَجۡرِي مِن تَحۡتِهِمُ ٱلۡأَنۡهَٰرُ يُحَلَّوۡنَ فِيهَا مِنۡ أَسَاوِرَ مِن ذَهَبٖ وَيَلۡبَسُونَ ثِيَابًا خُضۡرٗا مِّن سُندُسٖ وَإِسۡتَبۡرَقٖ مُّتَّكِـِٔينَ فِيهَا عَلَى ٱلۡأَرَآئِكِۚ نِعۡمَ ٱلثَّوَابُ وَحَسُنَتۡ مُرۡتَفَقٗا
అలాంటి వారు! వారి కొరకు క్రింద సెలయేళ్ళు ప్రవహించే శాశ్వత స్వర్గవనాలు ఉంటాయి. అందు వారు బంగారు కంకణాలను మరియు ఆకు పచ్చని బంగారు జలతారుగల పట్టు వస్త్రాలను ధరించి, ఎత్తైన ఆసనాలపై దిండ్లకు ఆనుకొని కూర్చొని ఉంటారు. ఎంత మంచి ప్రతిఫలం మరియు ఎంత శ్రేష్ఠమైన విరామ స్థలం!
Explanation & meanings · 1
- రాజులు బంగారు కంకణాలు, ఆభరణాలు మరియు పట్టు వస్త్రాలు ధరిస్తారు. స్వర్గవాసులకు రాజులకు ఉంటేటటువంటి సుఖసంతోషాలు ఉంటాయిని చెప్పడానికి ఈ వివరాలు ఇవ్వబడ్డాయి. మరియు పురుషులకు ఇహలోకంలో హరాం చేయబడిన, బంగారు ఆభరణాలు మరియు పట్టు వస్త్రాలను వారు త్యజించుకుంటే వారికి స్వర్గంలో అవన్నీ లభిస్తాయి. అంతేగాక వారు కోరేవన్నీ దొరుకుతాయి. చూడండి, 22:23, 35:33, 76:21.